CBN Singapore Tour : చంద్రబాబు సింగపూర్ టూర్ వెనుక రహస్యం ఇదే – గుడివాడ అమర్నాధ్
CBN Singapore Tour : రాష్ట్రానికి పెట్టుబడులు రప్పించాలనే ఉద్దేశంతో ఈ పర్యటన చేపట్టినట్టు అధికారికంగా వెల్లడించినా, ఇందులో అసలు ఉద్దేశం వేరే ఉందని వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు
- By Sudheer Published Date - 09:19 PM, Sun - 27 July 25

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేపట్టిన సింగపూర్ టూర్(Singapore Tour)పై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. రాష్ట్రానికి పెట్టుబడులు రప్పించాలనే ఉద్దేశంతో ఈ పర్యటన చేపట్టినట్టు అధికారికంగా వెల్లడించినా, ఇందులో అసలు ఉద్దేశం వేరే ఉందని వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు. చట్టపరమైన విచారణలకు దూరంగా ఉండేందుకు, తన విదేశీ లావాదేవీలను సమన్వయం చేసుకునేందుకే చంద్రబాబు ఈ టూర్‌కు వెళ్లారని ఆయన అభిప్రాయపడ్డారు.
చంద్రబాబు(Chandrababu)కు సింగపూర్‌తో చాలాకాలంగా అనుబంధం ఉందని, ఆయన పెట్టుబడులు, అక్రమ ఆస్తులన్నీ అక్కడే ఉన్నాయని గుడివాడ మండిపడ్డారు. 1995 నుంచి ఇప్పటివరకు ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడల్లా సింగపూర్ టూర్‌లు కామన్ అయ్యాయని, గతంలో యూరో లాటరీ కేసులో కోలా కృష్ణమోహన్ ఇచ్చిన స్టేట్‌మెంట్ సాక్ష్యంగా ఉంచుతూ, చంద్రబాబు పేరుపైన ఆరోపణలు చేశారు. ఎంపీ సీటు కోసం కోట్లు బదిలీ చేయమని చెప్పిన సందర్భంలో, సింగపూర్‌లో అకౌంట్‌కు డబ్బు పంపారని గుర్తుచేశారు.
Lemon Juice : తరచుగా నిమ్మరసం తాగే అలవాటు ఉన్నవారికి బీ అలర్ట్… మీకోసమే షాకింగ్ న్యూస్
2014లో మూడోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన తర్వాత అమరావతిని సింగపూర్ మాదిరిగా అభివృద్ధి చేస్తానని చంద్రబాబు ప్రకటించి, రైతులను విమానాల్లో సింగపూర్‌కు తీసుకెళ్లడం, సింగపూర్ మంత్రిని ఏపీకి ఆహ్వానించడం వంటి కార్యక్రమాలకు కోట్లాది రూపాయలు ఖర్చు చేశారని విమర్శించారు. అయితే 2019లో అధికారాన్ని కోల్పోయిన తర్వాత ఆ సింగపూర్ మంత్రి ఈశ్వరన్ అవినీతి ఆరోపణలతో విచారణకు గురయ్యారని, ఇది చంద్రబాబుతో ఆయనకున్న సంబంధాల్ని సందేహాస్పదంగా మారుస్తుందని గుడివాడ పేర్కొన్నారు.
సింగపూర్ లాంటి అవినీతి నివారణలో గట్టి చట్టాలు కలిగిన దేశంలో ఈశ్వరన్ లాంటి మంత్రి అవినీతికి పాల్పడడమే కాకుండా, చంద్రబాబు అతనితో అత్యంత సన్నిహితంగా ఉండడం అనేక ప్రశ్నలకు దారి తీస్తోందని గుడివాడ తెలిపారు. సీఎం నయుడుగా నాలుగు పర్యాయాలు పనిచేసిన చంద్రబాబు రాష్ట్రానికి ఎంత పెట్టుబడులు తీసుకొచ్చారో కన్నా, అవినీతి ద్వారా దోచుకున్న డబ్బుతో సింగపూర్‌లో పెట్టిన పెట్టుబడులే ఎక్కువగా ఉన్నాయని ఆరోపించారు. తాజా టూర్ కూడా పెట్టుబడి రాక కోసం కాదని, తాను గతంలో పెట్టిన అక్రమ పెట్టుబడులను పునఃనిర్వహించేందుకే అని అన్నారు.