TTDs Key Decision : భక్తుల భద్రత కోసం టీటీడీ కీలక నిర్ణయం
TTDs Key Decision : తిరుమల ఘాట్‌రోడ్లలో కొండ చరియలు విరిగిపడి వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలగకుండా టీటీడీ పలు ముందస్తు చర్యలను చేపట్టింది.
- Author : Pasha
Date : 15-09-2023 - 9:39 IST
Published By : Hashtagu Telugu Desk
TTDs Key Decision : తిరుమల ఘాట్‌రోడ్లలో కొండ చరియలు విరిగిపడి వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలగకుండా టీటీడీ పలు ముందస్తు చర్యలను చేపట్టింది. మద్రాస్ ఐఐటీ, కొన్ని ప్రముఖ యూనివర్సిటీలకు చెందిన నిపుణులు ఘాట్‌రోడ్లలో కొండరాళ్లు జారిపడే ప్రాంతాలను గుర్తించి ఇచ్చిన సూచనలకు అనుగుణంగా ప్రస్తుతం పనులు చేస్తున్నారు. రాక్ బోల్టింగ్, సంబంధిత పనులను శరత్‌చంద్ర కన్‌స్ట్రక్షన్స్ నిర్వహిస్తోంది. ఎత్తైన కొండలు ఉన్న ప్రదేశాల్లో ఫెన్సింగ్, రాక్‌బోల్టింగ్ చేస్తున్నారు. తక్కువ ఎత్తున్న ప్రదేశాల్లో ఫెన్సింగ్‌లో నింపిన కొండరాళ్లను అడ్డుగోడలా పెట్టి బండరాళ్లు, మట్టి జారకుండా చర్యలు చేపట్టారు.
Also read : Golden Ticket: ధోనీ, ఇస్రో చీఫ్‌లకు కూడా వరల్డ్ కప్ గోల్డెన్ టికెట్ ఇవ్వాలి.. బీసీసీఐని కోరిన గవాస్కర్
తిరుప్పావై ప్రవచన కర్తలకు ఆహ్వానం
ఈ ఏడాది డిసెంబరు 17 నుంచి 2024 జనవరి 14 వరకు దేశంలోని వివిధ ప్రాంతాల్లో తిరుప్పావై ప్రవచనాలు చెప్పేందుకు శ్రీవైష్ణవ సిద్ధాంతం తెలిసిన విద్వాంసుల నుంచి అంగీకార పత్రాలను టీటీడీ (TTDs Key Decision) ఆహ్వానిస్తోంది. 2015 నుంచి 2023 వరకు తిరుప్పావై ప్రవచనాలు చెప్పిన వారు ఈ సంవత్సరం కూడా అంగీకారం తెలపాల్సిందిగా కోరారు. అర్హులైనవారు అక్టోబరు 15న సాయంత్రం 5 గంటలలోపు ప్రత్యేకాధికారి, ఆళ్వార్ దివ్యప్రబంధ ప్రాజెక్టు, శ్వేత భవనం, టీటీడీ, తిరుపతి-517502 అనే అడ్రస్ కు తమ అంగీకార పత్రాలను పంపాల్సి ఉంటుంది. పూర్తి వివరాలకు www.tirumala.org వెబ్‌సైట్ ను చూడొచ్చు.