P4 Scheme : చంద్రబాబు పీ4 విధానానికి అనూహ్య స్పందన
P4 Scheme : ఇటీవల ఈ విధానానికి అనుగుణంగా ప్రసాద్ సీడ్స్ సంస్థ అధినేత ప్రసాద్ (Prasad Seeds) రూ.10 కోట్లను కొమ్మమూరు లిఫ్ట్ ఇరిగేషన్ నిర్మాణానికి విరాళం ప్రకటించారు
- By Sudheer Published Date - 08:23 PM, Sat - 5 April 25

ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు (Chandrababu) ప్రవేశపెట్టిన “పీ4 విధానం” (P4 Scheme) ప్రజల నుంచి విశేష స్పందన వస్తుంది. ఇటీవల ఈ విధానానికి అనుగుణంగా ప్రసాద్ సీడ్స్ సంస్థ అధినేత ప్రసాద్ (Prasad Seeds) రూ.10 కోట్లను కొమ్మమూరు లిఫ్ట్ ఇరిగేషన్ నిర్మాణానికి విరాళం ప్రకటించారు. గుంటూరు జిల్లాలోని కాకుమాను మండలానికి చెందిన రైతులకు ఈ ప్రాజెక్టు ద్వారా సాగునీటి సమస్యలు తీరనున్నాయి. దీంతో మండలంలోని 5,315 ఎకరాలకు తాగునీటి సరఫరా మెరుగుపడనుంది. ఈ చర్యను అభినందించిన చంద్రబాబు, ఇరిగేషన్ అధికారులను ప్రసాద్ సీడ్స్‌తో సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు.
Barack Obama: భార్య మిచెల్ ఒబామాతో విడాకుల పుకార్లు.. అసలు విషయం చెప్పిన ఒరాక్ ఒబామా
పీ4 విధానం అంటే పబ్లిక్, ప్రైవేట్, పీపుల్ పార్ట్‌నర్‌షిప్ అని అర్థం. ఈ విధానం స్వర్ణాంధ్ర 2047 విజన్‌కు ఆధారంగా రూపొందించబడింది. పేదరిక నిర్మూలన, సామాజిక-ఆర్థిక అసమానతల తొలగింపు లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉగాది రోజున దీనిని ప్రారంభించారు. ఈ విధానంలో టాప్ 10% సంపన్నులు తమ సామర్థ్యం మేరకు అట్టడుగున ఉన్న 20% పేద కుటుంబాలను ఆదుకోవడం ప్రధాన ఉద్దేశం. వారికి భవనాలు, తాగునీటి సదుపాయం, విద్యుత్, ఎల్పీజీ వంటి అవసరాలను తీర్చే బాధ్యతను వారు స్వచ్ఛందంగా తీసుకుంటారు.
ఈ కార్యక్రమాన్ని బాపట్ల జిల్లాలోని కొత్త గొల్లపాలెంలో పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేశారు. అక్కడ వచ్చిన ఫలితాలను బట్టి రాష్ట్రవ్యాప్తంగా మొదటి దశలో 20 లక్షల పేద కుటుంబాలను “బంగారు కుటుంబాలు”గా ఎంపిక చేసి, వారిని సంపన్న మార్గదర్శులతో అనుసంధానం చేయనున్నారు. ప్రభుత్వ పాత్ర ఈ చర్యలో కేవలం సమన్వయకర్తగా ఉంటుంది. ఇందులో ఎవరినీ బలవంతంగా చేర్చరు. ఇది పూర్తిగా స్వచ్ఛంద ప్రాతిపదికన జరిగే కార్యక్రమం. పీ4 విధానం ద్వారా సమాజంలోని అన్ని వర్గాల భాగస్వామ్యంతో సమగ్ర అభివృద్ధి సాధించాలన్న లక్ష్యంతో ఏపీ ప్రభుత్వం ముందడుగేస్తోంది.