MP Kesineni Nani : ఎంపీ కేశినేని కీలక వ్యాఖ్యలు..ముచ్చటగా మూడోసారి..?
విజయవాడ ఎంపీ కేశినేని నాని కీలక వ్యాఖ్యలు చేశారు. విజయవాడ ఎంపీ మూడోసారి పార్లమెంట్‌లో అడుగుపెడాతానని
- Author : Prasad
Date : 03-09-2023 - 7:24 IST
Published By : Hashtagu Telugu Desk
విజయవాడ ఎంపీ కేశినేని నాని కీలక వ్యాఖ్యలు చేశారు. విజయవాడ ఎంపీ మూడోసారి పార్లమెంట్‌లో అడుగుపెడాతానని కార్యకర్తల సమక్షంలో తెలిపారు. ఇక్కడి ప్రజల కోసం మళ్లీ ఎంపీని అవుతానని ఆయన తెలిపారు. ఇటు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిపై కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా ఎంఎస్ బేగ్ పోటీ చేస్తారని.. అందరూ ఎంఎస్ బేగ్ విజయం కోసం కృషి చేయాలన్నారు. ఎంఎస్ బేగ్‌ను గెలిపించే బాధ్యత తనదేనని ఎంపీ కేశినేని తెలిపారు.
అయితే గత కొద్ది రోజులుగా విజయవాడ ఎంపీ అభ్యర్థిగా నాని సోదరుడు చిన్ని పోటీ చేస్తారనే ప్రచారం జోరుగాసాగింది. లోకేష్ యువగళం పాదయాత్రలో కూడా చిన్ని అన్ని ఏర్పాట్లును చూశాడు.అయితే నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్న కేశినేని నాని మాత్రం చిన్ని దూకుడుకు కళ్లెం వేస్తున్నారు. తాజా ప్రకటనతో చిన్ని వర్గం అయోమయంలో పడింది. ఎంపీ కేశినేని నాని పోటీ చేయని పక్షంలోనే టికెట్ చిన్నికి ఇచ్చే ఆలోచనలో అధిష్టానం ఉన్నట్లు సమాచారం.