Train Accident : విజయనగరం రైలు ప్రమాదం.. 14 మంది మృతి, 100 మందికి గాయాలు
Train Accident : ఆంధ్రప్రదేశ్‌లో ఘోర రైలు ప్రమాదం జరిగింది.
- By Pasha Published Date - 07:11 AM, Mon - 30 October 23
Train Accident : ఆంధ్రప్రదేశ్‌లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఆదివారం రాత్రి 7.10 గంటల సమయంలో విశాఖ నుంచి పలాస వైపు వెళ్తున్న స్పెషల్ ప్యాసింజర్ రైలు విజయనగరం జిల్లా కొత్తవలస మండలం కంకటాపల్లి–ఆలమండ మధ్య సిగ్నల్ కోసం పట్టాలపై ఆగి ఉంది. అయితే అదే సమయంలో వెనుక నుంచి వచ్చిన విశాఖ-రాయగడ రైలు.. ప్యాసింజర్ రైలును ఢీకొట్టింది.
We’re now on WhatsApp. Click to Join.
ఎన్డీఆర్‌ఎఫ్, రెవెన్యూ, పోలీసు సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.రెండు రైళ్లు ఢీకొన్న ఈ ఘటనలో 14 మంది మృతి చెందగా, 100 మందికి పైగా గాయపడ్డారు.గాయపడిన వారిని విజయనగరం, విశాఖపట్నం ఆసుపత్రులకు తరలించారు. 
ఈ ప్రమాదంతో వివిధ స్టేషన్లలో రైళ్లు నిలిచిపోయాయి. రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పలు రైళ్లను రద్దు చేశారు. మరికొన్ని రైళ్లను దారి మళ్లించారు. విశాఖ నుంచి విజయవాడ వైపు వెళ్లే రైళ్లు మాత్రం యథాతథతంగా నడుస్తున్నాయి.
ప్రమాద వివరాలను తెలియజేసేందుకు ఎక్కడికక్కడ సహాయ కేంద్రాలు ఏర్పాటు చేశారు. విశాఖపట్నం రైల్వే స్టేషన్‌లో హెల్ప్ లైన్ నంబర్లు 0891–2746330/0891–2744619ను ఏర్పాటు చేశారు.
