TTD : తిరుమలలో కొనసాగుతున్న రద్ధీ.. రేపు శ్రీవారి నవంబర్ నెల టికెట్లు విడుదల
తిరుమల శ్రీవారి సన్నిధిలో భక్తుల రద్ధీ కొనసాగుతుంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 24 కంపార్ట్‌మెంట్లు భక్తులతో..
- By Prasad Published Date - 08:49 AM, Tue - 20 September 22

తిరుమల శ్రీవారి సన్నిధిలో భక్తుల రద్ధీ కొనసాగుతుంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 24 కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. శ్రీవారిని దర్శించుకోవడానికి సుమారు 12 గంటల సమయం పట్టే అవకాశం ఉన్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. నిన్న శ్రీవారిని 67,276 మంది భక్తులు దర్శించుకోగా.. 31,140 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 5.71 కోట్ల రూపాయలుగా ఉంది. రేపు నవంబర్ నెలకు సంబంధించి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు ఆన్ లైన్ కోటాను టీటీడీ అధికారులు విడుదల చేయనున్నారు. రేపు ఉదయం 9 గంటల నుంచి టీటీడీ వెబ్‌సైట్ లో ఈ టిక్కెట్లు అందుబాటులో ఉండనున్నాయి. నవంబరు నెలలోనే ఊంజల్ సేవ, కల్యాణోత్సవం, సహస్ర దీపాలంకార సేవ ఆర్జిత సేవా టిక్కెట్లు రేపు మధ్యాహ్నం 3 గంటలకు ఆన్ లైన్ లో అందుబాటులో ఉండనున్నాయి. అంగప్రదిక్షిణం అక్టోబు నెల టోకెన్లకు సంబంధించి ఈ నెల 22న అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు. బ్రహ్మోత్సవాలు జరిగే అక్బోబరు 1నుంచి ఐదో తేదీ వరకూ అంగ ప్రదిక్షణ టోకెన్లు ఉండవు.