Telugu Politics : అంతా తూచ్! `నల్లారి` రాజకీయంలో బీజేపీ!!
నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పయనం ఎటు? (Telugu Politics) ఆయన్ను బీజేపీ ఎందుకు తీసుకుంటుంది?
- By CS Rao Published Date - 01:13 PM, Sat - 11 March 23

మాజీ సీఎం, సమైక్యాంధ్ర పార్టీ అధినేత నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పయనం ఎటు? (Telugu Politics) ఆయన్ను బీజేపీ ఎందుకు తీసుకుంటుంది? ఏపీలో ఆయన(Kirankumar Reddy) ఉపయోగపడతారా? తెలంగాణ బీజేపీకి లాభమా? ఇలాంటి అంశాలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఉమ్మడి రాష్ట్ర విభజనకు చివరి వరకు కాంగ్రెస్ అధిష్టానంకు సహకారం అందించారు. అసెంబ్లీని రద్దు చేసే అవకాశం ఉన్నప్పటికీ బిల్లును ఆమోదింపు చేయడంలో కీలకభూమిక పోషించారు. అందుకే, ఆయనంటే ఏపీ ప్రజలకు ఏహ్యభావం. ఆయన మీద ఉన్న కోపాన్ని 2014 ఎన్నికల్లో చూపారు. ఆయన పెట్టిన సమైక్యాంధ్రా పార్టీకి ఎక్కడా సింగిల్ డిజిట్ ఓట్లు రాలేదు. అంటే, ఆయన మీద ఏపీ ప్రజలకు ఎంత కోపం ఉంది? అనేది అర్థమవుతోంది. ఇలాంటి రాజకీయ గ్రాఫ్ ఉన్న కిరణ్ కుమార్ రెడ్డిని ఏపీ బీజేపీ తీసుకుంటుందా? అనే ప్రశ్న వేసుకుంటే వచ్చే సమాధానం అందరికీ తెలిసిందే.
నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పయనం ఎటు? (Telugu Politics)
ఇక తెలంగాణకు ఒక్క పైసా కూడా ఇవ్వమని అసెంబ్లీ సాక్షిగా సీఎం హోదాలో ఆయన (Kirankumar Reddy) చేసిన హూంకారం ఇప్పటికీ అందరికీ గుర్తే. పైగా తలంగాణ ప్రజల గుండెల్లో గుచ్చుకునేలా ఆయన చేసిన కామెంట్ మరువలేనిది. సమైక్యాంధ్ర పార్టీ పెట్టిన కిరణ్ కుమార్ రెడ్డిని తెలంగాణ బీజేపీ ఆహ్వానిస్తుందా? అంటే నో అనే సమాధానం క్లియర్ గా వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో కిరణ్ కుమార్ రెడ్డిని తీసుకుని బీజేపీ ఏమి చేస్తుంది? అనే వాళ్లు లేకపోలేదు. వాస్తవంగా కిరణ్ కుమార్ రెడ్డి 2014 నుంచి చెల్లని రూపాయి మాదిరిగా రాజకీయాల్లో ఉన్నారు. ఆయన బ్రదర్ కిషోర్ కుమార్ రెడ్డి మాత్రం టీడీపీలో ఉన్నారు. చిత్తూరు జిల్లా వరకు ఎంతో కొంత రాజకీయ నేపథ్యం నల్లారి కుటుంబానికి ఉండేది. ప్రస్తుతం మంత్రి పెద్దిరెడ్డి వ్యూహాలతో అటు వైపు(Telugu Politics) చూడ్డానికి కూడా `నల్లారి` కుటుంబం ధైర్యం చేయలేకపోతోంది.
సమైక్యాంధ్ర పార్టీ పెట్టిన కిరణ్ కుమార్ రెడ్డి
ప్రస్తుతం తెలంగాణ బీజేపీ దూకుడుగా ఉంది. జనసేన పరోక్ష ప్రమేయాన్ని కూడా నిరాకరిస్తోంది. ఏపీ వరకు మాత్రమే బీజేపీతో పొత్తును పరిమితం చేసింది. వచ్చే ఎన్నికల్లో అధికారం దిశగా వెళుతోంది. ఆ క్రమంలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి(Kirankumar Reddy) లాంటి వాళ్లను తెలంగాణ బీజేపీ వేదికపై చూపే సాహసం చేయదు. ఒక వేళ చేసినప్పటికీ వచ్చే లాభం కంటే నష్టం ఎక్కువని బండి సంజయ్ కు తెలియని అంశం కాదు. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీ అధిష్టానం కిరణ్ కుమార్ రెడ్డికి గాలం వేస్తుందనే న్యూస్ నమ్మశక్యం కావడంలేదు. ఒక వేళ ఆయన్ను తీసుకున్నప్పటికీ ఏపీ వరకు పరిమితం చేసే అవకాశం ఉంది. ఎందుకంటే, చంద్రబాబు వ్యతిరేక పావులను బీజేపీ ఏపీలో (Telugu Politics)కదుపుతోంది. ఆ కోణం నుంచి ఆలోచిస్తే, కిరణ్ కుమార్ రెడ్డి అవసరం బీజేపీకి కొంత మేరకు కనిపిస్తోంది.
Also Read : AP Politics : మసకబారిన `మాజీ సీఎం` రాజకీయ కిరణాలు
చిత్తూరు జిల్లా రాజకీయం పూర్వం నుంచి నల్లారి, నారా, పెద్దిరెడ్డి కుటుంబాల మధ్య నడుస్తోంది. తొలి నుంచి చంద్రబాబుకు వ్యతిరేకంగా నల్లారి (Kirankumar Reddy)ఫ్యామిలీ పనిచేసింది. తొలిసారిగా 1978లో చంద్రబాబు ఎమ్మెల్యే పోటీకి దిగిన సమయంలో వ్యతిరేకంగా పనిచేసింది. అంతేకాదు, టిక్కెట్ రాకుండా చేసేందుకు సర్వశక్తులు కిరణ్ కుమార్ రెడ్డి తండ్రి చేశారని అందరికీ తెలిసిన చరిత్రే. ఆ తరువాత చంద్రబాబు సీఎం కావడంతో రాజకీయ గ్రాఫ్ అనూహ్యంగా పెరిగింది. దీంతో నల్లారి కుటుంబం సైలెంట్ అయింది. అయితే, 2004 ఎన్నికల్లో వైఎస్ అధికారంలోకి వచ్చిన తరువాత నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మళ్లీ తెరమీదకు వచ్చారు. స్పీకర్ గా ఉమ్మడి అసెంబ్లీకి (Telugu Politics)పనిచేసే అవకాశాన్ని వైఎస్ ఇచ్చారు. ఆనాడు పెద్దిరెడ్డి, నల్లారి మధ్య ప్రచ్ఛన్నయుద్ధం ఉండేది. ఆ క్రమంలో కిరణ్ కుమార్ రెడ్డికి మంత్రి పదవి వైఎస్ క్యాబినెట్లో రాలేదని కాంగ్రెస్ వర్గీయులకు తెలుసు.
కిరణ్ కుమార్ రెడ్డికి మంత్రి పదవి వైఎస్ క్యాబినెట్లో రాలేదని
హెలికాప్టర్ ప్రమాదంలో రాజశేఖర్ రెడ్డి మరణించిన తరువాత సీఎం పదవిని అధిరోహించిన రోశయ్య మీద వ్యూహాత్మకంగా కిరణ్ కుమార్ రెడ్డి(Kirankumar Reddy) గేమాడారు. కాంగ్రెస్ అధిష్టానం వద్ద చక్రతిప్పారు. సీఎం పదవిని అధిరోహించారు. ఆనాటి నుంచి పెద్దిరెడ్డి గ్రాఫ్ కొంత పడిపోయింది. అయితే, 2014 లో సమైక్యాంధ్ర పార్టీని స్థాపించిన కిరణ్ కుమార్ రెడ్డి అడ్రస్ లేకుండా పోయారు. 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యారు. దీంతో పెద్దిరెడ్డి గ్రాఫ్ అమాంతం పెరిగింది. అటు చంద్రబాబు ఇటు నల్లారి వర్గీయులపై రాజకీయ గేమాడారు. ఫలితంగా నల్లారి గ్రాఫ్ పూర్తిగా పడిపోగా, చంద్రబాబు మాత్రం పెద్దిరెడ్డి మీద పోరాడుతున్నారు.
రాష్ట్ర విభజనకు చివరి వరకు కాంగ్రెస్ అధిష్టానంకు సహకారం
ప్రస్తుత పరిస్థితుల్లో(Telugu Politics) పెద్దిరెడ్డి, చంద్రబాబుకు రాజకీయ ప్రత్యర్థిగా భావిస్తూ కిరణ్ కుమార్ రెడ్డిని బీజేపీ తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే, స్థానికంగా ఉండే `రెడ్డి` సామాజికవర్గం ప్రస్తుతం బీజేపీలో చిత్తూరు రాజకీయాలను నడుపుతోంది. దీంతో కిరణ్ కుమార్ రెడ్డి రావడాన్ని ఆ వర్గం వ్యతిరేకిస్తోంది. ఆ క్రమంలో కిరణ్ కుమార్‌రెడ్డికి (Kirankumar Reddy) రాజ్యసభ సభ్యుని పదవి ఆఫర్ చేస్తూ, కీలక పదవిని బీజేపీ అధిష్టానం ఇవ్వనుంది అనే న్యూస్ నేతిబీరలోని నెయ్యిని తలపిస్తోంది.
Also Read : Kiran Kumar Reddy: సోనియాతో కిరణ్ కుమార్ రెడ్డి భేటీ!

Related News

T BJP : అసరుద్దీన్ కు ఎసరు,MP అభ్యర్థిగా కిరణ్ కుమార్ రెడ్డి?
తెలంగాణ బీజేపీ (T BJP) వ్యూహాలకు పదును పెట్టింది.బీఆర్ఎస్(BRS) పార్టీని దెబ్బతీయడానికి