TDP : బెజవాడ టీడీపీ ఎంపీ టికెట్ పై అధిష్టానం క్లారిటీ.. సిట్టింగ్ ఎంపీ స్థానంలో కొత్తవారికి అవకాశం
బెజవాడ టీడీపీలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. విజయవాడ ఎంపీ టికెట్‌పై అధిస్టానం క్లారిటీ ఇచ్చింది. వచ్చే
- By Prasad Published Date - 08:08 AM, Fri - 5 January 24

బెజవాడ టీడీపీలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. విజయవాడ ఎంపీ టికెట్‌పై అధిస్టానం క్లారిటీ ఇచ్చింది. వచ్చే ఎన్నికల్లో సిట్టింగ్ ఎంపీగా ఉన్న కేశినేని నానికి సీటు లేదని చెప్పినట్లు ఆయన అధికారికంగా వెల్లడించారు. జిల్లా అధ్యక్షుడు నెట్టెం రఘురామ్, మాజీ మంత్రి ఆలపాటి రాజా ద్వారా అధిష్టానం ఈ విషయాన్ని కేశినేని నానికి తెలిపింది. జనవరి 7న జరిగే బహిరంగ సభ బాధ్యతలను మరొకరికి ఇచ్చారని.. వాటిలో కలుగజేసుకోవద్దని తెలిపినట్టు పేర్కొన్నారు. విజయవాడ ఎంపీ సీటు కోసం ఆయన సోదరుడు కేశినేని శివనాథ్(చిన్ని) పోటీపడ్డారు. ఇప్పుడు తిరువూరు సభ బాధ్యతలు కూడా ఆయనకే ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిగా చిన్ని పోటీ చేస్తారని తెలుస్తుంది. అయితే ఎంపీ కేశినేని నానికి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని అధిష్టానం కోరింది. దానికి ఆయన సానుకూలంగా స్పందించలేదు. వచ్చే ఎన్నికల్లో కేశినేని నాని ఎంపీగా పోటీ చేస్తానని తన అనుచరుల వద్ద చెప్పినట్లు సమాచారం. అయితే ఆయన త్వరలోనే పార్టీ మారే అవకాశం ఉందని తెలుస్తుంది.గత ఏడాది నుంచి వైసీపీ అధిష్టానం ఆయనతో సంప్రదింపులు జరుపుతున్నప్పటికీ ఆయన పార్టీ మానే ప్రసక్తి లేదని చెప్పారు. తాజాగా టీడీపీ సీటు నిరాకరించిందని చెప్పడంతో ఇప్పుడు ఆయనతో మళ్లీ వైసీపీ అధిష్టానం టచ్‌లోకి వెళ్లిందని సమాచారం. త్వరలోనే కార్యకర్తలతో సమావేశం నిర్వహించి తన నిర్ణయాన్ని కేశినేని నాని వెల్లడించే అవకాశం ఉంది.