Volunteer System : వామ్మో.. వలంటీర్లకు శిక్షణ పేరుతో రూ.273 కోట్లు ఖర్చు పెట్టిన వైసీపీ
Volunteer System : రామ్ ఇన్ ఫో (Ram in Fo)అనే ప్రైవేట్ సంస్థకు ఈ శిక్షణ బాధ్యతలు అప్పగించి, ఏటా రూ.68 కోట్ల చొప్పున చెల్లించడం జరిగిందని అధికారిక లెక్కల ద్వారా వెల్లడయ్యింది
- Author : Sudheer
Date : 12-05-2025 - 1:21 IST
Published By : Hashtagu Telugu Desk
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (Jagan) ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమలైన వలంటీర్ వ్యవస్థ(Volunteer System)ను ప్రజలకు సేవలు అందించేందుకు తీసుకొచ్చిదిగా చెప్పినప్పటికీ, ఇప్పుడు ఆ వ్యవస్థపై ఎన్నో ఆరోపణలు వెలుగు చూస్తున్నాయి. ముఖ్యంగా ఈ వలంటీర్లకు శిక్షణ పేరుతో వైసీపీ రూ.273 కోట్లకు పైగా ఖర్చు చేసిన విషయమే ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. రామ్ ఇన్ ఫో (Ram in Fo)అనే ప్రైవేట్ సంస్థకు ఈ శిక్షణ బాధ్యతలు అప్పగించి, ఏటా రూ.68 కోట్ల చొప్పున చెల్లించడం జరిగిందని అధికారిక లెక్కల ద్వారా వెల్లడయ్యింది. అయితే ప్రజల్లో ఎక్కువమందికి ఈ సంస్థ పేరు కూడా తెలియకపోవడం గమనార్హం.
వలంటీర్లకు తగిన శిక్షణ ఇచ్చారని చెబుతున్నా, వాస్తవంగా గ్రామ స్థాయిలో అలాంటి శిక్షణలు కనిపించకపోవడం, లేదా ఏవైనా ప్రామాణిక ధాఖలాలు లేకపోవడం అనుమానాలకు తావిస్తోంది. స్థానికంగా ఐప్యాక్ సభ్యులు – వైసీపీకి వ్యూహాలను అందించిన రాజకీయ సలహాదారులే – వలంటీర్లకు శిక్షణ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇది కేవలం సేవా శిక్షణ కాదు, రాజకీయ ప్రయోజనాల కోసం చేయబడిన పని అన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.
ఇక రామ్ ఇన్ ఫో అనే సంస్థ పేరు ముందు ఉండి, ఐప్యాక్ వెనుక నుండి నియంత్రణలో ఉండడమంటే ఇందులో పక్కా వ్యూహం ఉందని అనిపిస్తోంది. ప్రజలకు సేవ చేయడంలో కన్నా, ఓటర్ల మనోభావాలను ప్రభావితం చేయడమే ఈ శిక్షణల అసలు ఉద్దేశమైందన్న ఆరోపణల్ని బలపరిచే అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. మొత్తంగా వలంటీర్ వ్యవస్థను సేవకంటే రాజకీయ ప్రయోజనాల కోసమే ఉపయోగించారని, దీనికి శిక్షణ పేరుతో ఖర్చయిన కోట్ల రూపాయల ప్రజాధనం నిదర్శనమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Read Also : Tulsi Water: రోజూ పరిగడుపున తులసి వాటర్ తాగితే ఏమౌతుందో తెలుసా?