Palnadu : టీడీపీ మద్దతుదారుల పంటను నాశనం చేసిన వైసీపీ శ్రేణులు..?
- By Sudheer Published Date - 01:15 PM, Tue - 19 December 23

ఏపీలో రాజకీయాలు మరి దారుణంగా తయారవుతున్నాయి. రాజకీయాల కోసం అతి నీచమైన పనికి దిగజారుతున్నారు. తమ అభిమాన నేతల్లో గుర్తింపు..మెప్పు పొందడం కోసం ఏంచేస్తున్నారో కూడా అర్ధం కావడం లేదు. తాజాగా పల్నాడు జిల్లాలో టీడీపీ మద్దతుదారుల పంటను నాశనం చేసి వైసీపీ జెండాలు పాతిన ఘటన వినుకొండ (Vinukonda) మండలం నడిగడ్డ(Nadigadda) గ్రామంలో చోటుచేసుకుంది.
We’re now on WhatsApp. Click to Join.
నడిగడ్డకు చెందిన వెంకటేశ్వర్లు మొదటి నుండి టీడీపీ కార్యకర్త. వెంకటేశ్వర్లు మూడెకరాల్లో మిర్చి పంట సాగు చేశాడు. అయితే…వెంకటేశ్వర్లు సాగు చేసిన మిర్చి పంటను దుండగులు ధ్వంసం చేశారు. రోజూ లాగే… ఈనెల 18వ తేదీ (సోమవారం) ఉదయం పొలానికి వెళ్లాడు వెంకటేశ్వర్లు. అక్కడ… అర ఎకరం విస్తీర్ణంలో మొక్కలు పీకేసి ఉన్నాయి. అంతేకాదు… మిరప మొక్కలను (Mirchi Crop) పీకేసిన దుండగులు… పొలంలో వైసీపీ జెండాలు పాతారు. దీంతో బాధితులు అది వైసీపీ పనే అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వెంకటేశ్వర్లు టీడీపీ పార్టీకి మద్దతు ఇస్తున్నాడనే కారణంతో వైసీపీ నేతలు ఇబ్బంది పెడుతున్నారని గ్రామస్తులు కూడా చెప్తున్నారు. మిరప పంట వేసిన భూమికి సంబంధించి ఎలాంటి వివాదాలు లేవని వెంకటేశ్వర్ల కుటుంబం చెపుతుంది. పనిగట్టుకుని పంటను ధ్వంసం చేయాల్సినంత గొడవలు తమకు లేవని వారు వాపోతున్నారు. ఇది రాజకీయ కక్షతో చేసిన పనే అని చెప్తున్నారు. పంట చేతికందే సమయంలో నాశనం చేశారంటూ వెంకటేశ్వర్లు భార్య పొలంతోనే కన్నీళ్లు పెట్టుకుంది. గత కొద్దీ రోజులుగా తమను వైసీపీ లోకి రావాలని ఒత్తిడి తెస్తున్నారని..మీము రామని చెప్పేసరికి..ఇలా మిరప పంటను ధ్వంసం చేసారని బాధితులు వాపోయారు. దాదాపు 2 లక్షలు నష్టపోయామని కన్నీరు పెట్టుకున్నారు. దీనిపై పోలీసులు కనీసం కేసు కూడా నమోదు చేయడంలేదని బాధితులు ఆరోపిస్తున్నారు.
Read Also : Gyanvapi Mosque : జ్ఞానవాపి కేసు.. మసీదు పిటిషన్ తిరస్కరణ.. ఆలయ పిటిషన్‌కు అనుమతి