Praja Galam : చిలకలూరిపేట సభకు ‘ప్రజాగళం’ పేరు ఖరారు చేసిన కూటమి
- By Sudheer Published Date - 04:04 PM, Fri - 15 March 24

త్వరలో ఏపీలో జరగబోయే అసెంబ్లీ , లోక్ సభ ఎన్నికల్లో భాగంగా టీడీపీ – జనసేన – బిజెపి కలిసి పోటీ చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పొత్తులో భాగంగా సీట్ల పంపకం..అభ్యర్థుల ప్రకటన పూర్తి అయ్యాయి. ఇక ప్రజల్లోకి మూడు పార్టీలు కలిసి వెళ్లడమే ఆలస్యం. దానికి కూడా సిద్ధం అయ్యాయి. ఈ నెల 17న పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం బొప్పూడిలో ఎన్డీఏ కూటమి తొలి బహిరంగ సభ జరగబోతుంది. ఇప్పటికే ఈ సభకు సంబదించిన ఏర్పాట్లు దాదాపు పూర్తి అయ్యాయి. టిడిపి, జనసేన, బీజేపీ నేతలు సమన్వయంతో సభ ఏర్పాట్లను పర్యవేక్షించారు.
ఈ బహిరంగ సభకు ‘ప్రజాగళం’ (Praja Galam) పేరును ఖరారు చేశారు. ఆదివారం మధ్యాహ్నం టీడీపీ, జనసేన, బీజేపీ నేతృత్వంలో ఈ సభను నిర్వహించనున్నారు. ఈ సభకు ముఖ్య అతిధిగా ప్రధాని మోడీ (PM Modi) హాజరుకాబోతున్నారు. అప్పుడెప్పుడో 2014 లో చంద్రబాబు (Chandrababu) , మోడీ , పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) లు కలిసి వేదికగా పంచుకోగా..ఇప్పుడు ముగ్గురు కలిసి వేదికను పంచుకోబోతున్నారు. సభా ప్రాంగణం 140 ఎకరాలు కాగా, పార్కింగ్‌కి 60 ఎకరాలు కేటాయించారు. ఈ సభకు 10 లక్షల పైచిలుకు బీజేపీ-టీడీపీ-జనసేన తరపున కార్యకర్తలు హాజరవుతారని సమాచారం.
Read Also : YS Sunitha Reddy : హంతకుల పక్షాన ఉంటారా ? బాధితుల పక్షాన ఉంటారా ? : వైఎస్ సునీతారెడ్డి