MP Kesineni Nani : యువతను ప్రోత్సహిస్తేనే దేశం అభివృద్ధి చెందుతుంది – ఎంపీ కేశినేని నాని
విజయవాడ సిధ్దార్ద మహిళా కళాశాలలో జిల్లా స్థాయి యువ ఉత్యవ్ -ఇండియా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎంపీ కేశినేని నాని
- By Prasad Published Date - 06:56 AM, Sun - 5 March 23

విజయవాడ సిధ్దార్ద మహిళా కళాశాలలో జిల్లా స్థాయి యువ ఉత్యవ్ -ఇండియా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎంపీ కేశినేని నాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 700సంవత్సరాల క్రితం అతర్జాతీయ వర్తకంలో నాలుగో వంతు భారతదేశానిదే.. కానీ బ్రిటిష్ వారు వ్యాపారం పేరుతో దేశంలోకి వచ్చిన తర్వాత మనలో బలహీనతను కనిపెట్టి దేశాన్ని దోచుకున్నారన్నారు. కేవలం లాయర్లతోనే జరుగుతున్న స్వాతంత్ర్య పోరాటం గోపాలకృష్ణ గోఖలే ఆహ్వానంతో స్వతంత్ర ఉద్యమంలోకి వచ్చిన గాంధీజీ నాయకత్వం వహించడంతో దేశ యువత మొత్తం స్వాతంత్ర్య పోరాటంలోకి వచ్చారని ఆయన గుర్తు చేశారు. 1930 జనవరి 26 ని పూర్ణ స్వరాజ్‌గా ప్రకటించుకున్నారని.. అదే రోజు స్వాతంత్ర్య వచ్చిన తరువాత 1950 జనవరి 26ని గణతంత్ర దినోత్సవం గా జరుపుకుంటున్నామన్నారు. ఒకప్పుడు రీసెర్చ్& డెవలప్మేంట్ లో చివరిలో ఉన్న భారత్ నేడు ప్రపంచానికి దారిచూపే పరిస్థితి కి వచ్చిందని..అందుకు ఉదాహరణ కోవిడ్ వాక్సినేనన్నారు. మన తెలుగు వాళ్ళు భారత్ బయోటెక్ మన యువతకు ఆదర్శమని..అలాగే బహుల జాతి కంపెనీల సీఈఓలు మన భారతీయులు కావడం మనం గర్వించదగ్గ విషయమన్నారు. నేటి యువత వీరిని ఆదర్శంగా తీసుకుని అన్ని రంగాల్లో మంచి నైపుణ్యం సంపాదించి కుటుంబానికి, దేశానికి మంచి పేరు తేవడానికి కృషి చేయాలని సూచించారు. ఆందుకు ఎటువంటి సహాయం చేయాలన్నా తాను సిద్ధంగా ఉన్నానని విద్యార్థినులకు హమీ ఇచ్చారు

Related News

BIG BREAKING: టీడీపీ ఎమ్మెల్సీగా అనురాధ అనూహ్య విజయం!
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ పెంచిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక ముగిసింది. అసెంబ్లీలో మొత్తం 175 మంది ఎమ్మెల్యేలు ఉంటే, 175 మంది కూడా ఓట్లు వేశారు. అయితే చివరి వరకు ఒక్క ఓటుపై ఉత్కంఠ కనిపించింది.