Sana Sathish : టీడీపీ రాజ్యసభ అభ్యర్థి సానా సతీష్ ఎవరు ? ఆయన నేపథ్యం ఏమిటి ?
సానా సతీష్ బాబు(Sana Sathish) పదేళ్లు జాబ్ చేసి.. రాజీనామా చేసి హైదరాబాద్‌కు చేరుకున్నారు.
- By Pasha Published Date - 10:00 AM, Wed - 11 December 24

Sana Sathish : సానా సతీష్ బాబు.. ఈయనను ఈసారి రాజ్యసభ అభ్యర్థిగా టీడీపీ నిలబెట్టింది. మంగళవారం రోజు ఆయన రాజ్యసభ అభ్యర్థిత్వానికి నామినేషన్ దాఖలు చేశారు. త్వరలోనే రాజ్యసభ ఎంపీగా ఆయన ఎన్నిక ఖరారు అవుతుంది. ఇంతకీ సానా సతీష్ బాబు ఎవరు ? ఆయన నేపథ్యం ఏమిటి ? టీడీపీ అధినాయకత్వానికి సన్నిహితులుగా సతీష్ బాబు ఎలా మారారు ? ఇప్పుడు తెలుసుకుందాం..
Also Read :Five MPTCs : ప్రతీ మండలానికి ఐదుగురు ఎంపీటీసీలు.. ఈ ‘సెషన్’లోనే చట్ట సవరణ ?
సానా సతీష్ బాబు గురించి..
- సానా సతీష్ బాబు కాకినాడ వాస్తవ్యులు.
- ఈయన మెకానికల్ ఇంజనీరింగ్ చదివారు. కారుణ్య నియామకం కింద విద్యుత్ శాఖలో సబ్ ఇంజనీర్‌గా జాబ్ వచ్చింది.
- సానా సతీష్ బాబు(Sana Sathish) పదేళ్లు జాబ్ చేసి.. రాజీనామా చేసి హైదరాబాద్‌కు చేరుకున్నారు.
- హైదరాబాద్‌లో ఉంటూ రియల్ ఎస్టేట్, ఐటీ, పవర్ అండ్ ఎనర్జీ, సీపోర్టు రంగాల్లో పనిచేస్తున్న పలు కంపెనీల్లో పార్టనర్‌గా చేరారు.
- మెడాలీన్ (MEDALENE), వాన్ పిక్ (VANPIC) సీపోర్ట్, మహా కల్ప (MAHA KALPA ) ఇన్ ఫ్రా, మ్యాట్రిక్స్ నేచురల్ రిసోర్సెస్ (Matrix Natural Resources) వంటి భారీ కంపెనీల్లో ఈయన పార్ట్‌నర్‌గా ఉన్నారు.
- వైఎస్ జగన్ హయాంలో చంద్రబాబు నాయుడు స్కిల్ కేసులో అరెస్టయ్యారు. ఆ టైంలో తూర్పుగోదావరి జిల్లాలో టీడీపీకార్యక్రమాల నిర్వహణకు సతీష్ ఆర్థికంగా అండగా నిలబడ్డారు అని చెబుతుంటారు.
- తదుపరిగా ఏపీ లోక్‌సభ ఎన్నికల్లో కాకినాడ టికెట్ కోసం సానా సతీష్ బాబు ఆశించారు. అయితేే ఆ టికెట్‌ను పవన్ కళ్యాణ్ సన్నిహితుడైన ఉదయ్‌కు కేటాయించారు.
- రాజ్యసభ ఎంపీ అభ్యర్థిత్వం సానా సతీష్ బాబుకు ఆషామాషీగా దక్కలేదు. ఈసారి కూడా ఆయన పవన్ కళ్యాణ్‌ను ఎదుర్కోవాల్సి వచ్చింది. రాజ్యసభ ఎంపీ స్థానం కోసం టీడీపీ నుంచి సానా సతీష్, జనసేన నుంచి పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు పోటీ పడ్డారు. తన సన్నిహితుడు సతీష్‌కు రాజ్యసభ ఎంపీగా ఛాన్స్ ఇచ్చిన చంద్రబాబు.. పవన్‌ను శాంతింపచేసేందుకు నాగబాబును మంత్రిగా చేసేందుకు రెడీ అయ్యారు.