YCP : వైసీపీ పార్టీ కాదు…రాబంధుల పార్టీ – JC ప్రభాకర్ రెడ్డి
YCP : "వైసీపీ వారు ఎక్కడ శవాలు కనిపిస్తే అక్కడ రాజకీయాలు చేస్తున్నారని, ఇది రాబందుల పార్టీ కాక ఇంకేమిటి?" అంటూ ప్రశ్నించారు
- Author : Sudheer
Date : 12-01-2025 - 4:52 IST
Published By : Hashtagu Telugu Desk
తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి (JC Prabhakar Reddy) వైసీపీ పార్టీ(YCP Party)పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వైసీపీ నేతలను రాబందులుగా అభివర్ణించిన ఆయన, జగన్ ప్రభుత్వం ప్రజల కోసం పనిచేయకుండా, రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రమే పని చేస్తోందని ఆరోపించారు. “వైసీపీ వారు ఎక్కడ శవాలు కనిపిస్తే అక్కడ రాజకీయాలు చేస్తున్నారని, ఇది రాబందుల పార్టీ కాక ఇంకేమిటి?” అంటూ ప్రశ్నించారు. స్విమ్స్, రుయా ఆసుపత్రుల్లో బాధితులను పరామర్శించడం రాజకీయ నాటకమని పేర్కొన్నారు.
BCCI Secretary: బీసీసీఐ కొత్త కార్యదర్శి ఎవరో తెలుసా?
తిరుమల టోకెన్ వ్యవస్థ గురించి మాట్లాడిన రోజా(Roja)పై కూడా జేసీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రోజా తిరుమలలో టోకెన్స్ అమ్ముకోవడం ద్వారా బెంజ్ కారు కొన్నారని ఆరోపించారు. దర్శనానికి వచ్చిన ప్రతిసారీ వందల మంది తనతో తీసుకువస్తూ, తిరుమల భక్తులకి ఇబ్బందులు కలిగించారని , తన గతాన్ని మరచి, డ్రామా కంపెనీ లాంటి మాటలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం హయాంలో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని, జగన్ (Jagan) తమ బాధలను పట్టించుకోలేదని జేసీ పేర్కొన్నారు. ప్రజలకు న్యాయం చేయాల్సిన సమయంలో జగన్, వైసీపీ నేతలు రాజకీయం చేయడం దారుణమని అభిప్రాయపడ్డారు. అనేక ప్రమాదాలు, మరణాలు జరిగినప్పటికీ, బాధితులను పరామర్శించకపోవడం వైసీపీ దోషమని అన్నారు. తమ కుటుంబానికి వైసీపీ హయాంలో అన్యాయం జరిగిందని, కానీ చంద్రబాబు మాత్రం వారిని గాలికి వదిలేశారని జేసీ ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు వల్లే ఇలాంటి నాయకులు రాజకీయాల్లోకి వచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు.