Telugu News
News
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Special
  • Off Beat
News
News
CloseIcon
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Photo Gallery
  • Speed News
  • Health
  • Life Style
  • Devotional
  • Off Beat

  • Telugu News
  • ⁄Andhra-pradesh News
  • ⁄Tension Prevails After Boats Fishing Nets Set Afire Near Jalari Yendada

AP Fishing: విశాఖలో ఉద్రిక్తత :జాలరి ఎండాడలో ఫిషింగ్ బోట్లకు నిప్పు, మత్య్సకారుల మధ్య ఘర్షణ

చేపల వేటకు రింగ్ వలలు వినియోగించే, సాధారణ వలలు వినియోగించే మత్స్యకారుల మధ్య విశాఖపట్నంలో మళ్ళీ ఘర్షణలు చోటుచేసుకున్నాయి.

  • By Hashtag U Published Date - 11:46 AM, Sun - 31 July 22
AP Fishing: విశాఖలో ఉద్రిక్తత :జాలరి ఎండాడలో ఫిషింగ్  బోట్లకు నిప్పు, మత్య్సకారుల మధ్య ఘర్షణ

చేపల వేటకు రింగ్ వలలు వినియోగించే, సాధారణ వలలు వినియోగించే మత్స్యకారుల మధ్య విశాఖపట్నంలో మళ్ళీ ఘర్షణలు చోటుచేసుకున్నాయి. నగరంలోని వసవని పాలెం, జాలరిపేట మరోసారి అట్టుడికాయి. జాలరిపేటకు చెందిన వారిగా భావిస్తున్న కొందరు వ్యక్తులు.. జాలరి ఎండాడ గ్రామ సమీపంలో ఆరు ఫిషింగ్ బోట్లు, కొన్ని రింగ్ వలలకు నిప్పు పెట్టారు. శుక్రవారం వేకువజామున ఈ ఘటన చోటుచేసుకున్నట్లు గుర్తించారు.

ఈ ఘటనతో వసవని పాలెం, జాలరిపేట మధ్య ఉద్రిక్తత ఏర్పడింది. ఇరుగ్రామాల మత్స్యకారులు మెకనైజ్డ్ బోట్లలో సముద్రంలోనే గొడవకు దిగారు. ఒకరి బోట్లను ఇంకొకరు వెంటాడి కొట్టుకున్నారు. ఈక్రమంలో పలువురు మత్య్సకారులు సముద్రంలో పడిపోయారు. కొందరి బోట్లను సముద్రంలోనే నిప్పటించారు. ఈనేపథ్యంలో అక్కడికి పెద్ద సంఖ్యలో పోలీసులను తరలించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.విశాఖ నగరంలోని వసవని పాలెం, జాలరిపేటలలో 144 సెక్షన్ విధించారు. మంగమారిపేట, ఫిషింగ్ హార్బర్ పరిసరాల్లో పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు.ఈవివరాలను విశాఖ సిటీ పోలీస్ చీఫ్ మనీష్ కుమార్ సిన్హా వెల్లడించారు.సంఘటన స్థలాన్ని రాష్ట్ర మత్స్య శాఖ మంత్రి సిదిరి అప్పలరాజు సందర్శించారు.

మరోవైపు మత్స్యకార పల్లెకు చెందిన కొందరు జాలర్లు రింగ్ వలలతో చేపల వేటకు వెళ్లగా.. జాలరిపేటకు చెందిన కొందరు గ్రామస్తులు వారిని అడ్డుకొని వెనక్కి పంపించారు. సముద్ర తీరానికి 8 కిలోమీటర్ల లోపల రింగ్ వలలతో చేపల వేట చేయడంపై నిషేధం ఉంది. ఈ నిబంధనను అతిక్రమించే వారినే అడ్డుకుంటున్నామని సంప్రదాయకంగా చేపల వేట చేసే జాలర్లు చెబుతున్నారు. ఈ ఏడాది జనవరి నెలలోనూ రింగ్ వలల వివాదం రెండు గ్రామాల మధ్య ఘర్షణాత్మక స్థాయికి చేరడంతో విశాఖపట్నంలోని మత్స్యకార గ్రామాల్లో భారీ సంఖ్యలో పోలీసులను మోహరించారు.

Tags  

  • ANdhra pradesh boats
  • boats
  • fishing nets
  • jalari yendada
  • tension

Related News

Depression: యువతలోనే  డిప్రెషన్ ఎక్కువట…కారణాలేంటి..?

Depression: యువతలోనే డిప్రెషన్ ఎక్కువట…కారణాలేంటి..?

మనదేశంలో డిప్రెషన్ భారీనపడుతున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. సుమారు 15 నుంచి 25ఏండ్ల లోపు ఉన్నవారే ఎక్కువగా డిప్రెషన్ బారిన పడుతున్నారట.

    Latest News

    • Road Accident : యూపీ లో డీసీఎం వాహ‌నాన్ని ఢీకొట్టిన బ‌స్సు.. 30 మందికి గాయాలు

    • Pakistani Loves Indian: హైదరాబాద్ అబ్బాయిని ప్రేమించిన పాకిస్తాన్ అమ్మాయి.. ఇక్కడికి వస్తు దొరికిపోయిన యువతి!

    • Gorantla Issue: గోరంట్ల బూతు వీడియో పై ‘నార్త్’ ఫైట్

    • AP Politics: సోలో గేమ్ సో బ్యాడ్

    • Jagga Reddy: జగ్గారెడ్డి మౌనం వెనుక మతలబు

    Trending

      • Sweet Shop: 47 ఏళ్లుగా అద్భుతమైన రుచి.. ఆ స్వీట్ చరిత్ర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

      • Floods in Death Valley..!: ప్రపంచంలోనే వేడి ప్రదేశం.. అక్కడ వరదలు..!

      • Ambidexterity: రెండు చేతులతో అద్భుతంగా రాస్తున్న చిన్నారి.. వీడియో వైరల్?

      • Grooms For Sale: బాబోయ్.. అమ్మాయిలకు పెళ్ళికొడుకులను అమ్మేస్తున్న జనాలు.. ఎక్కడంటే?

      • 6000cr: వ్యక్తి ఖాతాలో రూ.6 వేల కోట్లు.. అసలు ఎలా వచ్చాయంటే?

    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    • Copyright © 2022 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam
    • Follow us on: