Private Travel : ప్రైవేటు బస్సులపై అధికారులు కొరడా
Private Bus : దసరా ను కుటుంబ సభ్యులతో ఎంతో సంతోషంగా జరుపుకోవాలని భావించిన వారికీ ప్రైవేటు ట్రావెల్స్ వారు చుక్కలు చూపించారు
- By Sudheer Published Date - 11:24 AM, Mon - 14 October 24

ప్రైవేటు ట్రావెల్ (Private Travel) బస్సులపై అధికారులు కొరడా ఝులిపించారు. దసరా (Dasara) పండగను ప్రైవేటు ట్రావెల్ యాజమాన్యం బాగానే క్యాష్ చేసుకున్నారు. టికెట్ ధరలను (Private ట్రావెల్ Bus Ticket పరిచే) మూడు రేట్లు పెంచి ప్రయాణికుల జేబులు ఖాళీ చేసారు. దసరా ను కుటుంబ సభ్యులతో ఎంతో సంతోషంగా జరుపుకోవాలని భావించిన వారికీ ప్రైవేటు ట్రావెల్స్ వారు చుక్కలు చూపించారు. దసరా సందర్భంగా సొంతూళ్లకు వచ్చే వారి నుంచి సంఖ్య అధికంగా ఉండడంతో, డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని టిక్కెట్ ధరలను పెంచడంతోపాటు, సరైన పత్రాలు, అనుమతులు లేకుండానే ప్రైవేటు బస్‌సర్వీసులను భారీ ఎత్తున బస్సులను నడిపారు.
పండగకు వెళ్లాలనే ఉద్దేశంతో ధరల భారాన్ని ప్రయాణికులు భరించారు. పలువురు ప్రయాణికులు ఇచ్చిన ఫిర్యాదుతో రవాణా అధికారులు ప్రవేట్ ట్రావెల్ బస్సు లపై నిఘా పెట్టారు. విజయవాడతో పాటు పలు నగరాల్లో బస్సుల్లో తనిఖీలు చేశారు. టికెట్ ధరల పెంపుపై ప్రయాణికుల నుంచి వివరాలు సేకరించి అధిక వసూళ్లకు పాల్పడిన బస్సు లను సీజ్ చేసారు. విజయవాడ(Vijayawada)లో నిర్వహించిన తనిఖీల్లో మొత్తం 16 ప్రైవేటు బస్సులను సీజ్ చేశారు. అధిక ధరలు వసూలు చేశారని కేసులు నమోదు చేశారు. ఇదేదో పండగకు ముందే కాస్త ఎక్కువగా తనిఖీలు చేపడితే బాగుండేదని ప్రయాణికులు వాపోయారు.
Read Also : Flight Bomb Threat: ఎయిరిండియా విమానానికి బాంబు బెదిరింపు.. ఢిల్లీలో అత్యవసర ల్యాండింగ్