YCP 7th -TDP 1st List : వైసీపీ ఏడో జాబితాకు సిద్ధం..టీడీపీ ఫస్ట్ జాబితాకు సిద్ధం
- Author : Sudheer
Date : 13-02-2024 - 12:05 IST
Published By : Hashtagu Telugu Desk
ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతుండడం తో నేతల్లోనే కాదు పార్టీల శ్రేణుల్లో కూడా ఆసక్తి రోజు రోజుకు పెరుగుతుంది. ఎవరికీ టికెట్ వస్తుందో..ఎవరికీ రాదో..ఎవరు పార్టీ లో ఉంటారో..ఎవరు బై బై చెపుతారో అని అందరిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇప్పటికే అధికార పార్టీ వైసీపీ ఆరు జాబితాలను విడుదల చేయగా..వీరిలో టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు పార్టీ కి రాజీనామా చేసి జనసేన , టీడీపీ లలో చేరారు. ఈ ఆరు జాబితాల్లో జగన్ 32 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలపై వేటువేశారు. ఇక ఇప్పుడు ఏడో జాబితాను రిలీజ్ చేసేందుకు కసరత్తులు మొదలుపెట్టారు.
We’re now on WhatsApp. Click to Join.
పలు మార్పులతో ఏడో జాబితాను రూపొందిస్తున్నారు. ఈ మేరకు తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో పార్టీ పెద్దలు కసరత్తు చేస్తున్నారు. మార్పులు చేయనున్న నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలకు తాడేపల్లి నుంచి పిలుపు వచ్చింది. దీంతో వారంతా సీఎం జగన్ తో సమావేశం అవుతున్నారు.
మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చారు. తన కుమారుడిని ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయించేందుకు ఆయన ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. అలాగే గత ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచి వైసీపీ కి మద్దతిస్తోన్న గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సైతం.. సీఎం జగన్‌ను కలిసి తన సీటు విషయమై చర్చించారు. అలాగే గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని పలు అంశాలపై చర్చించారు.
ఇదిలా ఉంటె టీడీపీ సైతం మొదటి జాబితాను రిలీజ్ చేసేందుకు సిద్ధమైంది. మొదటి జాబితాలో 50 నుండి 70 మంది అభ్యర్థులను ప్రకటించబోతున్నట్లు సమాచారం. పొత్తుల్లో భాగంగా మిత్ర పక్షాలకు వదిలేసే సీట్లను మినహాయించి మిగిలిన వాటిల్లో కొంతమంది అభ్యర్థులను ప్రకటించే అవకాశాలున్నాయి. ఇటు జనసేన కూడా మొదటి జాబితాను రిలీజ్ చేయబోతుంది. టీడీపీ – జనసేన పార్టీలు పొత్తు పెట్టుకోవడం తో ఇరు అధినేతలు స్థానాలపై చర్చలు జరపడం జరిగింది. అందుకే ఒకేసారి ఇద్దరు తమ మొదటి లిస్ట్ ను ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు. మరి వీరిలో ఎవరికీ టికెట్ దక్కుతుందో..ఎవరికీ దక్కదో చూడాలి.
Read Also : Weightloss Tips : ఈ చిట్కాలు పాటిస్తే.. నెలకు 5 కేజీలు తగ్గుతారు..