YCP : వైసీపీ వారికీ చుక్కలు చూపిస్తున్న కూటమి సర్కార్
YCP : వైసీపీకి అనుకూలంగా ఉన్న పలువురు రాజకీయ ప్రముఖులు భయాందోళనలో ఉన్నట్లు తెలుస్తోంది
- By Sudheer Published Date - 12:37 PM, Thu - 13 March 25

ఆంధ్రప్రదేశ్(AP)లో ప్రభుత్వం మారిన తర్వాత వైసీపీ (YCP) హయాంలో రెచ్చిపోయిన కొంతమందిపై పోలీసులు(Police) కఠినంగా వ్యవహరిస్తున్నారు. గతంలో అధికారంలో ఉన్న సమయంలో పోలీసులు తాము చెప్పినట్టు వినేలా పాలిటికల్ ప్రెషర్ పెట్టిన నేతలపై ఇప్పుడు కేసులు నమోదవుతున్నాయి. ముఖ్యంగా మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, సినీ ప్రముఖులు సహా వైసీపీకి మద్దతుగా ఉన్న రౌడీ షీటర్లు ఇప్పుడు జైలు కటకటాల్లో ఊచలు లెక్కపెడుతున్నాడు. గతంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని పోలీసులు, విపక్ష నేతలను ఇబ్బంది పెట్టిన వారిపై ఇప్పుడు అదే పోలీసు వ్యవస్థ గట్టిగా చర్యలు తీసుకుంటోంది.
HYD Metro Rail : నిషేధిత వస్తువులు గురించి ప్రయాణికులు తెలుసుకోవాల్సిన విషయాలు
ఇటీవల మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్, మాజీ ఎంపీ నందిగం సురేష్, రౌడీషీటర్ బోరుగడ్డ అనిల్ కుమార్ లాంటి వారిపై పోలీసులు దూకుడుగా వ్యవహరించారు. అరెస్టుల విషయంలో ముందు కొంత వెనుకంజ వేసిన పోలీసులు, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ మద్దతుతో మరింత దూకుడుగా ముందుకు సాగుతున్నారు. ముఖ్యంగా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న నేతలపై ఏసీబీ (ACB) మరియు సీఐడీ (CID) అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా వీరి కేసులను సీరియస్‌గా తీసుకుని, తప్పుదారిలో నడిచిన వారిపై నిర్దాక్షిణ్యంగా వ్యవహరించాలని స్పష్టం చేసింది.
Gudivada Amarnath : విజయసాయి రెడ్డి పై అమర్నాథ్ ఫైర్
ఇక సినీ నటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణమురళి, మాజీ మంత్రి విడుదల రజిని కేసుల్లో కూడా పోలీసులు అదే దూకుడు చూపిస్తున్నారు. పోసాని విషయంలో హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసినా సరే ఆయనకు ఊరట లభించలేదు. చివరి నిమిషంలో సీఐడీ అధికారులు రంగంలోకి దిగి మరింత ఒత్తిడి తీసుకొచ్చారు. దీంతో వైసీపీకి అనుకూలంగా ఉన్న పలువురు రాజకీయ ప్రముఖులు భయాందోళనలో ఉన్నట్లు తెలుస్తోంది. వైసీపీ హయాంలో పోలీసులపై ఒత్తిడి తెచ్చిన వారిపైనే ఇప్పుడు పోలీసులే దాడి చేయడం రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.