Ayyannapatrudu: ప్రస్తుత ఎన్నికలే నాకు చివరి ఎన్నికలు: అయ్యన్నపాత్రుడు
- Author : Balu J
Date : 21-03-2024 - 5:42 IST
Published By : Hashtagu Telugu Desk
Ayyannapatrudu: ప్రస్తుత ఎన్నికలే తనకు చివరి ఎన్నికలని తెలుగుదేశం మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు ప్రకటించారు. ఆయన నర్సీపట్నం నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అయ్యన్న పాత్రుడు నియోజక వర్గాన్ని అభివృద్ధి పరిచేందుకు ప్రజలు తనను ఎన్నుకోవాలని అభ్యర్థించారు. రామన్నపాలెం పంచాయతీ శివారు వెంకయ్యపాలెంలో జరిగిన ఎన్నికల సభలో ఆయన పాల్గొని ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా అధికార పార్టీని వీడి తెలుగుదేశంలో చేరిన వైఎస్సార్‌సీపీ సభ్యులకు ఆయన స్వాగతం పలికారు.
కాగా ఇప్పటికే తెదేపా 128 శాసనసభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. మరో 16 పెండింగులో ఉన్నాయి. 17 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. పెండింగులో ఉన్న శాసనసభ స్థానాలు, ఎంపీ అభ్యర్థులను నేడో రేపో తెదేపా వెల్లడించే అవకాశముంది. చంద్రబాబు ఈ నెల 26 నుంచి ఎన్నికల ప్రచారం చేపట్టనున్నారు. 27 నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించేలా పవన్ ప్రణాళికలు చేస్తున్నారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, అభ్యర్థుల ఖరారుకు తుది కసరత్తు, ఉమ్మడి ప్రచార వ్యూహంపై ఇరుపార్టీల అధినేతల మధ్య కీలక చర్చ జరిగినట్టు తెలుస్తోంది. ఈ ఎన్నికల్లో గెలిచి తీరాలని ఉమ్మడి కూటమి ఫిక్స్ అయ్యింది.