Vizag : క్షుద్రపూజల పేరు చెప్పి 48 తులాల బంగారం ఎత్తుకెళ్లిన పూజారి
విశాఖపట్నం జిల్లా భీమిలి పోలీస్ స్టేషన్ పరిధిలోని తగరపువలసలోని సాయిబాబా గుడిలో అర్చకుడిగా పనిచేస్తున్న శ్రీను.. క్షుద్రపూజలు పేరుతో అమాయకపు ప్రజలను మోసం చేసి వారి
- By Sudheer Published Date - 01:26 PM, Sun - 17 September 23

ఓ పక్క చంద్రుడి ఫై కాలు మోపి సరికొత్త రికార్డ్స్ సృష్టిస్తుంటే..మరోపక్క ఇంకా మూఢనమ్మకాల ముసుగులో ఇల్లు గుల్ల చేసుకుంటున్నారు కొంతమంది అమాయకపు ప్రజలు. ముఖ్యంగా క్షుద్రపూజల (Black Magic)ఫై నమ్మకం పెంచుకుంటూ డబ్బులు పోగొట్టుకుంటున్నారు. కష్టపడకుండా రాత్రిరాత్రికే కోటేశ్వర్లు అవ్వాలనే అత్యాశతో దొంగబాబాలను నమ్ముకుంటూ..అన్ని పోగొట్టుకొని వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా విశాఖ (Vizag) లో ఇలాంటి తరహా ఘటనే చోటుచేసుకుంది. క్షుద్రపూజలు పేరుతో నమ్మించి ఓ మహిళా నుండి 48 తులాల బంగారం దోచేశాడు ఓ పూజారి. ప్రస్తుతం ఈ ఘటన మీడియా లో వైరల్ గా మారింది.
విశాఖపట్నం జిల్లా భీమిలి పోలీస్ స్టేషన్ పరిధిలోని తగరపువలసలోని సాయిబాబా గుడిలో అర్చకుడిగా పనిచేస్తున్న శ్రీను (Srinu).. క్షుద్రపూజలు పేరుతో అమాయకపు ప్రజలను మోసం చేసి వారి దగ్గరి నుండి డబ్బు , నగదు తీసుకోవడం చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ భక్తురాలిని కూడా అలాగే నమ్మించాడు.క్షుద్రపూజలు చేస్తే కోటేశ్వర్లు అవుతారని నమ్మించి.. 48 తులాల బంగారం పట్టుకెళ్లాడు. ఆ తర్వాత ఆ పూజారి జాడలేదు..తీసుకెళ్లిన బంగారం రాలేదు. దీంతో సదరు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Read Also : Shakeela – Bigg Boss : ‘బిగ్ బాస్’ హౌస్ నుంచి షకీలా ఔట్.. ఏం జరిగింది ?
పూజారితో పాటు ఆలయ ధర్మకర్త, మరో వ్యక్తి కూడా ఇందులో భాగస్వామిగా ఉన్నారని ఆమె ఆరోపించింది. ఎఫ్ఐఆర్ నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విచారణలో విస్తుగొలిపే విషయాలు వెలుగులోకి వచ్చాయి. బాధితురాలి వద్ద నుంచి కొట్టేసిన బంగారాన్ని ముత్తూట్ ఫైనాన్స్, పెడరల్ బ్యాంకులో తాకట్టు పెట్టినట్టు గుర్తించారు. రెండు చోట్ల 30 తులాల బంగారం తాకట్టు పెట్టగా.. మిగతాది ఏమైందో తెలియాల్సి ఉంది.తాకట్టులో ఉన్న బంగారం రికవరీ కోసం బ్యాంకులకు భీమిలి పోలీసులు లేఖ రాశారు. ఈ వ్యవహారంలో పూజారికి మరో ఇద్దరు కూడా సహకరించినట్టు పోలీసులు పేర్కొన్నారు. కేసుపై దర్యాప్తు కొనసాగుతోందని.. త్వరలో పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.