HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >These Are The Key Decisions Taken By The Ap Cabinet

AP Cabinet : ఏపీ కేబినెట్‌ తీసుకున్న కీలక నిర్ణయాలివే !!

AP Cabinet : ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామిక వృద్ధిని పురోగతిలో ఉంచే లక్ష్యంతో అనకాపల్లిలో ఆర్సెల్ మిట్టల్ స్టీల్ కంపెనీకి సెప్టెంబర్‌లో శంకుస్థాపన చేయాలని నిర్ణయం తీసుకున్నారు

  • Author : Sudheer Date : 24-06-2025 - 3:53 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
AP Cabinet meeting on the 19th of this month.. Discussion on various important issues
AP Cabinet meeting on the 19th of this month.. Discussion on various important issues

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Nara Chandrababu) అధ్యక్షతన జరిగిన కేబినెట్ (AP Cabinet) సమావేశంలో రాష్ట్రాభివృద్ధికి దోహదపడే పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా రాజధాని అమరావతిలో రెండో విడత భూసేకరణకు ఆమోదం తెలుపుతూ 44,000 ఎకరాల భూమిని సేకరించేందుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే “స్వర్ణాంధ్ర పథకంలో భాగంగా” కమిటీలను త్వరలో ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. కేంద్రం సహకారంతో పోలవరం – బనకచర్ల ప్రాజెక్ట్‌ను దశల వారీగా ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించినట్లు చంద్రబాబు వెల్లడించారు.

Mahesh Babu : ‘సితారే జమీన్ పర్’పై మహేష్ బాబు ఆసక్తికర వ్యాఖ్యలు

అంతే కాదు ప్రభుత్వ పథకాల అమలుపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. జూలై 1 నుంచి ఎమ్మెల్యేలు ఇంటింటికీ తిరిగి ప్రభుత్వం చేసిన పనులను ప్రజలకు వివరించాలన్నారు. అలాగే ప్రతి నియోజకవర్గంలో అన్న క్యాంటీన్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. వీటి నిర్వహణకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని, దాతల సహకారం తీసుకోవచ్చని తెలిపారు. జిల్లాల వారీగా అధికారుల సమీక్ష సమావేశాలు నిర్వహించాలని సూచించారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రభుత్వమే మార్కెట్‌లోకి ప్రవేశించి కొనుగోళ్లు జరుపుతుందని సీఎం చెప్పారు.

ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామిక వృద్ధిని పురోగతిలో ఉంచే లక్ష్యంతో అనకాపల్లిలో ఆర్సెల్ మిట్టల్ స్టీల్ కంపెనీకి సెప్టెంబర్‌లో శంకుస్థాపన చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక జాతీయ స్థాయిలో రాష్ట్ర ప్రతిష్ఠను పెంచిన టెన్నిస్ ప్లేయర్ సాకేత్‌కు గ్రూప్-1 ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించడం గమనార్హం. రాష్ట్ర అభివృద్ధికి గాను వ్యవసాయ విధానాల్లో మార్పులు తీసుకురావాలని, పంటలకు డిమాండ్ ఉన్న దిశగా రైతులకు మార్గనిర్దేశం చేయాలని వ్యవసాయశాఖను సీఎం చంద్రబాబు ఆదేశించారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap cabinet
  • AP Cabinet Decisions
  • chandrababu

Related News

Jagan Pawan

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ హెలికాప్టర్లలో జల్సాలు చేస్తున్నాడు – జగన్

గతంలో తమ ప్రభుత్వంపై విమర్శలు చేసిన వారు, ఇప్పుడు అధికారంలోకి వచ్చాక అంతకంటే ఎక్కువ విలాసాలకు పాల్పడుతున్నారని ఆయన గుర్తు చేశారు. అయితే, దీనిపై కూటమి నేతలు కూడా ధీటుగానే స్పందిస్తున్నారు

    Latest News

    • డార్క్ షవరింగ్ అంటే ఏమిటి? దీనివల్ల ప్రయోజనాలు ఉన్నాయా?!

    • హెరిటేజ్ నాణ్యతపై భరోసా.. YCP అసత్య ప్రచారానికి ఢిల్లీ హైకోర్టు చెక్!

    • ఐటీ శాఖ టార్గెట్ లిస్ట్‌లో ప్ర‌ముఖులు!

    • అవయవ దానం అంటే ఏమిటి? ఎన్ని రకాలు?

    • ఈ ఏడాదిలో కారు కొన‌టానికి ఇదే మంచి స‌మ‌య‌మా?!

    Trending News

      • టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో సంచ‌ల‌నం.. శ్రీలంక‌పై జింబాబ్వే ఘ‌న‌విజ‌యం!

      • టీ20 వరల్డ్ కప్ 2028కు 12 జట్లు క్వాలిఫై.. లిస్ట్ ఇదే!

      • టీ20 క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్!

      • 122 ఏళ్ల తర్వాత తెరుచుకోనున్న ఒడిశాలోని కోణార్క్ సూర్య దేవాలయం లో గర్భగుడి

      • విజయ్-రష్మిక వివాహం.. రాజకీయ, సినీ ప్రముఖుల రాక!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd