Vangaveeti Radha Wedding : వంగవీటి రాధా పెళ్లి ముహూర్తం ఫిక్స్..
అక్టోబర్ 22వ తేదీ ఆదివారం రాత్రి 7.59 నిమిషాలకు శ్రవణా నక్షత్రయుక్త వృషభ లగ్నం నందు నవ వధువరులు రాధ, పుష్పవల్లిలు ఒక్కటైయ్యేందుకు ఇరుపక్షాల పెద్దలు
- Author : Sudheer
Date : 08-10-2023 - 12:15 IST
Published By : Hashtagu Telugu Desk
వంగవీటి రాధా (Vangaveeti Radha ) పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. ఈ నెల 22 న రాధా ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఏపీ రాజకీయాల్లో పరిచయం చేయనవసరం లేని పేరు వంగవీటి రాధాకృష్ణ. వంగవీటి మోహనరంగా (Vangaveeti Mohana Ranga) వారసుడిగా రాజకీయల్లోకి అడుగుపెట్టిన రాధా గతంలో ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రస్తుతం టీడీపీలో కొనసాగుతున్నారు. వంగవీటి రంగా కుమారుడిగా రాధా కు మంచి గుర్తింపు..కుల బలం ఉంది. అయితే రాధా పెళ్లి (Vangaveeti Radha Wedding) చూడాలని ఆయన అభిమానులు ఎప్పటి నుండి కోరుకుంటున్నారు..ఇప్పుడా క్షణం వచ్చింది.
We’re now on WhatsApp. Click to Join.
నర్సాపురం మాజీ మున్సిపల్ ఛైర్ పర్సన్ జక్కం అమ్మణి, బాబ్జీ దంపతుల చిన్న కుమార్తె జక్కం పుష్పవల్లిని (Jakkam Pushpavalli) రాధా వివాహం చేసుకోబోతున్నాడు. నర్సాపురంలో ఈ మధ్యనే నిశ్చితార్ధం జరిగింది. రాధా వివాహానికి రాజకీయాలకు అతీతంగా ప్రముఖులు హాజరు కానున్నారు. దీంతో, కల్యాణ వేదిక ఎంపిక విషయంలో నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు రాధా వెడ్డిండ్ కార్డు వైరల్ అవుతోంది. అక్టోబర్ 22వ తేదీ ఆదివారం రాత్రి 7.59 నిమిషాలకు శ్రవణా నక్షత్రయుక్త వృషభ లగ్నం నందు నవ వధువరులు రాధ, పుష్పవల్లిలు ఒక్కటైయ్యేందుకు ఇరుపక్షాల పెద్దలు శుభ ముహూర్తాన్ని ఖరారు చేశారు.
విజయవాడ – నిడమానూరు పోరంకి రోడ్డు లోని మురళి రిసార్ట్స్‌లో ఈ వివాహం జరగనుంది. ఈ వివాహానికి పెద్ద సంఖ్యలో రాజకీయ , సినీ ప్రముఖులు హాజరుకానున్నట్లు సమాచారం.
ఇక రాధా రాజకీయాల విషయానికి వస్తే..రాధకృష్ణ తొలిసారిగా 2004లో కాంగ్రెస్ పార్టీ తరుపున విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత ప్రజారాజ్యంలోకి వెళ్లారు. ఆ పార్టీ కాంగ్రెస్‌లో విలీనం తర్వాత కొంతకాలం సైలెంట్‌గా ఉండి తర్వాత టీడీపీలో చేరారు. ప్రస్తుతం టీడీపీలో క్రియాశీలనేతగా ఉన్నారు.
Read Also: Telangana : రైతులందరికీ పెన్షన్ ఇచ్చే ఆలోచనలో సీఎం కేసీఆర్..?