Accident : అజ్మేర్ లో విజయవాడ న్యాయవాదుల బస్సుకు ప్రమాదం..బాబు సంతాపం
Vijayawada Bar Association : విజయవాడ నుంచి బార్ అసోసియేషన్ న్యాయవాదులు రెండు బస్సుల్లో అజ్మేర్ విహార యాత్రకు వెళ్లారు
- By Sudheer Published Date - 11:23 AM, Tue - 8 October 24

రాజస్థాన్ లోని అజ్మేర్ లో విజయవాడ బార్ అసోసియేషన్ (Vijayawada Bar Association) న్యాయవాదుల బస్సుకు ఘోర ప్రమాదం (BUS Accident) జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా..11 మందికి తీవ్ర గాయాలయ్యాయి. విజయవాడ నుంచి బార్ అసోసియేషన్ న్యాయవాదులు రెండు బస్సుల్లో అజ్మేర్ (Ajmer) విహార యాత్రకు వెళ్లారు. మంగళవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఆగి ఉన్న ట్రక్కును న్యాయవాదుల బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సీనియర్ న్యాయవాది సుంకర రాజేంద్ర ప్రసాద్ (Sunkara Rajendra Prasad) భార్య జ్యోత్స్న (Jyotsna) అక్కడికక్కడే మృతి చెందగా..మిగతావారికి తీవ్ర గాయాలయ్యాయి.
ఈ ప్రమాదం ఫై సీఎం చంద్రబాబు (CHandrababu) అరా తీశారు. లాయర్ సుంకర రాజేంద్రప్రసాద్ భార్య జ్యోత్స్న మృతి చెందడంపై చంద్రబాబు దిగ్బ్రాంతి వ్యక్తం చేసారు. మహిళలు, విద్యార్థినులను చైతన్య పరిచేలా ఆమె కార్యక్రమాలు నిర్వహించారని గుర్తు చేసుకున్న బాబు.. ఆమె ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. బస్సు ప్రమాదానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నానని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని సూచించారు. అలాగే ఈ ఘటనపై మంత్రి నారా లోకేష్ స్పందించారు. విహారయాత్ర విషాదయాత్రగా మారడం విచారకరమని పేర్కొన్నారు. న్యాయవాది రాజేంద్రప్రసాద్ భార్య ఈ ప్రమాదంలో మరణించడం బాధాకరమన్నారు. ప్రమాదంలో గాయపడిన రాజేంద్రప్రసాద్, ఇతర లాయర్లు వీలైనంత త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.
Read Also : Amavasya: దురదృష్టం పోవాలంటే అమావాస్య రోజు ఏం చేయాలి,ఏం చేయకూడదో మీకు తెలుసా?