HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Andhra Pradesh
  • >Will Jagan Field Retd Ias Officer In Narasapuram By Poll

Narsapuram Seat: అంతా.. తూచ్!

ఈశాన్య రాష్ట్రాల్లో ‘జగన్‌’కు ఉన్న విద్యుత్‌ ప్రాజెక్టుల్లో ‘భాను’కు వాటా ఉందని ప్రచారం ఉంది. అందుకే అతనికి నరసాపురం ఉప ఎన్నికల్లో వైసీపీ అతన్ని నిలబెడుతుందని సోషల్ మీడియా చేస్తున్న ఫోకస్.

  • By CS Rao Published Date - 05:21 PM, Wed - 19 January 22
  • daily-hunt
YS Jagan Bhanu
YS Jagan Bhanu

ఈశాన్య రాష్ట్రాల్లో ‘జగన్‌’కు ఉన్న విద్యుత్‌ ప్రాజెక్టుల్లో ‘భాను’కు వాటా ఉందని ప్రచారం ఉంది. అందుకే అతనికి నరసాపురం ఉప ఎన్నికల్లో వైసీపీ అతన్ని నిలబెడుతుందని సోషల్ మీడియా చేస్తున్న ఫోకస్. వాస్తవంగా దివంగత వైఎస్ సీఎం గా ఉన్నప్పుడు సీఎంవోలో ఆయన పనిచేసినప్పటికి క్రమంగా ప్రాధాన్యం తగ్గించారు. స్వర్గీయ రోశయ్య సీఎం గా ఉన్న సమయంలో భాను కీలకం అయ్యాడు. ఆ రోజుల్లో జరిగిన రాజకీయ పరిణామాలు సీఎంవో పై కూడా పడ్డాయి. ఆ క్రమంలో భాను కాంగ్రెస్ వైపు మొగ్గు చూపాడని ఆనాటి సీఎంవో వర్గాలకు తెలుసు. అందుకే ఆయనకు పోటీ చేసే అవకాశం కూడా ఆ పార్టీ ఇచ్చింది.

ఇప్పుడు జగన్ ఆయనకు టిక్కెట్ ఇస్తాడని జరుగుతున్న ప్రచారం దాదాపు తప్పుగా ఆనాడు ఆయనతో పనిచేసిన కొందరి అభిప్రాయం. పైగా జగన్ పవర్ ప్రాజెక్ట్స్ లో వాటా ఉందని జరుగుతున్న ఫోకస్ కూడా శుద్ధ అబద్ధమని వైసీపీలో ని ఒక సీనియర్ లీడర్ కొట్టిపారేస్తున్నాడు. ఇక నరసాపురం ఉప పోరు జరిగితే చిరంజీవి వైసీపీ అభ్యర్థిగా రంగంలోకి తీసుకు వచ్చే ఛాన్స్ ఉందని ఓ కీలక వైసీపీ లీడర్ ప్రైవేట్ సంకేతం. లేదంటే వైసీపీలో ఉన్న రాజు సామాజిక వర్గ లీడర్ అభ్యర్థి అవుతాడని ఆయన చెబుతున్న అభిప్రాయం. కానీ భాను పేరు కేవలం సోషల్ మీడియా ప్రచారానికి పరిమితం అని లైట్ గా కొట్టేస్తున్నాడు.
దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ‘భాను’ సిఎంఓ కార్యాలయంలో ప్రత్యేకాధికారిగా పనిచేశారు. వైఎస్‌తో మంచి సంబంధాలు నెరిపిన ‘భాను’ ఆయన ఆకస్మిక మరణం తరువాత ‘రోశయ్య’ వద్ద కూడా కొంతకాలం పనిచేశారు. అస్సాం కేడర్‌కు చెందిన ‘భాను’ రాజశేఖర్‌రెడ్డి సిఎం అయిన వెంటనే ఆయనను రాష్ట్రానికి డిప్యూషన్‌ మీద తీసుకువచ్చారు. అప్పట్లో వైఎస్‌ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ‘జలయజ్ఞం’లో‘భాను’ కీలకపాత్ర పోషించారు.

కేవలం వైఎస్‌తోనే కాకుండా ఆయన తనయుడు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికి కూడా ‘భాను’ సన్నిహితుడు. ఈశాన్య రాష్ట్రాల్లో ‘జగన్‌’కు ఉన్న విద్యుత్‌ ప్రాజెక్టుల్లో ‘భాను’కు వాటా ఉందని ప్రచారం ఉంది. వైఎస్‌ మృతి తరువాత తన డిప్యూషన్‌ ముగియడంతో ఆయన తిరిగి ‘అస్సాం’కు వెళ్ళిపోయారు. 2019లో అక్కడ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ రిటైర్‌ అయ్యారు. రిటైర్‌ అయిన అనంతరం ఆయన అస్సాంలోని తేజ్‌పూర్‌ నుంచి కాంగ్రెస్‌ తరుపున ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం ఖాళీగా ఉన్న ‘భాను’ను ‘నర్సాపురం’ ఉప ఎన్నిక బరిలోకి దించాలని వైకాపా ఆలోచిస్తుందని ప్రచారం.
వాస్తవానికి ‘భాను’ది పశ్చిమగోదావరి జిల్లా ‘తాడేపల్లిగూడెం’కు చెందిన వారు. ‘కాపు’ సామాజికవర్గానికి చెందిన ‘భాను’ను ఉప ఎన్నికలో బరిలోకి దించితే వైకాపాకు మేలు జరుగుతుందనే భావన వైకాపా పెద్దల్లో ఉందని వండి వార్తలను వార్చుతున్నారు. నర్సాపురం’ పార్లమెంట్‌ పరిధిలో ‘కాపు’ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు అధిక సంఖ్యలో ఉండడంతో ‘కాపు’ల ఓట్లు గంపగుత్తగా వైకాపాకు పడతాయనే ఆలోచన వారిలో ఉంది. ‘

రఘురామకృష్ణంరాజు’కు ‘టిడిపి, జనసేన, బిజెపి’లు మద్దతు ఇస్తున్నాయని, క్షత్రియ, కమ్మ, బీసీ వర్గాలు ‘రఘురామ’కు మద్దతు ఇస్తాయని, తాము కనుక ‘భాను’ను రంగంలోకి దింపితే మొదటి నుంచి వైకాపాకు మద్దతు ఇస్తోన్న ఎస్సీ, ఎస్టీ, ముస్లింలు ఏకపక్షంగా ఓట్లు వేస్తారని, ఇక ‘కాపు’లను తమవైపు తిప్పుకుంటే విజయం తమదేననే భావన వైకాపా వర్గాల్లో ఉంది. మొత్తం మీద అసలు ఉప ఎన్నిక వస్తుందో రాదో తెలియని పరిస్థితుల్లో వైకాపా ఉప ఎన్నికకు అభ్యర్థిని సిద్ధం చేసుకుంటోంది. తిరుపతి ఫార్ములా ను నర్సాపురంపై జగన్ అనుసరిస్తారు అని ఊహ. కానీ , ఇక్కడ ఫార్ములా అంత డిఫ్రెంట్ అంటూ జగన్ కోటరీ టాక్. రాజును రాజుతోనే తీయాలని ప్లాన్ చేస్తున్నారట. సో…భాను పేరు ఉత్తుతుదే!


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • AP CM Jagan Mohan Reddy
  • MP Kanumuru Raghurama Krishnam Raju
  • narsapuram
  • Rajasekhar Reddy CMO
  • retired IAS Bhanu

Related News

    Latest News

    • MMTS Trains: రైల్వే ప్ర‌యాణికుల‌కు గుడ్ న్యూస్‌.. ఉద‌యం 4 గంట‌ల వ‌ర‌కు రైళ్లు!

    • Gautam Gambhir: టీమిండియాలో జోష్ నింపిన గౌతం గంభీర్‌.. ఏం చేశారంటే?

    • Bullet 350: జీఎస్‌టీ రేట్లలో మార్పులు.. ఈ బైక్‌పై భారీగా త‌గ్గుద‌ల‌!

    • GST Reforms Impact: హోట‌ల్స్ రూమ్స్‌లో ఉండేవారికి గుడ్ న్యూస్‌!

    • PM Modi: మ‌రో దేశ అధ్యక్షుడితో ప్ర‌ధాని మోదీ చ‌ర్చ‌లు.. ఎందుకంటే?

    Trending News

      • Lunar Eclipse: రేపే చంద్ర‌గ్ర‌హ‌ణం.. ఏ దేశాల‌పై ప్ర‌భావం అంటే?

      • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

      • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

      • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

      • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd