HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Yarlagadda Venkata Rao At Mega Teacher Meeting

Mega Parents Teacher Meeting 3.0 : మెగా పేరెంట్-టీచర్స్ మీటింగ్ లో పాల్గొన్న యార్లగడ్డ వెంకట్రావు

Mega Parents Teacher Meeting 3.0 : ప్రభుత్వ పాఠశాలల్లో చదివేది ఎక్కువగా నిరుపేద కుటుంబాలకు చెందిన పిల్లలే. నాణ్యమైన విద్య ప్రభుత్వ స్కూళ్లలో లభించదనే భావనతో చాలామంది ప్రవైట్ స్కూల్స్ లలో చేర్పిస్తుంటే..ఆర్ధిక స్థోమత లేని వారు మాత్రం తమ పిల్లలను ప్రభుత్వ స్కూల్స్ లలో చదివిస్తున్నారు.

  • Author : Sudheer Date : 05-12-2025 - 3:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Yarlagadda Venkat Rao Parti
Yarlagadda Venkat Rao Parti

ప్రభుత్వ పాఠశాలల్లో చదివేది ఎక్కువగా నిరుపేద కుటుంబాలకు చెందిన పిల్లలే. నాణ్యమైన విద్య ప్రభుత్వ స్కూళ్లలో లభించదనే భావనతో చాలామంది ప్రవైట్ స్కూల్స్ లలో చేర్పిస్తుంటే..ఆర్ధిక స్థోమత లేని వారు మాత్రం తమ పిల్లలను ప్రభుత్వ స్కూల్స్ లలో చదివిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో కూడా కార్పొరేట్ స్థాయి విద్యను అందిస్తున్నామనే నమ్మకాన్ని ప్రజలకు కలిగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ప్రత్యేక చర్యలు చేపట్టారు. అందులో భాగంగానే ఈ రోజు (డిసెంబర్ 5, 2025) రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 45,000 ప్రభుత్వ, సహాయక పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో మెగా పేరెంట్-టీచర్స్ మీటింగ్ -3.0 (PTM-3.0) ను విజయవంతంగా నిర్వహించారు.

Tri-Service Guard Of Honour: త్రి-సేవా గార్డ్ ఆఫ్ ఆనర్.. దాని అర్థం ఏమిటి?

ఈ మెగా PTM కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు మంత్రి నారా లోకేష్ పార్వతీపురం మన్యం జిల్లాలో పాల్గొనగా, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చిలకలూరిపేటలో పాల్గొన్నారు. గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ శ్రీ యార్లగడ్డ వెంకట్రావు గారు గన్నవరం మండలం గొల్లనపల్లిలోని పి.ఎమ్. శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈ కార్యక్రమంలో పాల్గొని, నూతనంగా ఏర్పాటు చేసిన కెమిస్ట్రీ ల్యాబ్‌ను ప్రారంభించారు. అనంతరం చదువు గొప్పతనం , మెగా పేరెంట్-టీచర్స్ మీటింగ్ ద్వారా కలిగే లాభాలు , ప్రభుత్వ స్కూల్స్ విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు , ప్రభుత్వ స్కూల్ విద్యార్థుల కోసం చేస్తున్న కృషి తదితర విషయాలను విద్యార్థులతో పంచుకున్నారు. PTM కాన్సెప్ట్ సాధారణంగా ప్రైవేటు స్కూళ్లలో ఉండేది కాగా, నారా లోకేష్ దీనిని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశపెట్టి, తల్లిదండ్రులకు తమ బిడ్డ చదువుల పురోగతిని టీచర్ల వద్ద నుంచి తెలుసుకునే అవకాశం కల్పించారని గుర్తు చేసారు.

విద్యాశాఖలో మెరుగుదల అంటే కేవలం స్కూళ్లకు రంగులు వేయడం కాదని, విద్యా ప్రమాణాలు పెంచడం ముఖ్యమని లోకేష్ ప్రణాళికాబద్ధంగా పని చేసుకుంటూ వస్తున్నారని కొనియాడారు. ముందుగా డీఎస్సీ నిర్వహించి టీచర్లను అందుబాటులోకి తీసుకురావడం, స్కూళ్లలో సౌకర్యాలను మెరుగుపరచడం వంటి చర్యలు కార్పొరేట్ స్థాయి విద్యకు తగ్గట్లుగా మార్పులు తీసుకువస్తున్నాయన్నారు. ఏళ్ల తరబడి నిర్లక్ష్యం జరిగిన విద్యాశాఖను దారిలో పెట్టడం రాత్రికి రాత్రే సాధ్యం కాకపోయినా, నారా లోకేష్ చాలా వేగంగా చేస్తున్నారని పేర్కొన్నారు. అలాగే పిల్లలు కూడా తమ తల్లిదండ్రుల ఆశలను , కలలను నెరవేర్చాలని హితవు పలికారు. స్కూల్ లైఫ్ ఎప్పటికి మరచిపోలేంది అని ఇలాంటి గొప్ప అవకాశం తిరిగి రాదని..ఇలాంటి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అలాగే స్కూల్స్ వద్ద స్పీడ్ బ్రేక్స్ ఉండేలా చర్యలు తీసుకుంటానని పేర్కొన్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • gannavaram
  • Gannavaram TDP Mla
  • Mega Parents Teacher Meeting 3.0
  • nara lokesh
  • Yarlagadda Venkata Rao
  • yarlagadda venkata rao mega teacher meeting

Related News

Lokesh Tdp Office

మాట తప్పడం టీడీపీ రక్తంలోనే లేదు – నారా లోకేష్

గత ఐదేళ్లలో రాష్ట్రం ఎదుర్కొన్న సవాళ్లను అధిగమిస్తూ, మళ్లీ గాడిలో పెట్టేందుకు నిరంతరం శ్రమిస్తున్నామని తెలిపారు. యువతకు ఉపాధి కల్పన, విద్యా రంగంలో మార్పులు మరియు ఐటీ రంగం విస్తరణ ద్వారా ఏపీని

  • Yuvagalam

    లోకేష్ ను మాస్ లీడర్ గా చేసిన యువగళానికి మూడేళ్లు

  • Lokesh Davos

    దావోస్ టూర్ లో సత్తా చాటిన మంత్రి లోకేష్

  • Ramakrishna Ttd

    లోకేష్ పుట్టిన రోజు సందర్బంగా తిరుమల శ్రీవారికి రూ.44 లక్షలు విరాళం ఇచ్చిన అభిమాని

  • Nara Lokesh Pawan Kalyan

    మినిస్టర్ లోకేశ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన పవన్ కల్యాణ్

Latest News

  • Ajit Pawar’s Plane Crash : మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మృతి

  • Breaking : అజిత్ పవార్ విమానం క్రాష్ ల్యాండింగ్

  • జలజీవన్ మిషన్ కింద ఏపీకి రూ.13 వేల కోట్లు

  • ఫేమస్ యాక్టర్ కు షాక్ ఇచ్చిన మెట్రో అధికారులు

  • Medaram Jathara : మేడారం వనదేవతల జాతరకు వేళాయె

Trending News

    • దంప‌తుల మ‌ధ్య‌ గొడవ పరిష్కరించుకోకుండా పడుకుంటే ఏం జరుగుతుంది?

    • ఆధార్ కొత్త యాప్ లాంచ్‌.. ఎప్పుడంటే?!

    • Rajasekhar Gotila Factory : నిజంగా రాజశేఖర్ కు గోటీల ఫ్యాక్టరీ ఉందా ? ఈ ఫ్యాక్టరీ ని బయటకు తీసిందెవరు ? అసలు ఈ ప్రచారానికి మూలం ఎక్కడ పడింది ?

    • ఆర్జే మహవష్‌తో విడిపోయిన చాహ‌ల్‌.. కార‌ణం ఏంటంటే?

    • India – EU ట్రేడ్ డీల్ ఖరారు.. మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ లో పొగిడిన ప్రధాని మోదీ!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd