HashtagU Telugu
HashtagU Telugu Telugu HashtagU Telugu
  • English
  • हिंदी
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
News
CloseIcon
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # World Cup
  • # Nara Lokesh
  • # Nara Chandrababu Naidu
  • # KCR

  • Telugu News
  • ⁄Andhra Pradesh
  • ⁄This 41 Year Old Andhra Woman Steals Show By Playing Male Characters

పౌరాణిక నాటకాల్లో పురుషుడి పాత్రలు.. భళా అనిపిస్తున్న ఆంధ్రా మహిళ!

మేల్ యాక్టర్ స్త్రీపాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించడం కొంచెం తేలికే. కానీ పౌరాణిక నాటకాల్లో పురుష పాత్రను నటించడం స్త్రీ నటించి మెప్పించడం అంత తెలికేమీ కాదు.

  • By Balu J Published Date - 04:46 PM, Mon - 25 October 21
  • daily-hunt
పౌరాణిక నాటకాల్లో పురుషుడి పాత్రలు.. భళా అనిపిస్తున్న ఆంధ్రా మహిళ!

మేల్ యాక్టర్ స్త్రీపాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించడం కొంచెం తేలికే. కానీ పౌరాణిక నాటకాల్లో పురుష పాత్రను నటించడం స్త్రీ నటించి మెప్పించడం అంత తెలికేమీ కాదు. సత్య హరిశ్చంద్రుడు, శ్రీరాముడు, అర్జునుడి పాత్ర ఏదైనా సరే.. చూస్తే ఔరా అనాల్సిందే. విజయనగరం జిల్లా పార్వతీపురం మండలం బాలగూడబా గ్రామానికి చెందిన 41 ఏళ్ల కొప్పర మంగాదేవి పౌరాణిక నాటకాల్లో అద్భుతంగా నటిస్తుంది. హరికథ, బుర్రకథ, తప్పెట గుళ్లు వంటి జానపద కళలు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలలో తమ ప్రకాశాన్ని కోల్పోయినప్పటికీ, ఉత్తర ఆంధ్రలోని విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో మంచి ఆదరణను పొందుతున్నాయి.

మంగాదేవి చాలా కాలంగా సత్య హరిచంద్ర పౌరాణిక నాటకంలో హరిచంద్ర ప్రధాన పాత్రను పోషిస్తూ తన నటన, గాత్రంతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తోంది. పౌరాణిక నాటకంలో పద్యాలను పురుష గాత్రంతో పాడటం కష్టమైనప్పటికీ, ఆమె అభ్యాసం, కృషి, నిబద్ధత, థియేటర్ పట్ల ఆసక్తి ఆమె ప్రదర్శన ప్రజల్ని మెప్పిస్తుంది. ఆమె ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 3,000కు పైగా స్టేజ్ షోలు ఇచ్చారు. మంగాదేవి ఏడో తరగతి చదువుతున్నప్పటి నుండి నాటకాల్లో నటించడం ప్రారంభించింది. ఆమె మొదటి పాత్ర హరిశ్చంద్రుని భార్య చంద్రమతి. అయినప్పటికీ, హరిశ్చంద్ర పాత్రను పోషించాలని ఆమె తండ్రి చిన్నం నాయుడు పట్టుబట్టడంతో, ఆమె ఆ పాత్రను ధరించి ప్రేక్షకుల నుండి ప్రశంసలు అందుకుంది.

తరువాత ఆమె శ్రీ రామాంజనేయ యుద్ధం లో పురుష ప్రధాన పాత్రలు రాముని, గయోపాఖ్యానం నాటకాల్లో అర్జునుడి పాత్ర పోషించడం ప్రారంభించింది. ఆమె తన గురువు యడ్ల గోపాలరావు దర్శకత్వంలో సత్య హరిశ్చంద్ర కథ ఆధారంగా ఒక సినిమాలో కూడా నటించింది. అయితే, ఈ చిత్రం ఇంకా ప్రదర్శించబడలేదు.కరోనా వైరస్ వ్యాప్తి చెందడానికి ఒక నెల ముందు ఆమె 20 నుండి 25 స్టేజ్ షోలు ఇచ్చేది. ఇప్పుడు ఆమె నెలకు మూడు నుండి ఐదు స్టేజ్ షోలు మాత్రమే ఇస్తోంది. తాను చిన్నతనంలో తన తండ్రి కోరిక మేరకు హరిశ్చంద్ర పాత్రను పోషించానని మంగాదేవి తెలిపారు. తన కుటుంబ సభ్యుల సహకారంతో గత రెండున్నర దశాబ్దాలుగా పురుష పాత్రలు వేస్తున్నానని, పౌరాణిక నాటకాల్లో పురుష పాత్రల్లో తన విజయంలో తండ్రి, భర్త కీలక పాత్ర పోషించారని ఆమె తెలిపారు.

తాను వేదికపైకి వచ్చినప్పుడు మగవాడిగా తన స్వరం ఎలా మారుతుందో అని కొన్నిసార్లు తానే ఆశ్చర్యపోతుంటానని… ఇది దేవుడి బహుమతిగా తాను భావిస్తున్నట్లు ఆమె తెలిపారు. నాటకంలో ప్రధాన పురుష పాత్ర తాను పోషించానని తెలిసి ప్రేక్షకులు ఆశ్చర్యానికి గురైన సందర్భాలు చాలా ఉన్నాయని పేర్కొన్నారు. తన నటనకు ఇంప్రెస్ అయ్యి సినిమాలో నటించమని ఇటీవల ఒక నిర్మాత నుంచి తనకు ఆఫర్ వచ్చిందని…ఇప్పుడు స్టేజ్ ఆర్ట్ కు ప్రభుత్వం నుంచి ఎలాంటి సపోర్ట్ లేదన్నారు. ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందినప్పుడే నాటక కళ అభివృద్ధి చెందుతుందని మంగాదేవి అభిప్రాయపడ్డారు.

Tags  

  • ap woman
  • drama
  • male characters
  • special
  • stage shows
https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2023/09/drreddys.jpg

Related News

Hyderabad: ఐటీ మహిళ ఉద్యోగులకు ఆర్టీసీ గుడ్ న్యూస్

Hyderabad: ఐటీ మహిళ ఉద్యోగులకు ఆర్టీసీ గుడ్ న్యూస్

తెలంగాణలో మహిళా ప్రయాణికులకు ఆర్టీసీ పెద్దపీట వేస్తుంది. ఇప్పటికే వారికి షీషటల్స్ పేరుతో ప్రత్యేక బస్సుల్ని నడుపుతుంది. తాజాగా మరో నిర్ణయం తీసుకుంది.

  • Tirumala: ఏడుకొండలస్వామిని దర్శించుకోవడానికి ఏవారం మంచిందంటే!

    Tirumala: ఏడుకొండలస్వామిని దర్శించుకోవడానికి ఏవారం మంచిందంటే!

  • Bonalu: బోనం అంటే ఏంటి? ఎందుకంత ప్రత్యేకత!

    Bonalu: బోనం అంటే ఏంటి? ఎందుకంత ప్రత్యేకత!

  • Salman Farmhouse: భూతల స్వర్గం సల్మాన్ ఖాన్ ‘ఫామ్ హౌస్’.. ప్రత్యేకతలివే!

    Salman Farmhouse: భూతల స్వర్గం సల్మాన్ ఖాన్ ‘ఫామ్ హౌస్’.. ప్రత్యేకతలివే!

  • Under Water Metro Train: త్వరలోనే అండర్ వాటర్ మెట్రో ట్రయల్ రన్..ఎప్పుడు, ఎలా?

    Under Water Metro Train: త్వరలోనే అండర్ వాటర్ మెట్రో ట్రయల్ రన్..ఎప్పుడు, ఎలా?

Latest News

  • CM Candidate : సీఎం ఎవరైనా.. కార్యకర్తలకు బెడ్ రూమ్ లోకి వెళ్లేంత స్వేచ్ఛ : కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

  • Bigg Boss 7 : కంటెస్టెంట్స్ కి నాగార్జున సీరియస్ వార్నింగ్..!

  • Good News : అంగన్‌వాడీలకూ పీఆర్సీ.. తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం

  • To Day Panchangam: పంచాంగం అక్టోబర్ 01 2023

  • Ganja : అనంత‌పురంలో 18మంది గంజాయి స్మ‌గ్ల‌ర్ల‌ను ప‌ట్టుకున్న పోలీసులు

Trending

    • Raped Dozens Of Dogs : 42 కుక్కలపై రేప్ చేసిన జంతు శాస్త్రవేత్త.. దోషిగా ఖరారు

    • Chandrababu Brand : ఏపీపై భారీ కుట్ర‌? రాష్ట్రానికి సంకెళ్లు.!

    • Ganesh Nimajjanam : వినాయక ఉత్సవాలు ఎప్పుడు ప్రారంభమయ్యాయి ? గణేష్ నిమజ్జనం ఎందుకు చేయాలి ?

    • Weird Politics in AP : జ‌గ‌న్ కోసం MIM, BRS పోటీ?

    • Rs 2000 Note Exchange : 2వేల నోట్ల బదిలీ డెడ్ లైన్ ముంచుకొస్తోంది.. గడువు పొడిగిస్తారా ?

Hashtag U

  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice

Telugu News

  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Special
  • Off Beat

Trending News

  • World Cup
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • kcr

follow us

  • Copyright © 2022 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd
Go to mobile version