HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Tdp Chief Chandrababu Naidu Vacation With Family

Babu Vacation: విదేశాల్లో చంద్ర‌బాబు ఫుల్ జోష్ !

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్ర‌బాబు ఎక్కుడున్నాడు? హైద్రాబాద్ లోనా? అమరావ‌తిలోనా? అనే ప్ర‌శ్న టీడీపీ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది. ఆయ‌న కోట‌రీలోని కొంద‌రికి మాత్ర‌మే చంద్ర‌బాబు క‌ద‌లిక‌ల గురించి తెలుసు.

  • Author : CS Rao Date : 30-12-2021 - 5:08 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Chandrababu
Chandrababu

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్ర‌బాబు ఎక్కుడున్నాడు? హైద్రాబాద్ లోనా? అమరావ‌తిలోనా? అనే ప్ర‌శ్న టీడీపీ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది. ఆయ‌న కోట‌రీలోని కొంద‌రికి మాత్ర‌మే చంద్ర‌బాబు క‌ద‌లిక‌ల గురించి తెలుసు. సాధార‌ణంగా చంద్ర‌బాబు కార్య‌క్ర‌మాల‌ షెడ్యూల్ ను టీడీపీ ఆఫీస్ మీడియాకు ఇవ్వ‌డం ఆన‌వాయితీ. ముందు రోజే ఆయ‌న టూర్ షెడ్యూల్ ను మీడియాకు అందించే సంప్ర‌దాయం ఉంది. ఆ మేర‌కు మీడియా అప్ర‌మ‌త్తం కావ‌డంతో పాటు క‌వ‌రేజి కోసం ఏర్పాట్లు చేస్తుంది. కానీ, వారం రోజులుగా ఆయ‌న షెడ్యూల్ మీడియాకు తెలియ‌డంలేదు. ఎక్క‌డ‌కు వెళ్లారో..కూడా అంతుబట్ట‌కుండా ఉంది.

సాధార‌ణంగా హైద్రాబాద్ లేక అమ‌రావ‌తిలో ఉంటే ప్ర‌తి రోజూ ఏదో ఒక అంశంపై స్పందిస్తాడు. నిత్యం ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌పై అధ్య‌య‌నం చేయ‌డం ఆయ‌న‌కు అలవాటు. ప్ర‌భుత్వ ప్ర‌జా వ్య‌తిరేక కార్య‌క్ర‌మాల‌పై గ‌ళం విప్పుతుంటాడు. క్రిస్మ‌స్ కు ముందు నుంచి ఆయ‌న మీడియాకు దూరంగా ఉన్నారు. ఏపీ సీఎం జిల్లాల‌కు వెళ్లిన సంద‌ర్భంగా ఓటీఎస్ పై ప‌లు విధాలుగా మాట్లాడాడు. ఓటీఎస్ విష‌యంలో టీడీపీ చేస్తోన్న ప్ర‌చారంపై మండిప‌డ్డాడు. అయిన‌ప్ప‌టికీ చంద్ర‌బాబు మీడియాకు రాలేదంటే ఆయ‌న ఊర్లో లేడ‌ని కొంద‌రు భావిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే వంగ‌వీటి రాధా `రెక్కీ` అంశంపై స్పందించాడు. ఫోన్లో రాధాతో మాట్లాడాడు. ఏపీ డీజీపీకి లేఖ రాశాడు. అంత‌కు మిన‌హా వారం రోజులుగా చంద్ర‌బాబు సైలెంట్ గా ఉన్నారంటే లోక‌ల్ గా లేడ‌ని పార్టీ వ‌ర్గాల టాక్‌.

ప్ర‌తి ఏడాది విదేశీ టూర్ల‌కు వెళ్ల‌డం గ‌త కొంత కాలంగా చంద్ర‌బాబు అలవాటు చేసుకున్నాడు. వ్య‌క్తిగ‌త టూర్ కు వెళ్లిన సంద‌ర్భాల్లోనూ అన‌ధికారికంగా మీడియాకు లీక్ రావ‌డం స‌హ‌జం. కానీ, ఈసారి మాత్రం ఎలాంటి లీకులు లేకుండా సైలెంట్ గా చంద్ర‌బాబు విదేశీ టూర్‌కు ఫ్యామిలీతో వెళ్లాడ‌ని పార్టీ వ‌ర్గాల టాక్‌. ఆయ‌న‌కు ద‌గ్గ‌ర‌గా ఉండే మీడియాలోనూ బాబు విదేశీ టూర్ గురించి రాలేదు. సోష‌ల్ మీడియాలోనూ పెద్ద‌గా ఎక్క‌డా ఆ వార్త క‌నిపించ‌లేదు. పార్టీలోని కొన్ని వ‌ర్గాలు మాత్రం చంద్ర‌బాబు టూర్ కు వెళ్లాడ‌ని చెబుతున్నాయి. ఏ దేశానికి వెళ్లాడు? ఎన్ని రోజులు అనేది మాత్రం ర‌హ‌స్యంగానే ఉంది. ప్ర‌త్య‌ర్థులు మాత్రం దుబాయ్ వెళ్లి ఉంటార‌ని గుస‌గుస లాడుతున్నారు. ప్ర‌తిప‌క్ష నాయకునిగా ఉన్న చంద్ర‌బాబు విదేశీ టూర్ ను ఎందుకు ర‌హ‌స్యంగా దాచాడ‌ని కొంద‌రు ఇప్పుడిప్పుడే గ‌ళం విప్ప‌డానికి ప్ర‌త్య‌ర్థులు రెడీ అవుతున్నారు.
గ‌తానికి భిన్నంగా చంద్ర‌బాబు జీవ‌న శైలి ప్ర‌స్తుతం ఉంది. నిత్యం పాల‌న‌లో బీజీగా ఉండే చంద్ర‌బాబు కుటుంబాన్ని, బంధువుల్ని, స్నేహితుల‌ను పెద్ద‌గా ప‌ట్టించుకోడు. రాష్ట్రాభివృద్ధి గురించి ఎడ‌తెగ‌ని మీటింగ్ లు పెట్ట‌డం ఆయ‌న‌కు అల‌వాటు. అందుకే ఆయ‌న్ను ప‌ని రాక్ష‌సుడిగా కొంద‌రు ఐఏఎస్ లు పిలుచుకునే వాళ్లు. పాల‌న హ‌డావుడిలో పడి వ్య‌క్తిగ‌త జీవితాన్ని చాలా కోల్పోయాడు. ఆ విష‌యాన్ని ఇటీవ‌ల తెలుసుకున్నాడ‌ని ఆయ‌న అనుచ‌రులు చెబుతుంటారు. అందుకే, ఇటీవల కాలంలో ప్ర‌తి ఏడాది కుటుంబంతో క‌లిసి విదేశీ టూర్ కు వెళుతున్నాడ‌ట‌. ఆ క్ర‌మంలోనే ఈసారి కూడా ఆయ‌న ఫ్యామిలీ టూర్ ఎంజాయ్ చేస్తున్నార‌ని టాక్‌. కొత్త సంవ‌త్సంలో స‌రికొత్త ఊత్సాహంతో ఆయ‌న టూర్ ముగించుకుని వ‌స్తాడ‌ని పార్టీ అంత‌ర్గ‌త వ‌ర్గాల స‌మాచారం. సో..చంద్ర‌బాబు విదేశీ టూర్ లో ఫుల్ జోష్ లో ఉన్నార‌న్న‌మాట‌.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • CBN with family
  • chandrababu naidu
  • tdp
  • TDP chief
  • vacation

Related News

Chandrababu Naidu

Women’s Reservation Bill : దేశ చరిత్రలో ఇదొక బ్లాక్ డే అంటూ చంద్రబాబు ఆవేదన

కేవలం విమర్శలతోనే సరిపెట్టకుండా, ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని చంద్రబాబు నిర్ణయించారు. ప్రతి ఇంటికీ వెళ్లి విపక్షాలు మహిళా బిల్లు విషయంలో చేసిన ద్రోహాన్ని ఎండగడతామని ఆయన ప్రకటించారు. మహిళా సాధికారత అనేది తెలుగుదేశం మరియు ఎన్డీయే కూటమి ప్రధాన అజెండా అని, బిల్లు వీగిపోయినా తమ పోరాటం ఆగదని స్పష్టం

  • Midhun Reddy

    Kutami Govt : కూటమి ఎమ్మెల్యేలు మహిళలను వేధిస్తున్నారంటూ మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

  • Nara Lokesh

    Nara Lokesh : తెలుగుదేశం ‘యువ’ గర్జన.. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నారా లోకేష్‌ పట్టాభిషేకం!

  • Telugu Desam Party Appoints

    NARA LOKESH: పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా మంత్రి నారా లోకేష్

  • Telugu Desam Party Appoints Nara Lokesh as Working President

    Telugu Desam Party: పొలిట్ బ్యూరో, జాతీయ, రాష్ట్ర కమిటీలను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ

Latest News

  • BRS : భారీ సైన్యం తో బిఆర్ఎస్ లో చేరిన జీవన్ రెడ్డి

  • రేప‌టితో ముగియ‌నున్న ఎన్నిక‌ల ప్ర‌చారం..!

  • రేపు బ్యాంకుల‌కు సెల‌వు ఉందా?

  • కియా కారు.. రూ. 3.20 ల‌క్ష‌ల వ‌ర‌కు డిస్కౌంట్‌!

  • నిద్ర‌లేమి స‌మ‌స్య‌.. క‌ళ్ల‌పై ప్ర‌భావం?

Trending News

    • వేసవిలో ఏసీలు ఎందుకు పేలుతాయి?

    • అమెరికా-ఇరాన్ చర్చలకు నో చెప్పిన టెహ్రాన్‌.. ఇస్లామాబాద్‌లో మాత్రం లాక్‌డౌన్!

    • రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి పెరగనున్న కష్టాలు!

    • మ‌రోసారి మెటాలో ఉద్యోగాల కోత‌?!

    • కొత్త జట్టుకు యజమానిగా క్రిస్ గేల్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd