Vijayawada Flood : మేము బతికే ఉన్నామా, లేదా అని చూడడానికి వచ్చావా..? – బొత్స కు బాధితులు షాక్
ఇక్కడి ప్రాంతాలు మునిగిపోయి ఐదు రోజులు అయ్యిందని, ఆ రోజు నుండి మేము అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, అయినా మీ పార్టీ నాయకులు ఏమాత్రం పట్టించుకోలేదని, ఏ ఒక్కరు కూడా ఇక్కడికి రాలేదని
- By Sudheer Published Date - 11:44 PM, Wed - 4 September 24

గత శుక్రవారం, శనివారం కురిసిన భారీ వర్షానికి విజయవాడ నగరం అతలాకుతలమైన సంగతి తెలిసిందే. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒకే రోజు దాదాపు 29 సెం,మీ వర్షం పడేసరికి నగరం మొత్తం నీటిలో మునిగింది. బుడమేరు వాగు ఉప్పొంగడం మరింత ప్రాణ , ఆస్థి నష్టాన్ని తెచ్చిపెట్టింది. ప్రస్తుతం వర్షాలు తగ్గుముఖం పట్టడం తో వరద ప్రవాహం తగ్గింది. ఇప్పుడిప్పుడు జనాలు తమ ఇంటికి వచ్చి ఏమి మిగిలాయి..ఏంపోయాయి అనేవి చూసుకుంటూ బురదమయంగా ఉన్న ఇంటిని శుభ్రం చేసుకునే పనిలో పడ్డారు. ఇక ప్రభుత్వం సైతం గత మూడు రోజులుగా బాధితులకు సాయం అందజేస్తూ వస్తుంది. సీఎం చంద్రబాబు సైతం రెండు రోజుల పాటు నగరంలోని ముంపు ప్రాంతాల్లోనే ఉండి..బాధితులను పరామర్శించి ప్రభుత్వం తప్పక ఆదుకుంటుందని భరోసా కల్పించారు.
We’re now on WhatsApp. Click to Join.
వరదలు వచ్చిన ఐదు రోజులకు వైసీపీ నేతలకు ప్రజలు గుర్తు వస్తున్నారు. నిన్నటి వరకు కంటికి కనిపించని నేతలు..ఈరోజు విజయవాడ నగరంలో ప్రత్యేక్షమైసరికి బాధితులు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణకు భారీ షాక్ ఇచ్చారు. విజయవాడలోని రాజరాజేశ్వరి పేటలోని వరద బాధితులను పరామర్శించడానికి వచ్చిన బొత్స ను నిలదీశారు బాధితులు. మేము బతికే ఉన్నామా, లేదా అని చూడడానికి ఇక్కడికి వచ్చారా అంటూ నిలదీశారు. ఇక్కడి ప్రాంతాలు మునిగిపోయి ఐదు రోజులు అయ్యిందని, ఆ రోజు నుండి మేము అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, అయినా మీ పార్టీ నాయకులు ఏమాత్రం పట్టించుకోలేదని, ఏ ఒక్కరు కూడా ఇక్కడికి రాలేదని, ఇప్పుడు మీరు ఊపుకుంటూ ఇక్కడికి వచ్చారా అని ప్రశ్నించారు. ప్రభుత్వం మాకు అన్ని సాయం చేస్తుందని అవి కూడా లేకుండా చేయాలనీ మీరు వచ్చారా అని ఆగ్రహం వ్యక్తం చేసారు. దీంతో వారికీ ఏ సమాధానం చెప్పలేక బొత్స అక్కడి నుండి వెళ్లిపోయారు.
విజయవాడ, రాజరాజేశ్వరిపేటకు వెళ్లిన బొత్సను నిలదీసిన మహిళలు. ఇళ్లు మునిగిన 5 రోజుల తర్వాత ఎందుకొచ్చారని ప్రశ్నించిన మహిళలు. వరద బాధితులకు ఏం సాయం చేశారని ప్రశ్నించిన మహిళలు. నిలదీసిన మహిళల పై చులకనగా మాట్లాడిన వైసీపీ నేతలు. మమ్మల్నే అవమానిస్తారా అంటూ, తీవ్ర ఆగ్రహంతో జగన్ ని కూడా… pic.twitter.com/nu5ceujDBd
— Telugu Desam Party (@JaiTDP) September 4, 2024
Read Also : Janhvi Kapoor : జాన్వి ఫస్ట్ అటెంప్ట్ అదుర్స్…!