Tirumala Laddu Issue : తిరుమల లడ్డూ వివాదం.. సిట్ సభ్యుల పేర్లను ప్రకటించిన ఏపీ డీజీపీ
- By Kode Mohan Sai Published Date - 05:17 PM, Tue - 15 October 24
Tirumala Laddu Issue : తిరుమల లడ్డూ కేసు (Laddu Adulteration) విచారణకు సుప్రీం కోర్టు ఆదేశాలపై ఏర్పడిన సిట్‌లో దర్యాప్తుకు ఇద్దరు ఆంధ్రప్రదేశ్ పోలీసుల అధికారుల పేర్లు డీజీపీ ద్వారకా తిరుమలరావు వెల్లడించారు.
కేంద్రం నుండి ఇద్దరు, ఏపీ పోలీసుల నుండి ఇద్దరు, అలాగే ఒక ఫుడ్ కంట్రోల్ అధికారిని నియమించి, వారి ఆధ్వర్యంలో దర్యాప్తు చేయాలని సుప్రీం కోర్టు ఇప్పటికే ఆదేశించిన విషయం తెలిసిందే. సిట్ సభ్యులుగా ఐజీ సర్వశ్రేష్ఠా త్రిపాఠి మరియు డీఐజీ గోపీనాథ్ జెట్టి పేర్లను డీజీపీ వెల్లడించారు. లడ్డూ కల్తీ నెయ్యి కేసులో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌ను సుప్రీం కోర్టు అనుమానించలేదని చెప్పారు. స్వతంత్ర దర్యాప్తు జరగాలనే ఉద్దేశంతో ప్రత్యేక బృందం ఏర్పాటు చేశామని, ఇందులో ఏపీ పోలీసుల జోక్యం ఉండదని స్పష్టం చేశారు.