HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Thats What Pawan Asked When He Was In Jail Chandrababu

Unstoppable with NBK 4 : జైల్లో ఉన్నప్పుడు పవన్ అడిగింది అదే – చంద్రబాబు

Unstoppable with NBK 4 : మీరు జైల్లో ఉన్న టైం లో పవన్ కళ్యాణ్ స్వయంగా జైలు కు వచ్చి కలిశారు..అప్పుడు ఏమాట్లాడారు..? అని బాలయ్య అడిగిన ప్రశ్నకు చంద్రబాబు సమాధానం ఇచ్చారు

  • Author : Sudheer Date : 26-10-2024 - 7:09 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Babu Pawan Unstop
Babu Pawan Unstop

నందమూరి బాలకృష్ణ (Balakrishna) హోస్ట్ చేస్తున్న అహా ఓటీటీ ‘అన్‌స్టాపబుల్ 4’ (Unstoppable with NBK ) షో పై అంచనాలు ఏ స్థాయిలో నెలకొన్నాయో తెలియంది కాదు. ఇప్పటికే మూడు సీజన్లు సక్సెస్ ఫుల్ గా పూర్తి కావడం..ఈ సీజన్ అంతకు మించి ఉండబోతుందని అంత భావిస్తున్నారు. ఇక ఈ సీజన్ 4 మొదటి ఎపిసోడ్‌ కు బాలయ్య బావ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు (Chandrababu) తో స్టార్ట్ చేయడం..విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఈ ఎపిసోడ్ తాలూకా ప్రోమో .. సరదాగా, ఆసక్తికర ప్రశ్నలతో సాగినట్లు చూపించేసరికి. ఈ ఎపిసోడ్ ఎప్పుడెప్పుడు స్ట్రీమింగ్ అవుతుందా అంటూ అభిమానులు , పార్టీ శ్రేణులు ఇలా యావత్ ప్రజానీకం ఎదురుచూసారు. వారి ఎదురుచూపులు , అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఎపిసోడ్ సాగింది. రాష్ట్ర భవిష్యత్తు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ (Pawan Kalyan)తో భేటీ, చంద్రబాబు జైలులో గడిపిన 53 రోజుల అనుభవాలు, వ్యక్తిగత విషయాలు వంటి పలు అంశాల గురించి వివరించారు.

మీరు జైల్లో ఉన్న టైం లో పవన్ కళ్యాణ్ స్వయంగా జైలు కు వచ్చి కలిశారు..అప్పుడు ఏమాట్లాడారు..? అని బాలయ్య అడిగిన ప్రశ్నకు చంద్రబాబు సమాధానం ఇచ్చారు. ఎలా ఉన్నారు సార్..? రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండేందుకు ప్రయత్నిస్తానని చెప్పడం, ఒక విధంగా రాజకీయ వ్యూహం కేంద్రీకరించడం అనిపించింది. అందరితో కలిసి పోటీ చేద్దామని సలహా ఇవ్వడం, బీజేపీతో కలిసి పని చేయాలనే తత్వాన్ని తెలియజేసారు.

అప్పుడు నేనే ముందు అన్నాను. ఓ సారి ఆలోచించండి. అంద‌రం క‌లిసి పోటీ చేద్దామ‌ని ప‌వ‌న్‌తో అన్నాను. ఆయ‌న కూడా ఆలోచించి ఓకే అన్నాడు. బీజేపీకి కూడా న‌చ్చ‌జెప్పి కూట‌మిలోకి తీసుకువ‌స్తాన‌ని చెప్పాడు అని చంద్ర‌బాబు అన్నారు. ఆ త‌రువాత బ‌య‌ట‌కు వెళ్లి కూట‌మి ప్ర‌క‌ట‌న చేసిన‌ట్లుగా చంద్ర‌బాబు చెప్పారు. అదే త‌మ విజ‌యానికి నాంది అని అన్నారు.

ఫస్ట్ డే జైలులో ఎలా గడిచింది..?

నంద్యాల నుంచి అడవుల్లో అమరావతికి తీసుకొచ్చారు. రాత్రంతా ఇన్వెస్టిగేషన్ పేరుతో అటు ఇటు తిప్పి తెల్లారి మెడికల్ టెస్టులకు తిప్పారు. ఆ తర్వాత అక్కడా ఇక్కడా తిప్పి కోర్టుకు తీసుకెళ్లారు. అక్కడ సాయంత్రం వరకు ఆర్గ్యుమెంట్స్ చేసారు. అర్ధరాత్రి రాజమండ్రి జైలుకి పంపించారు. ఆ రాత్రి చేయని తప్పుకు అరెస్ట్ చేయడం, ఆ చేసిన విధానం చూసి గుండె తరుక్కుపోయింది. నేను అక్కడికి వెళ్ళినప్పుడు సందేహంగా కొన్ని సంఘటనలు జరిగాయి. అయినా నేను ధైర్యంగా ఉన్నాను, ఎదుర్కొన్నాను కాబట్టి ఏమి జరగలేదు. లేకపోతే ఏమయ్యేదో ఇంకోలా ఉండేది. చనిపోతే ఒక్క క్షణం. అనుకున్న ఆశయం కోసం పనిచేస్తే అది శాశ్వతం. అదే నన్ను ముందుకు నడిపించింది. చావు గురించి ఆలోచిస్తే జీవితంలో ఏది చేయలేము అని అన్నారు.

యువ‌గ‌ళం పాద‌యాత్రతో లోకేశ్‌ లో ఎంతో మార్పు వచ్చింది

రాష్ట్రంలోని 11 ఉమ్మడి జిల్లాల్లో 97 అసెంబ్లీ నియోజకవర్గాలు, 232 మండలాలు/మున్సిపాలిటీలు, 2,028 గ్రామాల మీదుగా 226 రోజులపాటు లోకేశ్‌ పాదయాత్ర సాగింది. ఎన్నో క‌ష్ట‌న‌ష్టాల‌కు ఓర్చి 3,132 కిమీ లోకేశ్‌ పాద‌యాత్ర నిర్వ‌హించారు. పాద‌యాత్ర మొద‌టి నుంచి ప్ర‌మాణ స్వీకారం దాకా విశ్ర‌మించ‌కుండా పనిచేసాడు. యువ‌గ‌ళం పాద‌యాత్రతో లోకేశ్‌ లో ఎంతో మార్పు తీసుకొచ్చింది. లోకేష్ యువ‌గ‌ళం కంటే ముందు లోకేష్ యువ‌గ‌ళం త‌రువాత అని చంద్రబాబు చెప్పుకొచ్చారు.

Read Also : Second Marriage : రెండో పెళ్లి పై సమంత క్లారిటీ..


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • aha
  • chandrababu
  • Pawan Kalyan
  • Unstoppable with NBK
  • Unstoppable With NBK Season 4
  • unstoppable with nbk season 4 full episode

Related News

Nani Pawan

Nani Big Shock to Pawan Kalyan : నాని మాస్ ‘షేర్’ దెబ్బకు పవన్ ‘ఉస్తాద్’ విలవిల

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న "ఉస్తాద్ భగత్ సింగ్" చిత్రం నుండి విడుదలైన 'ఆరా ఆఫ్ ఉస్తాద్' పాటపై ఫ్యాన్స్ భారీ ఆశలు పెట్టుకున్నారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన ఈ పాట ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది.

  • Allu Sirish Wedding

    అల్లు శిరీష్ వివాహ వేడుకలు.. పవన్ కళ్యాణ్ దంపతులకు ఆహ్వానం!

  • Allu Sirish invites Pawan Kalyan and Naga Babu

    అల్లు శిరీష్ పెళ్లి..పవన్‌ కల్యాణ్‌, నాగబాబులకు శుభలేఖ

  • Konidela Village

    కొణెదల పేరుతో గ్రామం..రూ.6 కోట్లను మంజూరు చేసిన పవన్ కళ్యాణ్

  • Meeting Of CMs

    India AI Impact Summit 2026 : ఏఐ సమ్మిట్ కు తెలుగు రాష్ట్రాల సీఎంలు

Latest News

  • Gold Price Today Feb 26-2026: బంగారం ధరలు ఢమాల్..ఈరోజు భారీగా తగ్గిన ధర

  • Vijay – Rashmika Love Journey : విజ‌య్ ర‌ష్మికల ల‌వ్ జ‌ర్నీ ఎలా మొదలైందంటే !!

  • Vrusha Karma : చీకటి గుహలో చైతూ వేట

  • Social Media : 10 కోట్ల ఫాలోవర్లతో ఇన్స్టాలో మోదీ రికార్డ్

  • గుడ్ న్యూస్‌.. గాలి లేకుండానే నడిచే టైర్!!

Trending News

    • SA vs WI మ్యాచ్‌లో ఎవరి గెలుపు భారత్‌కు ముఖ్యం?

    • కేంద్రంపై సుప్రీంకోర్టు ఆగ్ర‌హం.. కార‌ణ‌మిదే?!

    • టీ20 వరల్డ్ కప్ 2026.. భార‌త్‌కు సౌతాఫ్రికా సాయం చేయ‌నుందా?

    • Save Punarvika : పునర్వికకు పునర్జన్మ.. రూ.16 కోట్లు అందజేసిన దాతలు

    • మీ వాహనంపై ట్రాఫిక్ చలాన్ పడిందా? అయితే ఇలా చేయండి!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd