HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >The Politics Raging In Pithapuram

Pithapuram : పిఠాపురంలో కాకరేపుతున్న రాజకీయాలు..ఎవరికీ మేలు..?

Pithapuram : జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో ఆయన భేటీ కావడం, పార్టీలో చేరేందుకు సన్నాహాలు పూర్తి చేయడం విశేషంగా మారింది

  • Author : Sudheer Date : 04-03-2025 - 1:45 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Pithapuram
Pithapuram

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో (Andhra Pradesh Politics) మార్పులు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ముఖ్యంగా పిఠాపురం (Pithapuram ) నియోజకవర్గంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. వైసీపీ కీలక నేత, మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు జనసేనలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో ఆయన భేటీ కావడం, పార్టీలో చేరేందుకు సన్నాహాలు పూర్తి చేయడం విశేషంగా మారింది. వైసీపీ నుంచి అనేక మంది నేతలు వలస బాట పట్టడం, తమ భవిష్యత్తు రాజకీయాలను పునర్వ్యవస్థీకరించుకోవడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

MLC Elections : టీడీపీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం విజయం

ఒకప్పుడు టీడీపీ, వైసీపీకి చెందిన నేతలుగా వేర్వేరుగా ఉన్న దొరబాబు (Dorababu) ఇప్పుడు జనసేన గూటికి చేరడం ఆసక్తికర పరిణామంగా మారింది. గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్‌ గెలుపు కోసం వర్మ త్యాగం చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆయన ఎమ్మెల్సీగా ఎన్నిక కావడం ఖాయంగా మారింది. మరోవైపు దొరబాబు జనసేనలో చేరడం ద్వారా పిఠాపురంలో జనసేన బలం మరింత పెరగనుంది. వీరిద్దరూ కలిసి ఎన్నికల బరిలో దిగితే, జనసేనకు పిఠాపురంలో గట్టి పట్టు వచ్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

జనసేన వ్యూహం – పవన్ కళ్యాణ్ కసరత్తు

2019ఎన్నికల్లో భీమవరం నుంచి పోటీ చేసిన పవన్ కళ్యాణ్ ఓటమి పాలయ్యారు. అలాగే జనసేన కేవలం 1 స్థానం లో విజయం సాధించింది. కానీ 2024 ఎన్నికల్లో జనసేన 22 స్థానాల్లో పోటీ చేసి భారీ విజయం సాధించింది. అలాగే పవన్ కళ్యా డిప్యూటీ సీఎం తో పాటు పలు శాఖలకు మంత్రిగా తన మార్క్ కనపరుస్తూ వస్తున్నాడు. దీంతో ప్రజల్లో మరింత ఆదరణ , మద్దతు పెరుగుతుంది. ఇదే క్రమంలో వైసీపీ నేతలు సైతం జనసేన వైపు మొగ్గు చూపిస్తున్నారు. అలాగే జనసేన బలమైన ఆధిక్యం కలిగిన వెస్ట్ గోదావరి, పిఠాపురం వంటి నియోజకవర్గాల్లో పాగా వేయాలని పవన్ భావిస్తున్నారు. దీనిలో భాగంగానే, వైసీపీ నుంచి వలస వెళ్లే నేతలను తమ పార్టీలో చేర్చుకుంటూ, జనసేనను బలోపేతం చేస్తున్నారు. జనసేన అధినేత స్వయంగా వెస్ట్ గోదావరి నుంచి బరిలోకి దిగే అవకాశం ఉందన్న ఊహాగానాలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

జనసేన వల్ల వైసీపీకి ముప్పా?

వైసీపీ నుంచి కీలక నేతలు వలసలు పెట్టడం ఆ పార్టీకి తలనొప్పిగా మారింది. ఇప్పటికే కీలక నేతలు పార్టీని వీడారు. ఉన్న నేతలను పలు కేసులు ఇబ్బందికి గురిచేస్తున్నాయి. ఇక ఇప్పుడు వలసల పర్వం జగన్ ను నిద్ర పోనివ్వకుండా చేస్తున్నాయి. ఓవరాల్ గా పిఠాపురం లో కొనసాగుతున్న రాజకీయ సమీకరణాలు ఉత్కంఠ పెంచుతున్నాయి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Dorababu
  • Janasena
  • Pawan Kalyan
  • pithapuram
  • politics
  • tdp
  • ycp

Related News

Atchannaidu Vs Botsa Satyanarayana

బొత్స సత్యనారాయణ కు ఇచ్చిపడేసిన అచ్చెన్నాయుడు.. అచ్చం VS బొత్స

Acham Naidu Vs Botsa Satyanarayana  ఏపీ శాసనమండలి సమావేశాల్లో గందరగోళ పరిస్థితి నెలకొంది. సభలోకి విజిల్స్ తీసుకొచ్చిన వైసీపీ సభ్యులు… ఛైర్మన్ పోడియం వద్ద విజిల్స్ వేస్తూ హంగామా సృష్టించారు. ఈ క్రమంలో సభ కాసేపు వాయిదా పడంది. అనంతరం మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ వైసీపీ సభ్యుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందాపూర్ డెయిరీకి, హెరిటేజ్‌కు ఎలాంటి సంబంధం లేదని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.

  • BR Naidu

    తిరుమల నెయ్యి టెండర్లపై ‘వైసీపీ’ దుష్ప్రచారం.. వాస్తవాలను వెల్లడించిన టీటీడీ చైర్మన్!

  • Pawan Kalyan's Convoy Meets

    Accident : పవన్ కళ్యాణ్ కాన్వాయ్ కు ప్రమాదం

  • Janasena Pawan Kalyan

    Janasena : జనసేన ఆశయాలను ముందుకు తీసుకెళ్లేవారే పార్టీకి కావాలి – పవన్

  • Janasena Pawan Kalyan

    మహా శివరాత్రి వేళ భక్తులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గొప్ప శుభవార్త

Latest News

  • టీ20 క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్!

  • 122 ఏళ్ల తర్వాత తెరుచుకోనున్న ఒడిశాలోని కోణార్క్ సూర్య దేవాలయం లో గర్భగుడి

  • మదనపల్లె హత్యాచార ఘటన మరవకముందే మరో దారుణం !!

  • Encounter in Karregutta : కర్రెగుట్టల్లో భారీ ఎన్కౌంటర్.. ఐదుగురు మావోలు హతం

  • Kavitha New Party : కవిత పార్టీ సిద్ధాంతాలు ఇవే !!

Trending News

    • విజయ్-రష్మిక వివాహం.. రాజకీయ, సినీ ప్రముఖుల రాక!

    • టీ20 వరల్డ్ కప్ 2026.. అహ్మదాబాద్‌లో భారత్ vs దక్షిణాఫ్రికా!

    • భారత్ నుండి ఐసీసీ టోర్నమెంట్‌ల తరలింపు? బీసీసీఐకి భారీ షాక్!

    • Gold Silver Rate Today: బంగారం, వెండి ధరల్లో మళ్లీ పరుగు.. వెండి ఏకంగా రూ. 8,000 పైకి!

    • భారత్‌లో బిగ్ బాష్ లీగ్? చెన్నై వేదికగా తొలి మ్యాచ్ నిర్వహించేందుకు ఆస్ట్రేలియా ప్లాన్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd