#2YearsToByeByeJagan :2 ఇయర్స్ టూ బైబై జగన్ ట్రెండింగ్
గ్రీన్ ఛాలెంజ్ , వైట్ ఛాలెంజ్ , రైస్ బకెట్, ఐస్ బకెట్ అంటూ సోషల్ మీడియా వేదికగా వివిధ సామాజిక అంశాలపై ఛాలెంజ్ చేసుకోవడం ఇప్పటి వరకు చూశాం.
- By CS Rao Published Date - 05:09 PM, Tue - 31 May 22

గ్రీన్ ఛాలెంజ్ , వైట్ ఛాలెంజ్ , రైస్ బకెట్, ఐస్ బకెట్ అంటూ సోషల్ మీడియా వేదికగా వివిధ సామాజిక అంశాలపై ఛాలెంజ్ చేసుకోవడం ఇప్పటి వరకు చూశాం. తెలుగుదేశం పార్టీ వినూత్నంగా ఠాగూర్ సినిమాలో మాదిరిగా ఒకరు మరో ముగ్గురుకి చెప్పాలనే విధంగా ట్విట్టర్ వేదికను వాడుకుని జగన్ మూడేళ్ల పాలనపై యుద్ధాన్ని ప్రారంభించారు. జగన్ పాలనలోని మూడు వైఫల్యాలను తెలియచేయాలంటూ ఒకరు మరో ఇద్దరికి నామినేట్ చేస్తున్నారు. ఇలా…
https://twitter.com/Nameisharinath/status/1531579903560515584
తెలుగుదేశం పార్టీ క్రియేట్ చేసిన హ్యాష్ ట్యాగ్ `2 ఇయర్స్ టూ బైబై జగన్` పేరుతో ట్విట్టర్లో ట్రెండ్ అవుతోంది. ప్రతిపక్ష ఓ హ్యాష్ ట్యాగ్‌ను క్రియేట్ చేసి ట్విట్టర్ వేదికగా ట్రెండింగ్‌లోకి తీసుకొచ్చింది. టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ఈ ట్రెండ్‌కు మొదలుపెట్టారు. ఇప్పటికే పలువురు టీడీపీ సీనియర్ల నుంచి ట్వీట్లు పోస్ట్ అయ్యాయి. మూడేళ్ల జగన్ పాలనపై వైసీపీ సంబరాలు జరుపుకుంటోన్న వేళ టీడీపీ చేసిన హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ లోకి వెళ్లడం గమనార్హం.
సోషల్ మీడియా వేదికగా మూడేళ్ల పాటు జగన్ చేసిన అరాచకాలను ట్వీట్ రూపంలో పోస్టులు పెడుతున్నారు. 2019 ఎన్నికల సందర్భంగా జగన్ ఇచ్చిన హామీ వీడియోలను కూడా కొందరు పోస్ట్ చేస్తున్నారు. పాదయాత్ర సందర్భంగా జగన్ ఇచ్చిన హామీలతో సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టాక ఆయన చేసిన విరుద్ధమైన పనులను గుర్తు చేస్తున్నారు. జగన్ ఇచ్చిన మోసపు వాగ్దానాలు అంటూ సోషల్ మీడియా వేదికగా టీడీపీ నేతలు వరుసబెట్టి పలు అంశాలను ప్రస్తావిస్తున్నారు.
వినూత్నంగా జగన్ జమానాలోని మూడు వైఫల్యాల గురించి చెప్పాలంటూ ట్వీట్ చేసిన నేత మరో ఇద్దరు నేతలను నామినేట్ చేస్తున్నారు. జగన్ మోసపు వాగ్దానాలు ఇవి అంటూ పేర్కొన్న అయ్యన్న పాత్రుడు, జగన్ 3 వైఫల్యాలను చెప్పాలంటూ టీడీపీ నేతలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, అమర్‌నాథ్ రెడ్డిలను నామినేట్ చేశారు. సీఎంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మూడేళ్ల పదవీ కాలాన్ని ముగించుకున్న సందర్భాన్ని వైసీపీ శ్రేణులు సంబరంగా జరుపుకుంటూ ఉంటే, టీడీపీ మాత్రం సోషల్ మీడియా వేదికగా జగన్ వైఫల్యాలను ట్రెండింగ్ లో ఉంచుతున్నారు.