Tuni Vice Chairman Election : నాలుగోసారి వాయిదా పడిన తుని వైస్ చైర్మన్ ఎన్నిక
Tuni Vice Chairman Election: వైసీపీ కౌన్సిలర్లు ఎన్నికకు హాజరు కాకపోవడం వల్ల కోరం కుదరడం లేదని, ఈ కారణంగా మరోసారి ఎన్నికను వాయిదా వేయాల్సి వచ్చిందని తెలిపారు
- By Sudheer Published Date - 01:10 PM, Tue - 18 February 25

కాకినాడ జిల్లా తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక నాలుగోసారి వాయిదా (Tuni Municipal Election Postponed) పడింది. ఎన్నికల అధికారిగా వ్యవహరిస్తున్న జాయింట్ కలెక్టర్ ఈ విషయాన్ని స్పష్టంగా ప్రకటించారు. వైసీపీ కౌన్సిలర్లు ఎన్నికకు హాజరు కాకపోవడం వల్ల కోరం కుదరడం లేదని, ఈ కారణంగా మరోసారి ఎన్నికను వాయిదా వేయాల్సి వచ్చిందని తెలిపారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలను అనుసరించి తదుపరి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.
MGNREGA Workers : ఏపీలో ఉపాధి హామీ కూలీలకు శుభవార్త
ఈ ఎన్నికల ప్రక్రియ చాలా ఆసక్తికరంగా మారింది. గత మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ 28 మంది కౌన్సిలర్లను గెలిపించుకుంది. కానీ ఏపీ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో వైస్ చైర్మన్ ఎన్నిక నిర్వహించేందుకు ప్రయత్నించారు. అయితే మూడుసార్లు వాయిదా పడిన ఈ ఎన్నిక, ఇప్పుడు నాలుగోసారి కూడా కోరం కుదరక వాయిదా పడింది. టీడీపీ మద్దతుదారులు హాజరయ్యేనా, వైసీపీ కౌన్సిలర్లు మాత్రం పోలింగ్‌కు దూరంగా ఉన్నారు. వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడటానికి క్యాంప్ రాజకీయాలు ప్రధాన కారణంగా మారాయి. వైసీపీ మద్దతుతో గెలిచిన 10 మంది కౌన్సిలర్లు టీడీపీలో చేరారు. ఈ పరిణామంతో, టీడీపీ 17 మంది కౌన్సిలర్లతో క్యాంప్ ఏర్పాటు చేసి, వైసీపీపై ఒత్తిడి పెంచింది. అయితే వైసీపీ కౌన్సిలర్లు ఎన్నిక సమయానికి హాజరు కాకుండా ఉండటంతో కోరం లేని కారణంగా ఎన్నిక మరోసారి వాయిదా పడింది. దీనిపై వైసీపీ నేత, మాజీ మంత్రి దాడిశెట్టి రాజా తీవ్రంగా స్పందించారు. టీడీపీ బలవంతంగా కౌన్సిలర్లను లాక్కుంటోందని ఆరోపిస్తూ, ఆందోళన వ్యక్తం చేశారు.
Deepam Scheme : ‘దీపం పథకం’పై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
ఈ రాజకీయ ఉద్రిక్తతల మధ్య ముద్రగడ పద్మనాభరెడ్డి ‘చలో తుని’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పోలీసులు నోటీసులు ఇచ్చినా పట్టించుకోకుండా కిర్లంపూడి నుంచి తునికి బయలుదేరారు. తునిలో నిరసనలకు అనుమతి లేదని పోలీసులు ముందుగానే ప్రకటించినా, ఆయన వెనుకడుగు వేయలేదు. ఈ చర్యలతో తుని, కాకినాడ ప్రాంతాల్లో వైసీపీ నేతల హౌస్ అరెస్టులు పెరిగాయి. మాజీ మంత్రి కురసాల కన్నబాబు, ఇతర వైసీపీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మొత్తం మీద తుని ఎన్నికలు ఇలా రసవత్తరంగా మారడంతో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.