Trolling Effect : జగన్ గాయం మాయం…అసలు అక్కడ గాయం ఉందా..?
చిన్న గులకరాయి తగిలితే అంత బ్యాండెయిడ్ అవసరమా..ఏమన్నా నాటకం ఆడుతున్నారా..? అంటూ సెటైర్లు వేయడం స్టార్ట్ చేసారు
- Author : Sudheer
Date : 27-04-2024 - 12:51 IST
Published By : Hashtagu Telugu Desk
కొద్దీ రోజుల క్రితం ఎన్నికల ప్రచారం (AP Election Campaign) చేస్తున్న సీఎం జగన్ (Jagan) ఫై సతీష్ అనే యువకుడు గులక రాయి తో దాడి (Stone Attack) చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడి లో ఆ రాయి జగన్ ఎడమకంటికి తగలడంతో అక్కడ గాయమైంది. అదే రాయి పక్కనున్న వెల్లంపల్లి కూడా తగలడంతో ఆయన కంటికి కూడా గాయమైంది. దీంతో గత 15 రోజులుగా వారిద్దరూ బ్యాండెయిడ్(స్టిక్కర్) లతో ప్రజల్లో తిరుగుతూ వస్తున్నారు. ఇక జగన్ బ్యాండెయిడ్ రోజు రోజుకు పెరుగుతుండడం తో ప్రతిపక్షాలు విమర్శలకు దిగారు. చిన్న గులకరాయి తగిలితే అంత బ్యాండెయిడ్ అవసరమా..ఏమన్నా నాటకం ఆడుతున్నారా..? అంటూ సెటైర్లు (Trolling)వేయడం స్టార్ట్ చేసారు. ఇక సోషల్ మీడియా లోను నెటిజన్లు జగన్ బ్యాండెయిడ్ ఫై మీమ్స్, వీడియోస్ చేస్తూ హల్చల్ చేస్తున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
ప్రజలు కూడా చిన్న దెబ్బకు ఇన్ని రోజులు బ్యాండెయిడ్ అవసరమా..? అంతగానూ దెబ్బ తగిలిందా..? గత ఎన్నికల్లో కోడి కత్తి డ్రామా..ఇప్పుడు గులకరాయి డ్రామా ఆడుతున్నారని విమర్శించడం స్టార్ట్ చేసారు. ఇది గమనించిన వైసీపీ సోషల్ మీడియా..ఇంకా బ్యాండెయిడ్ లతో తిరిగితే మొదటికి మోసం వస్తుందని చెప్పడం తో ఈరోజు జగన్ బ్యాండెయిడ్ లేకుండా మీడియా ముందుకు వచ్చాడు.ఈరోజు మేనిఫెస్టో విడుదల కార్యక్రమంలో జగన్ బ్యాండెయిడ్ లేకుండా వచ్చేసరికి అరే..జగన్ గాయం మాయమైందే..అంటూ సెటైర్లు వేయడం స్టార్ట్ చేసారు. అసలు అక్కడ గాయమే లేదుకదా..గాయం అయినట్లు అక్కడ కనిపించడమే లేదుకదా..ఇన్ని రోజులు ఎందుకు బ్యాండెయిడ్ వేసుకొని తిరిగాడని కామెంట్స్ చేయడం స్టార్ట్ చేసారు. ఏది ఏమైనప్పటికి జగన్ గాయం కు పుల్ స్టాప్ పెట్టేసాడు..నెక్స్ట్ ఏం చేస్తాడో అనేది చూడాలి.
Read Also : Banks New Rules : మే నుంచి మారనున్న బ్యాంకు రూల్స్ ఇవే