HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Tdp Chief Chandrababu Health Is Stable No Change In His Bp And Weight

Chandrababu Health : చంద్రబాబు ఆరోగ్యంపై జైలు అధికారుల హెల్త్ బులెటిన్.. ఏమన్నారంటే ?

Chandrababu Health : ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ కేసులో అరెస్టయి రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ పై ఉన్న టీడీపీ చీఫ్ చంద్రబాబు ఆరోగ్యంపై జైలు అధికారులు హెల్త్‌ బులిటెన్‌ ను రిలీజ్ చేశారు.

  • Author : Pasha Date : 16-10-2023 - 7:02 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Chandrababu Jail
Chandrababu Jail

Chandrababu Health : ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ కేసులో అరెస్టయి రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ పై ఉన్న టీడీపీ చీఫ్ చంద్రబాబు ఆరోగ్యంపై జైలు అధికారులు హెల్త్‌ బులిటెన్‌ ను రిలీజ్ చేశారు. చంద్రబాబు ఆరోగ్యం నిలకడగానే ఉందని, ఆయన బరువు ప్రస్తుతం 67 కేజీలు ఉందని వెల్లడించారు. చంద్రబాబుకు బీపీ 140/80 గా, పల్స్ నిమిషానికి 70, రెస్పిరేటరీ రేటు నిమిషానికి 12 సార్లు ఉందని చెప్పారు. చంద్రబాబు యాక్టివ్ గా ఉన్నారని, ఫిజికల్‌ యాక్టివిటీలో ఎలాంటి సమస్య లేదని స్పష్టం చేశారు. కోర్టు ఆదేశాలతో చంద్రబాబు ఉండే బ్యారక్ లో టవర్ ఏసీ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

జైలులో చంద్రబాబు డీహైడ్రేషన్ కు గురయ్యారని ఆయనతో ములాఖత్ అనంతరం కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆసుపత్రికి తరలించి చికిత్స ఇప్పించాలని పోలీసులను కోరారు.  డీహైడ్రేషన్ కు గురయ్యాక చంద్రబాబు ఆరోగ్యం క్షీణిస్తోందని, గుండె సమస్య వచ్చే ప్రమాదం ఉందని కుటుంబసభ్యులతో పాటు టీడీపీ నేతలు, ఆయన తరఫు లాయర్లు ఆరోపిస్తున్నారు.

Also Read: Telangana: నల్గొండ పోలీస్ తనిఖీల్లో పట్టుబడ్డ రూ.3.04 కోట్లు

‘‘జైలులో ఉన్న చంద్రబాబుకు స్వల్ప అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. ఛాతీ, చేతులు, వీపు, నడుము, గడ్డం తదితర భాగాల్లో చంద్రబాబుకు ఎర్రటి దద్దుర్లు, పొక్కులు ఏర్పడ్డాయి’’ అంటూ రాజమండ్రికి చెందిన జీజీహెచ్‌ చర్మ వైద్య నిపుణులు డాక్టర్‌ సూర్యనారాయణ, డాక్టర్‌ సీహెచ్‌.వి సునీత జైలు ఉన్నతాధికారులకు నివేదిక ఇచ్చారు. ‘‘రెండు అరచేతుల్లో పొక్కుల వల్ల దురద, శరీరమంతా తెల్లటి పొక్కులు, కొన్ని ప్రాంతాల్లో వేడి కురుపుల వల్ల చంద్రబాబు ఇబ్బంది పడుతున్నారు’’ అని ఆ రిపోర్టులో పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం ఉన్న వాతావరణంలో ఎవరైనా డీహైడ్రేషన్ కు గురయ్యే అవకాశం ఉందని ఈ డాక్టర్లు శనివారం ప్రెస్ మీట్ లో (Chandrababu Health) చెప్పారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • BP
  • chandrababu
  • Chandrababu Health
  • No Change In Wight
  • Rajahmundry Jail

Related News

Chandrababu Once Again Show

CBN Birthday : మరోసారి గొప్ప మనసు చాటుకున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 269 అన్న క్యాంటీన్లలో నేడు రోజంతా ఉచితంగా భోజనం అందించాలని ప్రభుత్వం ఆదేశించింది. పేదవాడి ఆకలి తీర్చడమే లక్ష్యంగా గతంలో ప్రారంభించిన ఈ అన్న క్యాంటీన్లు, నేడు పండుగ వాతావరణంలో వేలాది మందికి ఉచితంగా ఆకలి తీరుస్తున్నాయి

  • I entered politics with the aim of serving the public: CM Chandrababu

    Chandrababu Campaign : తమిళనాడులో చంద్రబాబు ఎన్నికల ప్రచారం

  • Nara Lokesh

    Nara Lokesh : తెలుగుదేశం ‘యువ’ గర్జన.. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నారా లోకేష్‌ పట్టాభిషేకం!

Latest News

  • IPL 2026 – SRH Vs DC : ఢిల్లీ పై 47 రన్స్ తేడాతో SRH విజయం

  • TGSRTC Strike: అర్ధరాత్రి నుండి తెలంగాణలో బస్సులు బంద్

  • IPL 2026 – SRH Vs DC : అభిషేక్ మెరుపులు..DC కి 243 టార్గెట్

  • Good News : ఏపీకి పెద్ద ఎత్తున నిధులు విడుదల చేసిన కేంద్రం

  • Telangana Govt : ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం రేవంత్ గుడ్‌న్యూస్

Trending News

    • అమెరికా-ఇరాన్ మధ్య రేపే రెండో రౌండ్ చర్చలు.. రంగంలోకి ట్రంప్?

    • పాత ఉద్యోగం పోయె.. కొత్త ఆఫర్ వెనక్కి తీసుకెళ్లె! సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆవేదన

    • మారుతున్న శాలరీ స్ట్రక్చర్.. ఎవరికి లాభం? ఎవరికి నష్టం?

    • రేపు బ్యాంకుల‌కు సెల‌వు ఉందా?

    • వేసవిలో ఏసీలు ఎందుకు పేలుతాయి?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd