Tenali : పోలీసుల వేధింపులతో యువకుడు ఆత్మహత్య..జగన్ రియాక్షన్
Tenali : ఈ పరిణామాల నేపథ్యంలో జగన్ జూన్ 3న తెనాలికి వెళ్లనున్నట్లు ప్రకటించారు. తెనాలి పోలీసుల థర్డ్ డిగ్రీ దాడుల బాధితులను, ముఖ్యంగా దళిత, ముస్లిం యువకులను పరామర్శించేందుకు జగన్ సిద్ధమవుతున్నారు
- By Sudheer Published Date - 03:13 PM, Mon - 2 June 25

తెనాలి(Tenali)లో ఇటీవల చోటుచేసుకున్న పోలీసుల (Police) దురుసు ప్రవర్తనపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పట్టపగలే ముగ్గురు యువకులను నడిరోడ్డుపై లాఠీలతో కొడుతున్న వీడియో వైరల్ అయింది. ఈ ఘటనపై తెనాలి పోలీసులు స్పందిస్తూ, వారు గంజాయి మత్తులో పోలీసులు పై దాడికి పాల్పడ్డారని, అందుకే తగిన బుద్ధి చెప్పినట్లు వివరణ ఇచ్చారు. కానిస్టేబుల్‌పై హత్యాయత్నం జరిగిందని అతని భార్య మీడియా ముందుకొచ్చి కన్నీళ్లతో తన బాధను వ్యక్తం చేయడంతో సంఘటన మరింత చర్చనీయాంశంగా మారింది.
Glenn Maxwell: స్టార్ క్రికెటర్ రిటైర్మెంట్.. ఆసీస్‌కు భారీ షాక్!
ఇక వైఎస్సార్సీపీ పార్టీ (YCP)ఈ ఘటనపై తీవ్ర స్థాయిలో మండిపడుతోంది. తెనాలి పోలీసుల వేధింపులతో సిద్ధేష్ (Siddhesh dies) అనే యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఆరోపించింది. ఎం.ఎం. జ్యువెలరీ కేసు దర్యాప్తులో భాగంగా పోలీసుల వేధింపులే కారణమని వైసీపీ నేతలు స్పష్టం చేస్తున్నారు. మానసికంగా భయబ్రాంతులకు గురైన సిద్ధేష్ బలవన్మరణం చెందాడని, ఆయన మృతదేహాన్ని మహారాష్ట్రకు తరలించి నిజాన్ని దాచేందుకు యత్నిస్తున్నారని వైసీపీ అధినేత వైఎస్ జగన్ (Jagan) తీవ్ర ఆరోపణలు చేశారు.
ఈ పరిణామాల నేపథ్యంలో జగన్ జూన్ 3న తెనాలికి వెళ్లనున్నట్లు ప్రకటించారు. తెనాలి పోలీసుల థర్డ్ డిగ్రీ దాడుల బాధితులను, ముఖ్యంగా దళిత, ముస్లిం యువకులను పరామర్శించేందుకు జగన్ సిద్ధమవుతున్నారు.
Same Tenali cops behind another tragedy: Siddhesh dies after police harassment
Tenali, June 1: The same police officers who were recently caught on video brutally assaulting three Dalit youths in broad daylight in Tenali are now being accused of driving another young man,… pic.twitter.com/rFyyglLpXk
— YSR Congress Party (@YSRCParty) June 1, 2025