YSRCP : అధికార పార్టీ కౌన్సిలర్ వినూత్న నిరసన… మున్సిపల్ కమిషనర్‌పై..?
ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి మున్సిపాలిటీలో అధికార పార్టీకి చెందిన కౌన్సిలర్ వినూత్న నిరసన తెలిపాడు. తన డివిజన్లో దోమల
- Author : Prasad
Date : 02-12-2022 - 10:08 IST
Published By : Hashtagu Telugu Desk
ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి మున్సిపాలిటీలో అధికార పార్టీకి చెందిన కౌన్సిలర్ వినూత్న నిరసన తెలిపాడు. తన డివిజన్లో దోమల మందు కొడుతూ కౌన్సిలర్ చంద్రం నిరసన చేపట్టిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కొండపల్లి మున్సిపల్ కమిషనర్ శ్రీధర్ పై అధికార వైసీపీ కౌన్సిలర్ తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. వార్డులో ఉన్న సమస్యలు చెబుతున్న కమిషనర్ పట్టించుకోవట్లేదని.. గ్రామంలో ఎక్కడ ఏముందో కమిషనర్ కి తెలియదని ఆయన ఆరోపించారు. రెండు సంవత్సరాలుగా కమిషనర్ గా చేస్తున్న వ్యక్తికి గ్రామం పై ఇప్పుడు కూడా అవగాహన లేదన్నారు. గత కొద్ది నెలలుగా ప్రజలు దోమల బారిన పడుతున్నారు దోమలు ముందు కావాలని చెప్పిన పట్టించుకోలేదని.. చివరికి తానే దోమలు మందు కొట్టుకుంటున్నానని కౌన్సిలర్ చంద్రం తెలిపారు. డివిజన్లో స్ట్రీట్ లైట్లు వెలగక.. డ్రైనేజీ నిండిపోయి పూడికలు తీయకపోవడం తో ప్రజలు అల్లాడిపోతున్నారని.. ప్రజలు తనకు ఓటు వేసిన గెలిపించి దానికి తానే దోమలు ముందు కొడుతున్నానని కౌన్సిలర్ చంద్రం వాపోయారు.