HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Ys Jagan My Be In Trouble With Manifesto Issues

YS Jagan : ఆ రెండు అంశాలు జ‌గ‌న్ కు ఇబ్బందే!

''ఎన్నికల్లో విజయం సాధించేందుకు అనేక హామీలు ఇస్తాం. అవన్నీ సాధ్యమా?కాదా? అనేది అధికారం లోకి వచ్చాక తెలుస్తుంది''

  • Author : CS Rao Date : 19-09-2022 - 12:57 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt

”ఎన్నికల్లో విజయం సాధించేందుకు అనేక హామీలు ఇస్తాం. అవన్నీ సాధ్యమా?కాదా? అనేది అధికారం లోకి వచ్చాక తెలుస్తుంది” ఇదీ, కొన్నాళ్ల కిందట కర్ణాటక ముఖ్యమంత్రి బొమ్మై చేసిన వ్యాఖ్యలు. అప్పట్లో ఆయన తీవ్రస్థాయిలో విమర్శలు ఎదుర్కొన్నారు. ఇప్పుడు అలాంటి పరిస్థితి ఏపీలోనూ వచ్చేలా కనిపిస్తోంది. కీలకమైన అంశాల్లో సర్కారు మడమ తిప్పక తప్పని పరిస్థితి నెలకొంది. దీంతో వచ్చే ఎన్నికల్లో మాట‌త‌ప్పిన అంశాల‌ను ప్రత్యర్థి పార్టీలు బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్ల‌డానికి సిద్ధం అవుతున్నాయి.

దీంతో వైసీపీ నాయకులు ”తెలివిలేదు..తెలియలేదు.. తొందరపడ్డాం..” అని ప్రజలకు చెప్పేందుకు రెడీ అయ్యారట. ఇంతకీ ఏం జరిగిందంటే, రెండు కీలక విషయాల్లో వైసీపీ సర్కారు అడ్డంగా దొరికిపో యింది. అందులో ఒక‌టి ఉద్యోగుల‌కు సీపీఎస్ రద్దు చేస్తానని ఇచ్చిన హామీ. ఆ హామీనిఎన్నికలకు ముందు భారీగానే ప్రచారం కల్పించారు. అధికారంలోకి వ‌చ్చిన‌ వారంలోపు సీపీఎస్ రద్దు చేస్తాన‌ని జ‌గ‌న్ ఆనాడు హామీ ఇచ్చారు. అయితే, మూడేళ్లు దాటిపోయినా ఇప్పటి వరకు దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీనిపైనే ఉద్యోగులు ఉద్యమం చేస్తున్నారు. ప్రభుత్వం మాత్రం తాము చేయలేమని స్పష్టం చేస్తోంది. అంతేకాదు, ఇప్పటికే సజ్జల ఒకటికి రెండు సార్లు `తెలియక హామీ ఇచ్చాం` అంటూ చెప్పుకొచ్చిన విష‌యం విదిత‌మే.

Also Read:   Jagan Politics: లోకేష్, పవన్ కు జలక్ ఇచ్చేలా జగన్ ఎత్తుగడ

ఇక రెండో మరో కీలక హామీ మద్య నిషేధం. విడతల వారీగా నిషేధిస్తామ‌ని జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌తి వేదిక‌పైనా ఎన్నిక‌ల సంద‌ర్భంగా హామీ ఇచ్చారు. అక్కచెల్లెమ్మల తాళిబొట్లకు రక్షణగా ఉంటామని ఊద‌ర‌కొట్టారు. మ‌ద్య‌నిషేధం విష‌యంలో పూర్తిగా యూటర్న్ తీసుకున్నారు. మౌలిక ప్రమాణాలను మెరుగుపరిచే దృష్టితో రాష్ట్రంలో ఆల్కహాల్ వినియోగ స్థాయులను తగ్గించే విధానానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స‌న్నాయినొక్కులు నొక్క‌డం ప్రారంభించారు. నిషేధం ఎప్పటిలోగా చేస్తారని ప్ర‌శ్నిస్తే, తేదీ, నెల లేదా సంవత్సరమ‌ని సమాధానం ఇవ్వాలి. అలా కాకుండా కేవలం వినియోగాన్ని తగ్గిస్తామని మాత్రమే ప్ర‌భుత్వం చెబుతోంది. అంటే మద్య నిషేధం అనే మాటే లేదని స్పష్టం అయిపోయింది.

ఈ రెండు అంశాలపైనే వచ్చే ఎన్నికల్లో ప్రత్యర్థి పార్టీలు వైసీపీని ఇరుకున పెట్టే ప్రయత్నం చేసే అవకాశం ఉంది. దీంతో ఆ రెండు హామీల‌పై ప్రజలకు అస‌లు విష‌యాన్ని వివరించాలని వైసీపీ ఇప్పటికే సిద్ధం అయింది. వాస్తవానికి సంపూర్ణ మద్య నిషేధంపై ఇప్పటి వరకూ ప్రజలకు ఏ మూలనో ఉన్న చిన్న ఆశ కూడా ఇప్పుడు కరిగిపోయింది. ఇక సీపీఎస్ ర‌ద్దు అంశాన్ని మ‌సిపూసీమారేడుకాయ‌లా చేయాల‌ని జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి చూస్తున్నారు. అందుకే, ప్ర‌జ‌ల‌ను క్ష‌మాప‌ణ అడిగే ప‌రిస్థితికి వ‌చ్చేస్తున్నార‌ని తెలుస్తోంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • AP CM YS Jagan
  • liquor ban in manifesto
  • ysrcp

Related News

Avinash Reddy faces setback in Supreme Court

వెంటనే లొంగిపోవాలి .. అవినాష్‌రెడ్డికి సుప్రీంకోర్టు ఆదేశాలు

దేశ అత్యున్నత న్యాయస్థానం అవినాష్‌రెడ్డి విజ్ఞప్తిని తోసిపుచ్చుతూ ఆయనకు ముందస్తు బెయిల్‌ ఇవ్వలేమని స్పష్టం చేసింది. ఈ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్‌ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది.

  • Ambati Rambabu

    అంబటి రాంబాబు అనే కుక్కకీ ఒక రోజొస్తుంది

Latest News

  • ASUS : హైదరాబాద్ లో ఆసుస్ విస్తరణ

  • Nifty : భారత ఆర్థిక వ్యవస్థలో నూతన వృద్ధి శకం

  • Hyderabad Real Estate : హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌లో జెన్ జెడ్ విప్లవం

  • టీమిండియాకు బిగ్ షాక్‌.. కీల‌క ఆట‌గాడికి గాయం?

  • కేంద్రంపై సుప్రీంకోర్టు ఆగ్ర‌హం.. కార‌ణ‌మిదే?!

Trending News

    • టీ20 వరల్డ్ కప్ 2026.. భార‌త్‌కు సౌతాఫ్రికా సాయం చేయ‌నుందా?

    • Save Punarvika : పునర్వికకు పునర్జన్మ.. రూ.16 కోట్లు అందజేసిన దాతలు

    • మీ వాహనంపై ట్రాఫిక్ చలాన్ పడిందా? అయితే ఇలా చేయండి!

    • సుదీర్ఘ నిరీక్షణకు తెర .. కేరళ ఇక పై ‘కేరళం’.. పేరు మార్పుకు కేంద్ర కేబినెట్ ఆమోదం

    • టీ20 వరల్డ్ కప్ 2026 షెడ్యూల్‌లో భారీ మార్పులు.. శ్రీలంక, పాకిస్థాన్ జట్ల కోసం కొత్త రూల్స్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd