HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Trains Canceled Between Vijayawada To Visakhapatnam

Trains Cancelled : విజయవాడ డివిజన్‌ పరిధిలో 47 రోజుల పాటు పలు రైళ్లు రద్దు

మొన్నటి వరకు వరంగల్ - విజయవాడ రూట్లలో పలు రైళ్ల సర్వీస్ లను రద్దు చేయగా..ఇప్పుడు విజయవాడ డివిజన్‌ పరిధిలో దాదాపు 47 రోజుల పాటు పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు తెలిపింది

  • Author : Sudheer Date : 24-06-2024 - 11:59 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Train Cance
Train Cance

గత కొద్దీ నెలలుగా ప్రయాణికులకు వరుస షాకులు ఇస్తుంది దక్షిణ మధ్య రైల్వే. ఆధునికీకరణ పేరుతో వరుసగా రైళ్లను రద్దు చేస్తుండడం తో ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఎప్పుడు ఏ ట్రైన్ నడుస్తుందో..ఏ ట్రైన్ నడవదు అర్ధం కావడం లేదని ప్రయాణికులు వాపోతున్నారు. మొన్నటి వరకు వరంగల్ – విజయవాడ రూట్లలో పలు రైళ్ల సర్వీస్ లను రద్దు చేయగా..ఇప్పుడు విజయవాడ డివిజన్‌ పరిధిలో దాదాపు 47 రోజుల పాటు పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు తెలిపింది. గత కొద్దీ రోజులుగా తరచుగా సింహాద్రి, ఉదయ్, రాయగడ ఎక్స్‌ప్రెస్‌లను రద్దు చేస్తూ వచ్చారు. కానీ వీటికి ప్రత్యామ్నాయంగా జన్మభూమి, రత్నాచల్‌ రైళ్లు నడుస్తుండడంతో ప్రయాణికులు పెద్దగా ఇబ్బందులు పడలేదు. అయితే కీలకమైన ఈ రైళ్లను 47రోజులపాటు రద్దు చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

We’re now on WhatsApp. Click to Join.

వైజాగ్ నుంచి అన్నవరం, రాజమహేంద్రవరం, ఏలూరు, తాడేపల్లిగూడెం, విజయవాడ వెళ్లే ప్రయాణికుల్లో ఎక్కువ మంది జన్మభూమి, రత్నాచల్, సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌లలోనే ఎక్కుతారు. దీనికి కారణం వీటి ఛార్జీలు తక్కువగా ఉండడమే. ఒక్కో రైలులో రోజుకు 2 వేల మంది ప్రయాణం చేస్తారని అంచనా వేసినా, మూడు రైళ్లను కలిపి సుమారు 6 వేల మందిని ప్రయాణిస్తున్నారు. తిరుగు ప్రయాణంలో సైతం ఇదే స్థాయిలో జనాలు ఆయా రైళ్లను ఆశ్రయిస్తారు. ఈ లెక్కన రోజుకు 12 వేల మంది ఆయా రైళ్లపై ఆధాపడుతున్నారు. అంతటి కీలకమైన రైళ్లను ఈనెల 24వ తేదీ నుంచి ఆగస్టు 11వ తేదీ వరకు ఏకంగా 47 రోజులపాటు రద్దు చేయడం సరికాదనే వాదన వినిపిస్తోంది. కనీసం మూడింటిలో ఒక్క ట్రైన్ అయినా నడపాలంటూ పలువురు ప్రయాణికులు అభిప్రాయపడుతున్నారు. లేదంటే వేలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడతారని వాపోతున్నారు. మరి దక్షిణ మధ్య రైల్వే ఏంచేస్తుందో చూడాలి.

Read Also : PM Modi : ‘ఎమర్జెన్సీ’ మళ్లీ రావొద్దంటే విపక్షాలు బాధ్యతగా వ్యవహరించాలి : ప్రధాని మోడీ


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap
  • trains cancelled
  • vijayawada to visakhapatnam

Related News

Nara Lokesh

Nara Lokesh : తెలుగుదేశం ‘యువ’ గర్జన.. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నారా లోకేష్‌ పట్టాభిషేకం!

తెలుగుదేశం పార్టీ (TDP) రాజకీయాల్లో ఒక కీలక మలుపు చోటుచేసుకుంది. యువనేత నారా లోకేష్‌కు పార్టీలో అత్యంత కీలకమైన బాధ్యతలను అప్పగిస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకుంది

    Latest News

    • BRS : భారీ సైన్యం తో బిఆర్ఎస్ లో చేరిన జీవన్ రెడ్డి

    • రేప‌టితో ముగియ‌నున్న ఎన్నిక‌ల ప్ర‌చారం..!

    • రేపు బ్యాంకుల‌కు సెల‌వు ఉందా?

    • కియా కారు.. రూ. 3.20 ల‌క్ష‌ల వ‌ర‌కు డిస్కౌంట్‌!

    • నిద్ర‌లేమి స‌మ‌స్య‌.. క‌ళ్ల‌పై ప్ర‌భావం?

    Trending News

      • వేసవిలో ఏసీలు ఎందుకు పేలుతాయి?

      • అమెరికా-ఇరాన్ చర్చలకు నో చెప్పిన టెహ్రాన్‌.. ఇస్లామాబాద్‌లో మాత్రం లాక్‌డౌన్!

      • రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి పెరగనున్న కష్టాలు!

      • మ‌రోసారి మెటాలో ఉద్యోగాల కోత‌?!

      • కొత్త జట్టుకు యజమానిగా క్రిస్ గేల్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd