HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Three New Ministers Face Controversies In Andhrapradesh

AP Ministers Issue: ఏపీలో ముగ్గురు కొత్త మంత్రులను చుట్టుముట్టిన వివాదాలు

ఆంధ్రప్రదేశ్ లో కొత్త మంత్రుల ఆరాటం.. ప్రజల ప్రాణాల మీదకు తెస్తోంది. మరికొందరిని అప్పుడే వివాదాలు చుట్టుముడుతున్నాయి.

  • Author : Hashtag U Date : 16-04-2022 - 11:44 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Jagan
Jagan

ఆంధ్రప్రదేశ్ లో కొత్త మంత్రుల ఆరాటం.. ప్రజల ప్రాణాల మీదకు తెస్తోంది. మరికొందరిని అప్పుడే వివాదాలు చుట్టుముడుతున్నాయి. స్త్రీశిశు సంక్షేమ శాఖా మంత్రి ఉషశ్రీ చరణ్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించాక సొంత నియోజకవర్గం కల్యాణదుర్గానికి భారీ కాన్వాయ్ తో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. దీంతో ఆమె ర్యాలీకి ఎలాంటి ఆటంకాలు లేకుండా పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. అదే ఓ చిన్నారి ప్రాణాలను బలితీసుకుంది.

అనంతపురం జిల్లాకు చెందిన గణేశ్, ఈరక్కలకు ఇద్దరు కుమార్తెలు. ఇందులో చిన్నదాని పేరు పండు. తన వయసు కేవలం 8 నెలలు మాత్రమే. ఆమెకు అనారోగ్యం చేయడంతో కల్యాణదుర్గం ఆర్డీటీ ఆసుపత్రికి వెళ్దామనుకున్నారు. కానీ మంత్రి ఇంటి సమీప ప్రాంతానికి వచ్చేసరికీ.. అక్కడ బారికేడ్లు ఉన్నాయి. అప్పటికే బ్రహ్మయ్య గుడి వద్ద విధుల్లో ఉన్న పోలీసులు.. వీరిని అడ్డుకున్నారు. అర్జంట్ గా ఆసుపత్రికి వెళ్లాలని.. తాము వెళ్లడానికి అనుమతించాలని బతిమిలాడినా వాళ్లు కనికరించలేదు.

చివరకు అరగంట గడిచిన తరువాత మాత్రమే ఆ చిన్నారిని, ఆమె కుటుంబసభ్యులను విడిచిపెట్టారు. అప్పుడు వేగంగా ఆసుపత్రికి చేరుకున్నారు. కానీ అప్పటికే చిన్నారి మృతి చెందింది. సమయానికి తీసుకొచ్చి ఉంటే కాపాడగలిగేవారమని వైద్యులు చెప్పడంతో ఆ తల్లిదండ్రుల ఆవేదనకు అంతు లేకుండా పోయింది. దీంతో ఆ చిన్నారి మృతదేహంతోనే టీ-సర్కిల్ లో కొన్ని గంటలపాటు నిరసన తెలిపారు. అయినా సరే వారిని పట్టించుకోకుండా మంత్రి వెళ్లిపోయారు. తరువాతైనా సరే వారిని పరామర్శించకపోవడంతో మంత్రి వైఖరి వివాదాస్పదంగా మారింది.

మరో మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి కూడా వివాదంలో చిక్కుకున్నారు. మాజీ మంత్రి సోమిరెడ్డికి విదేశాల్లో వేల కోట్ల రూపాయిల ఆస్తులు ఉన్నాయని కాకాణి గోవర్థన్ రెడ్డి 2017లో ఆరోపణలు చేశారు. ఆ ఆస్తుల డాక్యుమెంట్లంటూ కొన్ని పత్రాలను కూడా మీడియాకు విడుదల చేశారు. అయితే అవన్నీ నకిలీ పత్రాలని.. తనపై అసత్య ఆరోపణలు చేశారని.. చర్యలు తీసుకోవాలని సోమిరెడ్డి అప్పుడే నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్ లో కంప్లయింట్ ఇచ్చారు. దీనిపై పోలీసులు విచారణ జరిపి అవి నకీలీ పత్రాలని నిర్థారించారు. దీనిపై అప్పుడే ఛార్జ్ షీటు కూడా దాఖలు చేశారు. కాకాణిని A-1 నిందితుడిగా చేర్చారు. మరో ఇద్దరిపైనా కేసులు నమోదు చేశారు. ఈ కేసు నెల్లూరులోని నాలుగో ఏడీఎం కోర్టులో విచారణ దశలో ఉంది. ఈ కేసుకు సంబంధించిన కొన్ని డాక్యుమెంట్లు, ల్యాప్ టాప్, నాలుగు మొబైల్ ఫోన్లను సీజ్ చేసి.. కోర్టులోనే భద్రపరిచారు. కానీ ఇప్పుడీ కోర్టులో దొంగతనం జరిగింది. కాకాణి కేసుకు సంబంధించిన కొన్ని పత్రాలు, సాక్ష్యాధారాలు చోరీ జరిగాయని గుర్తించారు. కోర్టు ప్రాంగణంలోనే కొన్ని పత్రాలను పడేశారు. అందులో కాకాణిపై సోమిరెడ్డి పెట్టిన కేసుకు సంబంధించిన పత్రాలు ఉన్నాయి. ఈ కేసులో ఏ-2 నిందితుడి పాస్ పోర్టు ను కూడా పోలీసులు గుర్తించారు. దీనిపై విచారణ జరుపుతున్నారు.

ఉప ముఖ్యమంత్రి, దేవాదాయశాఖ మంత్రి అయిన కొట్టు సత్యనారాయణకు కూడా చేదు అనుభవం తప్పలేదు. ఆయన దర్శనానికి వస్తున్నారంటూ శ్రీకాళహస్తీశ్వరాలయంలో కొన్ని గంటలపాటు భక్తులను క్యూలైన్లలోనే ఉంచేశారు. కంచుగడప వద్ద క్యూలైన్లను ఆపేయడంతో భక్తులు ఆగ్రహంతో ఊగిపోయారు. సరిగ్గా అదే సమయానికి మంత్రి కొట్టు అటువైపు వచ్చారు. అప్పటికే వేసవి ఉక్కతో అల్లాడిపోతున్న భక్తులు మంత్రి కొట్టును నిలదీశారు. అసలే వరుస సెలవుల వల్ల భక్తులు ఆలయానికి పోటెత్తారు. దీంతో మంత్రి అక్కడున్న అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసి వెళ్లిపోయారు. ఏపీలో కొత్తమంత్రుల తీరుతెన్నులు అప్పుడే వివాదాస్పదమవుతున్నాయన్న విమర్శలు మొదలయ్యాయి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh government
  • andhra pradesh ministers
  • controversy

Related News

Andhrapradesh Talliki Vandanam Scheme

Cm Chandrababu Naidu: తల్లికి వందనంపై కీలక ప్రకటన

Talliki Vandanam Scheme  ఏపీ ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా విద్యార్థుల కోసం తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తోంది. గతేడాది ప్రభుత్వం విద్యార్థుల తల్లుల ఖాతాల్లో డబ్బుల్ని జమ చేసిన సంగతి తెలిసిందే. 2026కు సంబంధించి తల్లికి వందనం పథకం అమలుపై ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. ఈ ఏడాది జూన్ నెలలో డబ్బులను తల్లుల ఖాతాల్లో జమ చేస్తామని ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ̵

  • andhra pradesh Release Pending Dues retired employees

    ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. రూ.7,059 కోట్ల బకాయిల విడుదల

Latest News

  • Jagan Padayatra 2.0 : జూలై నుంచే జగన్ పాదయాత్ర..

  • Raaka First Look : అల్లు అర్జున్ ‘రాకా’ ఫస్ట్ లుక్ పై విపరీతమైన ట్రోల్స్

  • Hardik Pandya : మరోసారి తన గొప్ప మనసు చాటుకున్న హార్దిక్ పాండ్య..అసలు ఏంజరిగిందంటే !!

  • RBI Repo Rate : వడ్డీ రేట్ల పై RBI కీలక అప్డేట్

  • Heart Attack : జగిత్యాల జిల్లాలో విషాదం .. గుండెపోటుతో మృతి చెందిన 9 ఏళ్ల విద్యార్థి

Trending News

    • డ‌బ్బు లేక ఇబ్బంది ప‌డుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

    • టీమిండియా ఆట‌గాళ్ల మ‌ధ్య పోరు పెట్టిన ఐసీసీ!

    • షాకింగ్ రిపోర్ట్‌.. భార‌త్‌లో ధనవంతులు మరింత ధనవంతులుగా!!

    • ఇరాన్‌కు ట్రంప్ హెచ్చరిక.. మారిన పరిస్థితులు!

    • ఈ దేశంలో డేలైట్ సేవింగ్ టైమ్.. నిద్ర కోసం గంట టైమ్ వెన‌క్కి!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd