ఆన్‌లైన్ లో పిల్లలపై లైగింక వేధింపుల కేసులో తిరుపతికి చెందిన వ్యక్తి అరెస్ట్
ఆన్‌లైన్‌లో పిల్లలపై లైంగిక వేధింపులకు సంబంధించిన కేసుల విచారణలో సీబీఐ దేశ వ్యాప్తంగా ఏడుగురిని అరెస్ట్ చేసింది.
- By Hashtag U Published Date - 04:25 PM, Thu - 18 November 21

ఆన్‌లైన్‌లో పిల్లలపై లైంగిక వేధింపులకు సంబంధించిన కేసుల విచారణలో సీబీఐ దేశ వ్యాప్తంగా ఏడుగురిని అరెస్ట్ చేసింది. ఏడుగురు నిందుతుల్లో ఒకరు ఏపీలోని తిరుపతికి చెందిన వ్యక్తి ఉన్నారు. నవంబర్ 16, మంగళవారం నాడు దేశవ్యాప్తంగా 76 చోట్ల సోదాలు జరిపిన సిబిఐ..ఏపీలో తిరుపతికి చెందిన మోహన్ కృష్ణ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. నగరంలోని యశోదా నగర్‌లో నివాసం ఉండే మోహన్‌కృష్ణ అనే వ్యక్తికి సైబర్ కేఫ్ ఉంది.మోహన్ కృష్ణతో సహా నిందితులు చైల్డ్ సెక్సువల్ ఎక్స్‌ప్లోయిటేషన్ మెటీరియల్స్ (CSEM) వీడియోలను ఆన్‌లైన్‌లో షేర్ చేస్తున్నారని సీబీఐ ఆరోపించింది. మోహన్ కృష్ణతో పాటు అతని అనుచరులపై ఢిల్లీ పోలీసులతో పాటు సీబీఐ కేసు నమోదు చేసింది. అనంతపురం జిల్లా కణేకల్‌కు చెందిన మరో వ్యక్తిపై కూడా ఇదే తరహాలో కేసు నమోదైనట్లు సమాచారం.
Also Read : కేసీఆర్ మూడుసార్లు `ప్రెస్ మీట్` లోగుట్టు ఇదే!
అంతకుముందు నవంబర్ 14న మొత్తం 83 మంది నిందితులపై దర్యాప్తు సంస్థ 23 వేర్వేరు కేసులు నమోదు చేసింది. మోహన్ కృష్ణ మినహా మిగిలిన నిందితులను ఢిల్లీ, ఒడిశాలోని దెంకనల్, ఉత్తరప్రదేశ్‌లోని నోయిడా, ఝాన్సీ సహా పలు ప్రాంతాల నుంచి అరెస్టు చేశారు. ఏడుగురు నిందితులను ఢిల్లీకి చెందిన రామన్ గౌతమ్, సత్యేందర్ మిట్టల్, ఒడిశాలోని దెంకనల్ నివాసి సురేంద్ర కుమార్ నాయక్, ఢిల్లీకి చెందిన పురుషోత్తం ఝా, ఉత్తరప్రదేశ్‌లోని నోయిడా నివాసి నిశాంత్ జైన్, జితేంద్ర కుమార్‌గా గుర్తించారు.తిరుపతి, కణేకల్ (ఆంధ్రప్రదేశ్) సహా దాదాపు 77 ప్రాంతాల్లో దాడులు జరిగాయి. ఢిల్లీ; కొంచ్ జలౌన్, మౌ, చందౌలీ, వారణాసి, ఘాజీపూర్, సిద్ధార్థనగర్, మొరాదాబాద్, నోయిడా, ఝాన్సీ, ఘజియాబాద్, ముజఫర్‌నగర్ (ఉత్తరప్రదేశ్); జునాఘర్, భావ్‌నగర్, జామ్‌నగర్ (గుజరాత్); సంగ్రూర్, మలేర్కోట్ల, హోషియార్పూర్, పాటియాలా (పంజాబ్); పాట్నా, సివాన్ (బీహార్); యమునా నగర్, పానిపట్, సిర్సా, హిసార్ (హర్యానా); భద్రక్, జాజాపూర్, దెంకనల్ (ఒడిశా); తిరువలూరు, కోయంబత్తూరు, నమక్కల్, సేలం, తిరువణ్ణామలై (తమిళనాడు); అజ్మీర్, జైపూర్, జుంఝును, నాగౌర్ (రాజస్థాన్); గ్వాలియర్ (మధ్యప్రదేశ్); జల్గావ్, సల్వాడ్, ధులే (మహారాష్ట్ర); దేశంలోని 14 రాష్ట్రాల్లోని కోర్బా (ఛత్తీస్‌గఢ్) మరియు సోలన్ (హిమాచల్ ప్రదేశ్) ప్రాంతాల్లో సీబీఐ సోదాలు నిర్వహిచింది.
Also Read : చంద్రబాబు రాజ్యంలో పుంగనూరు రెడ్డి!
31 మంది సభ్యులు ఒకరికొకరు సానుభూతితో CSEM కంటెంట్‌ను పంచుకుంటున్నట్లు సమాచారం. సేకరించిన ప్రాథమిక సమాచారం ప్రకారం…50 కంటే ఎక్కువ సమూహాలలో 5,000 మంది నేరస్థులు పిల్లలపై లైంగిక వేధింపుల విషయాలను పంచుకున్నారు. ఈ సమూహాలలో చాలా మందికి విదేశీ పౌరుల ప్రమేయం కూడా ఉందపి విచారణిలో తేలింది. వివిధ ఖండాల్లో విస్తరించి ఉన్న దాదాపు 100 దేశాలకు చెందిన వ్యక్తుల ప్రమేయం ఉండవచ్చని ప్రాథమికంగా తెలిసింది. విదేశీ పౌరుల్లో కొందరు పాకిస్థాన్, కెనడా, బంగ్లాదేశ్, నైజీరియా, ఇండోనేషియా, శ్రీలంక, అజర్‌బైజాన్, యూకే, బెల్జియం, యెమెన్ తదితర దేశాలకు చెందిన వారని, ఈ దాడుల్లో 10 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నామని పోలీస్ వర్గాలు తెలిపాయి.
Related News

Food Poison: వినాయక చవితి ప్రసాదం తిని 79 మందికి అస్వస్థత
ఆలయంలో పంచిన ప్రసాదం తిని 79 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు.