Elephants: ప్రమాదం లో గజరాజులు!
ఒడిస్సా నుండి వలస వొచ్చిన గజరాజులు విజనగరం జిల్లా పార్వతీపురం లొ హల్చల్ చేస్తున్నాయి.
- By Hashtag U Published Date - 12:13 AM, Fri - 12 November 21

ఒడిస్సా నుండి వలస వొచ్చిన గజరాజులు విజయనగరం జిల్లా పార్వతీపురం లొ హల్ చల్ చేస్తున్నాయి. ఆరుగాలం కష్టపడి పండించిన పంట ని ఏనుగులు తమ కళ్ళ ముందే ద్వoసం చేయ డాన్ని జీర్ణించు కొ లే క పోతున్నారు రైతులు.దింతో వాటి పై దాడి కి సిద్ధం అయ్యారు..గడిచిన 4 ఏళ్ళు గా ఏనుగుల దాడి లొ 7 గురు ప్రాణాలు కోల్పోగా, 6 గజరాజులు విగత జీవులు గా మారాయి.
ఏనుగుల దాడి లొ తాము నష్ట పోయింది 15000 వేలు అయితే కేవలం 6000 వేలే ఇచ్చి అటవీ అధికారులు చేతులు దులుపుకున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు..మాకు నష్ట పరిహారం కన్నా ఏనుగులను ఇక్కడి నుండి తరలించడం ముఖ్యం అని గుండమ్మ అనే రైతు ఆవేదన వ్యక్తం చేసింది.2008 లోనే ఏనుగులను వెనక్కి పంపడానికి 4 రోజులు ఆపరేషన్ గజ చేసిన ఫలితం శూన్యం.
ఏనుగులు తమ సమయాన్ని 70-75%ఆహార వేట లోనే గడుపుతాయి. భారీ కాయం కావడం తొ వాటి నివాసనికి అటవీ ప్రాంతం లొ 700ఒడ్ sq km కావాల్సిఉంటుంది. మైనింగ్ కారణంగా ఒడిస్సా లొ అటవీ సంపద కుచించుకు పోవడం తొ గజరాజులు ఆంధ్ర బాట పట్టాయి.ఒడిస్సలో 1900 లు ఏనుగులు ఉండగా ఇప్పుడు సగానికి పైగా వలస పోయాయాంటే పరిస్థి తీవ్రత తెలుస్తుంది.
ఉత్తరాంధ్ర లొ ఉన్న దట్టమైన అటవీ ప్రాంతం, పుష్కల మైన నీరు, పంట పొలాలు పార్వతీపురం పురానికి ఎన్నుగులు వలస రావడానికి కారణాలు.ఏనుగుల వలస వాటి కే కాదు ఉత్తరాంధ్ర ప్రజలను కష్టాల్లోకి నేడుతుంది.ఏనుగుల నుండి ప్రజలను,ప్రజల నుండి గజ రాజు ల ను కాపాడడానికి అటవీ శాఖ అధికారులు నానా పాట్లు పడుతున్నారు.. అయిన సమస్య సద్దు మనగడం లేదు.
The Odisha-Andhra border is known for the movement of elephants but over the years the their numbers have been dwindling.The Andhra Pradesh Forest Department is taking continuous efforts in tracking these elephants movements for their safe passage.@AP_Forest @prateepifs pic.twitter.com/Vvyj7FABm7
— WCTRE (@wctre_org) September 1, 2020
Related News

Snake Head Alive : చనిపోయాక కూడా పాము తల సజీవంగానే ఉంటుందా ?
Snake Head Alive : పాము తల తెగిపోయిన తర్వాత కూడా కొన్ని గంటలపాటు సజీవంగానే ఉంటుంది. ఈవిషయం మీకు తెలుసా ?