Pithapuram : పవన్ ఇలాకాలో దారుణం.. బాలికకు మద్యం తాగించి అత్యాచారం
pithapuram : అడ్రస్ అడిగినట్లు చేసి.. మత్తు మందు స్ప్ర్పే చేసి పట్టణ శివారుకు తీసుకెళ్లి బాలికకు బలవంతంగా మద్యం తాగించి ఆ వ్యక్తి అత్యాచారం చేశాడు
- By Sudheer Published Date - 11:07 AM, Tue - 8 October 24

కాకినాడ జిల్లా పిఠాపురం (pithapuram)లో ఓ బాలిక(16)పై అత్యాచారం (Raped ) జరిగిన ఘటన వెలుగు చూసింది. ఏపీలో వరుస అత్యాచారాలు (Rape Incident) ఆగడం లేదు..వరుసగా రాష్ట్రంలో ఎక్కడో చోట అత్యాచారం అనే వార్త వెలుగులోకి వస్తూనే ఉంది. పోలీసులు ఎన్ని కఠిన శిక్షలు విదిస్తునప్పటికీ కామాంధులు మాత్రం వారి అరాచకాలను ఆపడం లేదు. కామంతో అభంశుభం తెలియని చిన్నారులను కూడా వదలడం లేదు. యువకులే కాదు 60 , 70 ఏళ్ల వయసు ఉన్న వృద్దులు కూడా అత్యాచారాలకు పాల్పడుతూ సభ్య సమాజం తలదించుకునేలా చేస్తున్నారు.
మరికొంతమంది స్నేహం ముసుగులో అత్యాచారాలకు పాల్పడుతున్నారు. తాజాగా కాకినాడ జిల్లా పిఠాపురంలో ఓ బాలిక(16)పై అత్యాచారం జరిగిన ఘటన వెలుగు చూసింది. నడుచుకుంటూ వెళ్తున్న బాలికను ఆటోలో వచ్చిన ఒక వ్యక్తి, మరో మహిళ కాగితం చూపించి అడ్రస్ అడిగినట్లు చేసి.. మత్తు మందు స్ప్ర్పే చేసి పట్టణ శివారుకు తీసుకెళ్లి బాలికకు బలవంతంగా మద్యం తాగించి ఆ వ్యక్తి అత్యాచారం చేశాడు. అపస్మారక స్థితిలోని బాలికను మళ్లీ ఆటో ఎక్కిస్తుండగా చెత్త ఏరుకునే మహిళ చూసి అనుమానించింది. వెంటనే దగ్గరికి వచ్చి ఆ బాలికను గుర్తు పట్టి..ఆ బాలిక తల్లిదండ్రులకు ఫోన్ చేసింది. ఘటన స్థలానికి చేరుకున్న వారు..సదరు వ్యక్తులను పట్టుకొని, బాలిక ను హాస్పటల్ కు తరలించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు…దర్యాప్తు మొదలుపెట్టారు. ఈ దారుణానికి పాల్పడింది..ఓ ప్రధాన పార్టీ నాయకురాలి భర్తగా అనుమానిస్తున్నారు.
Read Also : Election Results 2024 : అప్పుడే స్వీట్స్ పంచుకుంటున్న కాంగ్రెస్ నేతలు