HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Vanga Geetha Counter To Pawan Kalyan

Vanga Geetha Counter To Pawan Kalyan : పవన్‌వి దింపుడు కళ్లెం ఆశలే అని ఎద్దేవా చేసిన వంగా గీత

తాను కూడా పవన్‌ను వైసీపీలోకి ఆహ్వానిస్తే ఎలా ఉంటుంది? అని ప్రస్తావించారు

  • Author : Sudheer Date : 20-03-2024 - 12:15 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Pawan Vangageetha
Pawan Vangageetha

ఏపీలో ఎన్నికల హోరు రోజు రోజుకు మరింత వేడెక్కుతుంది. మే 13 న పోలింగ్ జరగబోతుండడం తో అధికార – ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ముఖ్యంగా పిఠాపురం (Pithapuram ) బరిపైనే అంత ఆసక్తి నెలకొంది. దీనికి కారణం అక్కడ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పోటీ చేస్తుండటమే. గత ఎన్నికల్లో భీమవరం, గాజువాక నియోజకవర్గాల్లో పోటీ చేసి ఓటమి చెందిన పవన్..ఈసారి పిఠాపురం ఎంచుకోవడం ఫై అందరు ఈ స్థానం పైనే మాట్లాడుకుంటున్నారు. ప్రస్తుతం అక్కడి సర్వేలు చూస్తే పవన్ కళ్యాణ్ కే జై కొడుతున్నప్పటికీ..ఎన్నికల పోలింగ్ సమయానికి ఏదైనా జరగొచ్చు అని అభిప్రాయపడుతున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

నిన్న మంగళగిరి పార్టీ కార్యాలయంలో పిఠాపురంలో పోటీ చేసే అంశంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. వంగా గీత (Vanga Geetha)పై సంచలన వ్యాఖ్యలు చేశారు. పిఠాపురం కాబోయే ఎమ్మెల్యే తానేనని, వంగా గీత ప్రజారాజ్యంతోనే రాజకీయాల్లోకి వచ్చారని, భవిషత్తులో ఆమె జనసేనలో చేరితే బాగుంటుందని పిలుపునిచ్చారు. వైసీపీ నేతల దగ్గర చాలా డాబులున్నాయని, తనను ఓడించటానికి కోట్లు కోట్లు ఖర్చు పెడతారని, ఓటుకు లక్ష రూపాయలైనా ఇస్తారని అన్నారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశం అయ్యాయి.

అయితే పవన కళ్యాణ్ వ్యాఖ్యలపై కాకినాడ ఎంపీ, వైసీపీ పిఠాపురం అభ్యర్థి వంగా గీత స్పందించారు. తాను కూడా పవన్‌ను వైసీపీలోకి ఆహ్వానిస్తే ఎలా ఉంటుంది? అని ప్రస్తావించారు. తాను 2009 కంటే ముందు నుంచే రాజకీయాల్లో ఉన్నానని పేర్కొన్నారు. ఇక 2009లో చిరంజీవి తనకి అవకాశం కల్పించారని.. ప్రజల ఆదరాభిమానాలతో తాను గెలుపొందినట్లు వెల్లడించారు. ఇప్పుడు కూడా నియోజకవర్గంలో అన్ని వర్గాల ప్రజల మద్దతు తనకే ఉందని పేర్కొన్నారు. పిఠాపురంలో గెలుపుపై పవన్‌వి దింపుడు కళ్లెం ఆశలే అని ఎద్దేవ చేశారు.

Read Also : CP Radhakrishnan : తెలంగాణ గవర్నర్‌గా సీపీ రాధాకృష్ణన్‌ ప్రమాణం


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Pawan Kalyan
  • pithapuram
  • vanga geetha

Related News

Chandrababu Pawan Kalyan

తొందర పడొద్దంటూ చంద్రబాబు, పవన్ నిర్ణయం

బుధువారం జరిగిన రెండు గంటల సుదీర్ఘ భేటీలో, రాష్ట్రంలో కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YCP) కుట్రలు చేస్తోందని ఇద్దరు నేతలు అభిప్రాయపడ్డారు. రాజకీయ ప్రయోజనాల కోసం రెండు ప్రధాన సామాజిక వర్గాల మధ్య విభేదాలు సృష్టించడం ద్వారా రాష్ట్రంలో అశాంతిని కలిగించే ప్రయత్నం జరుగుతోందని వారు ఆందోళన వ్యక్తం చేశారు

  • Pawan Kalyan Narrowly Escap

    పవన్ కళ్యాణ్ చెపితే తెలంగాణ ప్రజలు ఓట్లు వేస్తారా ? – TPCC చీఫ్ మహేష్

  • Pawan Kalyan

    పవన్ కళ్యాణ్ ను రోజు తిడితే ఎమ్మెల్సీ పదవి !!

  • Pawan Kalyan Campaign In Mu

    తెలంగాణ మున్సిపల్ బరిలోకి దిగుతున్న పవన్ కళ్యాణ్

  • Bolli Shetty Satyanarayana

    జనసేనకు బిగ్ షాక్ ఇచ్చిన కీలక నేత..అయోమయంలో పార్టీ శ్రేణులు !!

Latest News

  • టీ-20ల్లో అత్యంత ప్రమాదకరమైన బ్యాటర్ ఎవరు? రిషబ్ పంత్ ఆసక్తికర సమాధానం!

  • కార్లలో క్రూయిజ్ కంట్రోల్ ఫీచర్.. సౌకర్యవంతమే, కానీ జాగ్రత్తలు తప్పనిసరి!

  • చిగుళ్ల నుండి రక్తం వస్తుంటే ఆందోళన వద్దు.. ఈ చిట్కాలతో ఉపశమనం పొందండి!

  • బంగారం, వెండి ధరల్లో భారీ తగ్గుదల.. ఫిబ్రవరిలో మ‌రింత తగ్గే అవకాశం ఉందా?

  • బెన్ స్టోక్స్‌కు ఘోర ప్రమాదం.. ముఖంపై బలమైన గాయం!

Trending News

    • యూపీఎస్సీ సీఎస్ఈ, ఐఎఫ్ఎస్ 2026 నోటిఫికేషన్ విడుదల..

    • ఏపీ, తెలంగాణల్లో భయపెడుతున్న హెచ్ఐవీ మరణాలు

    • మద్యం ప్రియులకు గుడ్ న్యూస్.. MRP ధరలకే విక్రయం !

    • మరణానికి ముందు అతనికి ఫోన్ కాల్.. అజిత్ పవార్ చివరి మాటలు ఇవే !

    • టీ20 వరల్డ్ కప్‌.. భారత్-పాక్ మ్యాచ్ జ‌ర‌గ‌కుంటే రూ. 4,500 కోట్ల న‌ష్టం?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd