HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Will Roja Be Removed From The Ap Cabinet

AP Cabinet: మంత్రి పదవికి ఎసరు, కాశీకి రోజా అందుకేనా?

ఇటీవల జరిగిన కాబినెట్ మీటింగ్లో ఇద్దరు మంత్రుల ప్రచారం ఎక్కువ అయిందని పని తగ్గిందని జగన్ చురకలు వేశారు.

  • Author : CS Rao Date : 20-02-2023 - 12:23 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Roja And Jagan
Roja And Jagan

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా (RK Roja) కాశీ టూర్ కు మంత్రివర్గం 3.0 కు సంబంధం ఉందా? అంటే ఔను అంటున్నారు నగరి రాజకీయ నాయకులు. ఎందుకంటే , మంత్రివర్గం (AP Cabinet) 2.0 సందర్భంగా కొన్ని రోజుల ముందు కాశీ విశ్వనాథుడిని దర్శించుకున్నారు. తిరిగి వచ్చిన వారానికి ఆమెకు మంత్రివర్గంలో చోటు లభించింది. ఆ తరువాత ఆమె చేసిన ఓవర్ యాక్షన్ శృతిమించి పాకాన పడిందని వైసీపీలోని టాక్. అందుకే ఆమె పదవి ఊడనుందని ఆమె ప్రత్యర్థులు చేస్తున్న ప్రచారం. ఇటీవల జరిగిన కాబినెట్ మీటింగ్లో ఇద్దరు మంత్రుల ప్రచారం ఎక్కువ అయిందని పని తగ్గిందని జగన్ చురకలు వేశారు. ఆ ఇద్దరిలో రోజా ఉందని తాడేపల్లి వర్గాల్లోని వినికిడి. బెంజి కారు కొనుగోలు నుంచి ఇటీవల వరకు స్టేజి డాన్స్ ల వరకు జగన్ వద్ద చిట్టా ఉందని తెలుస్తోంది.

అంతే కాదు ఆమె మాట దురుసుతనం, స్థానిక నేతల ఫిర్యాదులు, తిరుపతి (Tirupati) టిక్కెట్ ల వ్యవహారం వెరసి ఆమె మంత్రి పదవికి ఎసరు వచ్చిందని బలంగా వినిపిస్తుంది. అందుకే ఆమె చేసిన తప్పులను కాశీ విశ్వనాధునికి చెప్పుకోవడానికి వెళ్లారని ప్రత్యర్థులు చెప్పుకుంటున్నారు. మంత్రివర్గంలో స్తానం కల్పించిన విశ్వనాధునికి మొక్కు తీర్చుకోవడానికి (RK Roja) వెళ్లారని అభిమానులు వివరణ ఇచ్చే పనిలో ఉన్నారు. అటు సినిమా , ఇటు రాజకీయాల్లోనూ ఆమె ఓ సెలబ్రిటీ. ఫైర్ బ్రాండ్ గా పేరు సంపాదించుకున్నారు. సినిమాలు చేస్తున్నప్పుడు ఆమెకు ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ఎలాంటి పాత్రలోకైన పరకాయ ప్రవేశం చేసే వారు. ఇప్పుడు రాజకీయాల్లోకి కూడా ఎలాంటి అవకాశం వచ్చినా అందిపుచ్చుకుంటూ తన దైన స్టైల్ లో దూసుకుపోతున్నారు.

ఆమె రూటే సెపరేటు. ఏదైన కార్యక్రమానికి, ప్రారంభోత్సవానికి వెళ్తే సాధారణ రాజకీయా నాయుకులు చేసినట్లుగా రిబ్బన్ కట్ చేసి, జెండా ఊపి, నాలుగు మాటలు మాట్లాడి వచ్చే ధోరణి మంత్రి ఆర్కే రోజాది కాదు. అంబులెన్స్ ప్రారంభించడానికి వెళ్తే అంబులెన్స్ డ్రైవర్ గా మారతారు, సాంస్కృతిక కార్యక్రమాలకు వెళ్తే నృత్యకారిణి అవతారం ఎత్తుతారు. అందుకే రోజా రూటు సెపరేటు అంటారు. తాజాగా అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మహా శివరాత్రి సందర్భంగా మంత్రి ఆర్కే రోజా (RK Roja) కాశీకి వెళ్లారు. ఈ సందర్భంగా తన స్నేహితురాలితో కలిసి రిక్షాలో కాశీ వీధుల్లో చక్కర్లు కొట్టారు.సరిగ్గా ఈ వీడియో ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. మొక్కు తీర్చుకొనేందుకు కుటుంబంతో కలిసి వెళ్తారు. కానీ ఆమె ఫ్రెండ్ తో కల్సి వెళ్లారని వీడియో చూస్తే అర్థం అవుతోంది. అంటే మంత్రి పదవికి గండం ఏర్పడిందని ప్రత్యర్థులు బలంగా నమ్ముతున్నారు. ఇపుడు రోజా లాగా గతంలో కొడాలి ఎగిరిపడి మంత్రి పదవిని పోగొట్టు కున్నారు. ఇప్పుడు రోజా వంతు వచ్చిందని చిత్తూరు పొలిటికల్ టాక్.

Also Read: CM KCR: కేసీఆర్ దూకుడు.. దేశవ్యాప్తంగా భారీ బహిరంగ సభలు!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • ap cabinet expansion
  • AP CM Jagan
  • minister RK ROJA

Related News

Ap Logo

Private Colleges: ఏపీలో ప్రైవేట్ కాలేజీలకు భారీ ఊరట

ఏపీ ప్రభుత్వం కొత్త ప్రైవేట్ విద్యా సంస్థల ఏర్పాటును సులభతరం చేసింది. ఆంధ్రప్రదేశ్‌ ఉన్నత విద్యా ప్రైవేటు విద్యా సంస్థల చట్టంలో పలు నిబంధనలకు సవరణలు చేసింది. ఈ మేరకు ఉన్నత విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కార్పస్‌ ఫండ్‌, ఇతర నిబంధనల్లో కొన్ని సడలింపులు ఇచ్చింది. ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాల విన్నపాలతో ఈ నిర్ణయం తీసుకున్నారు. రూ.15 లక్షల కార్పస్‌ ఫండ్‌ను రద్దు చేశారు.

  • Nara Lokesh: Minister Nara Lokesh on a Visit to Russia to Attract Investments to AP

    Nara Lokesh: ఏపీలో పెట్టుబడుల కోసం..రష్యా పర్యటనలో మంత్రి నారా లోకేష్

Latest News

  • Blender’s Pride : కోల్‌కతాలో బ్లెండర్స్ ప్రైడ్ రిజర్వ్ డ్ ఎక్స్ పీరియెన్సెస్’ సాంస్కృతిక ప్లాట్‌ఫామ్‌ ప్రారంభం

  • AI CRM : భవిష్యత్ శ్రామిక శక్తి వైపు భారత్.. 10 లక్షల మంది యువతకు సేల్స్‌ఫోర్స్ ఏఐ శిక్షణా సంకల్పం

  • Marriage: వివాహం జరగడం లేదని బెంగ పడుతున్నారా? అయితే 21 శనివారాలు ఈ పని చేయండి..!!

  • Mamata Banerjee: మమతా బెనర్జీ ఇంటికి సీఐడీ

  • Manjari Fadnnis: తన కుక్కను దారుణంగా కొట్టి చంపేశారు : నటి మంజరి ఫడ్నీస్ కన్నీళ్లు

Trending News

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd