Pawan Kalyan : అందుకే వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించలేదు – పవన్ క్లారిటీ
'నేనూ పర్యటించాలని అనుకున్నా. నా వల్ల సహాయక చర్యలకు ఆటంకం కలుగుతుందేమోనని భావించి వెళ్లలేదు. నా పర్యటన సహాయపడేలా ఉండాలే తప్ప అదనపు భారం కాకూడదు
- By Sudheer Published Date - 10:06 PM, Tue - 3 September 24
వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించకపోవడం పై వస్తున్న విమర్శలకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చారు. 30 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా విజయవాడ లో భారీ వర్షం కురిసింది. శుక్రవారం రాత్రి మొదలైన వర్షం శనివారం అర్ధరాత్రి దాకా కొనసాగింది. చరిత్రలో ఎన్నడూ లేనంతగా ఒకే రోజులో 29 సెం.మీ వర్షపాతం నమోదైంది. దీంతో నగరంలోని ఆర్ఆర్ నగర్, విజయవాడ సెంట్రల్ బస్ స్టాండ్, బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్, విద్యాధరపురం ప్రాంతాల్లో రహదారులు జలమయం అయ్యాయి. పైపుల రోడ్డు, సింగ్ నగర్ వంటి ప్రాంతాలు పూర్తిగా జలమయంగా మారాయి. దీంతో కాలనీ వాసులు తాగేందుకు నీరు లేక..తినేందుకు తిండి లేక ఎవరైనా సాయం చేస్తారా అని ఎదుచూస్తున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
ఇక ప్రభుత్వం సైతం కేంద్ర సాయం తీసుకోని వరద బాధితులను ఆదుకునేందుకు నడుం బిగించింది. స్వయంగా సీఎం చంద్రబాబే (CM Chandrababu) నడుం లోతు వరదలో నడుచుకుంటూ బాధితుల బాధలు చూసారు..తప్పకుండ ప్రభుత్వం సాయం చేస్తుందని భరోసా కలిపించారు. ఇటు మంత్రులు సైతం అన్ని ఏరియాల్లో తిరుగుతూ ప్రజల కష్టాలు అడిగితెలుసుకుంటూ తక్షణ సాయం ప్రకటిస్తూ వస్తున్నారు. అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (AP Deputy CM Pawan Kalyan) మాత్రం ఎక్కడ కనిపించకపోయేసరికి..అంత పవన్ కళ్యాణ్ ఎక్కడ అని మాట్లాడుకుంటున్నారు. అధికారం లేనప్పుడు నిత్యం ప్రజల మధ్య ఉండే పవన్..ఇప్పుడు ప్రజలు పీకల్లోతు కష్టాల్లో ఉన్నప్పుడు కనిపించడేం అని ప్రశ్నిస్తున్నారు. సెప్టెంబర్ 2 పవన్ కల్యాణ్ పుట్టిన రోజు. దీంతో ఆయన రాష్ట్రంలోనే ఉన్నారా..? విదేశాలకు వెళ్లారా ..? అని మాట్లాడుకోవడం మొదలుపెట్టారు.
ఈ క్రమంలో తాను పర్యటించకపోవడం పై పవన్ క్లారిటీ ఇచ్చారు. ‘నేనూ పర్యటించాలని అనుకున్నా. నా వల్ల సహాయక చర్యలకు ఆటంకం కలుగుతుందేమోనని భావించి వెళ్లలేదు. నా పర్యటన సహాయపడేలా ఉండాలే తప్ప అదనపు భారం కాకూడదు. నేను రాలేదని కొందరు నిందలు వేస్తారు. అంతే తప్ప ఇంకేం ఉండదు. విపత్తు సమయంలో నిందల కంటే ప్రజాసేవ చేయడమే ముఖ్యం’ అని పవన్ వెల్లడించారు.
అలాగే వరద బాధితులకు రూ.కోటి విరాళం ప్రకటించారు. వరద తీవ్రత, సహాయక చర్యలపై ఆయన రాష్ట్ర విపత్తుల కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ‘గత ప్రభుత్వం ప్రాజెక్టుల పట్ల నిర్లక్ష్యం వహించింది. అందుకే ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఆర్మీ సహకారంతో బాధితులకు సాయం అందిస్తున్నాం. బుడమేరు నిర్వహణ సక్రమంగా లేక వరద పోటెత్తింది. మరికొంత వరద వచ్చుంటే పెను ప్రమాదం జరిగి ఉండేది’ అని ఆయన పేర్కొన్నారు.
Read Also : Priyansh Arya: ఆర్సీబీపై కన్నేసిన సిక్సర్ల కింగ్ ప్రియాంష్ ఆర్య
Related News
Vijayawada Floods: వరద బాధితులకు విరాళాలు కోరిన సీఎం చంద్రబాబు
వరద బాధితులను ఆదుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రజలు తమకు చేతనైనంతలో ముఖ్యమంత్రి సహాయ నిధికి సహకరించాలని బహిరంగ ప్రకటనలో కోరారు. ఈ వినాశకరమైన పరిస్థితిలో నష్టపోయిన వారికి సహాయం చేయడానికి ముందుకు రావాలని ఆయన కోరారు.