Vijayawada: రూ. కోటి పరిహారం ఇవ్వాలని మాజీ మంత్రి కన్నాకు కోర్టు ఆదేశం
గృహహింస కేసులో కోటి రూపాయల నష్టపరిహారం చెల్లించాలని మాజీ మంత్రి , ఏపీ బీజేపీ మాజీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణకు విజయవాడ కోర్టు ఆదేశించింది.
- By Hashtag U Published Date - 12:39 PM, Thu - 20 January 22

గృహహింస కేసులో కోటి రూపాయల నష్టపరిహారం చెల్లించాలని మాజీ మంత్రి , ఏపీ బీజేపీ మాజీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణకు విజయవాడ కోర్టు ఆదేశించింది. జనవరి 19న బుధవారం లోపు పరిహారం చెల్లించాలని విజయవాడ మొదటి అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ కోర్టు తీర్పు చెప్పింది. కన్నా లక్ష్మీనారాయణ కుమారుడు కన్నా నాగరాజు, శ్రీలక్ష్మి కీర్తితో మే 10, 2016న ప్రేమ వివాహం జరిగింది. ఈ దంపతులకు 2013లో ఒక కుమార్తె జన్మించింది. ఆ తరువాత కీర్తి దాఖలు చేసిన గృహహింస కేసును కోర్టు విచారించింది. నిర్ణీత సమయానికి ముందు పరిహారం అందించడంలో విఫలమైతే, దానికి 12% వడ్డీ జోడించబడుతుందని పేర్కొంది. ఆమెకు రక్షణ కల్పించాలని పోలీసులను ఆదేశించింది. లక్ష్మీనారాయణ కుటుంబానికి వసతి సౌకర్యం కల్పించాలని, మనవరాలి చికిత్సకు రూ.50 వేలు ఇవ్వాలని కోర్టు సూచించింది. కన్నా లక్ష్మీనారాయణ మర్రి చెన్నారెడ్డి, వైఎస్ రాజశేఖర రెడ్డి, కె రోశయ్య మరియు కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో కాంగ్రెస్ మంత్రిగా పనిచేశారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా 2019 ఎన్నికల ముందు వరకు ఉన్నాడు. ప్రస్తుతం బీజేపీలోనే కొనసాగుతున్నాడు.