TDP : చంద్రబాబు చాణక్యం, ఎమ్మెల్సీ ఎన్నికల్లో జగన్ కు జలక్!
టీడీపీ(TDP) అధినేత చంద్రబాబు రాజకీయ అపరచాణక్యుడు. ఇప్పుడు
- By CS Rao Published Date - 12:34 PM, Wed - 15 March 23

టీడీపీ(TDP) అధినేత చంద్రబాబు రాజకీయ అపరచాణక్యుడు. ఇప్పుడు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి(Jagan) నిద్రలేకుండా చేస్తున్నారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పంచుమర్తి అనురాధను పోటీలో ఉంచారు. దీంతో వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలను పదిలంగా ఉంచుకోవాల్సిన దుస్థితి వైసీపీకి ఏర్పడింది. కనీసం 22 మంది ఎమ్మెల్యేలు మొదటి ప్రాధాన్యం ఓటు వేస్తే టీడీపీ అభ్యర్థి అనురాధ గెలుస్తారు. అసెంబ్లీ బులిటెన్ ప్రకారం 23 మంది ఎమ్మెల్యేలు టీడీపీకి ఉన్నారు. కానీ, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, చీరాల ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి, గుంటూరు వెస్ట్ ఎమ్మెల్మే మద్దాల గిరి, విశాఖపట్నం దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ టీడీపీకి దూరంగా ఉన్నారు. వాళ్లు వైసీపీ పంచన అనధికారికంగా చేరిపోయారు. అందుకే, వైసీపీ రెబల్స్ ద్వారా బాబు చక్రం తప్పుతున్నారు.
వైసీపీలో రెబల్ ఎమ్మెల్యేల సంఖ్య పెరుగుతోంది (TDP)
ప్రస్తుతం వైసీపీలో రెబల్ ఎమ్మెల్యేల సంఖ్య పెరుగుతోంది. నెల్లూరు జిల్లాకు చెందిన వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్మే కోటంరెడ్డి శ్రీథర్ రెడ్డి బాహాటంగా జగన్మోహన్ రెడ్డి (Jagan)ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. ఆ పార్టీకి దూరంగా ఉంటూ టీడీపీ (TDP) పంచన పరోక్షంగా ఉన్నారు. వాళ్లతో పాటు మరో ఇద్దరు ఎమ్మెల్యేలు వైసీపీ నుంచి మద్ధతు ఇస్తే టీడీపీ అభ్యర్థి అనూరాధ ఎమ్మెల్సీ గా గెలుపొందారు. అప్పుడు చంద్రబాబు చాణక్యం ఫలిస్తుంది. అందుకే, జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలను గెలిపించుకునే బాధ్యత మంత్రులకు అప్పగించారు. తేడా వస్తే, వేటు తప్పదని మంత్రులకు సంకేతం ఇచ్చారు.
Also Read : YCP Chaos: త్రిబుల్ ఆర్ బాటన వసంత! వైసీపీలో కల్లోలం!
గతంలో మాదిరిగా వైసీపీలో ఇప్పుడు ఎవరూ జగన్మోహన్ రెడ్డికి(Jagan) భయపడే పరిస్థితి కనిపించడంలేదు. పైగా కనీసం 40 నుంచి 70 మంది వరకు ఈసారి ఎన్నికలకు దూరంగా ఉండాలని గత రివ్యూ మీటింగ్ ల్లో జగన్మోహన్ రెడ్డి సంకేతాలు ఇచ్చారు. ఎమ్మెల్యేల గ్రాఫ్ బాగాలేదని చాలా మందికి చురకలు వేశారు. అందుకే, ప్రత్యామ్నాయ మార్గాలను చాలా మంది వైసీపీ ఎమ్మెల్యేలు చూసుకుంటున్నారు. కొందరు టీడీపీ(TDP) అధినేత చంద్రబాబుతో టచ్ లో ఉన్నారు. సమయం చూసి జంప్ కావడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్లు ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండో ప్రాధాన్యత ఓటు అయినా వేస్తారని చంద్రబాబు అంచనా. వాస్తవంగా ఈ ఎన్నికలకు విప్ జారీ చేసే అధికారం పార్టీలకు లేదు. ఆత్మప్రబోధానుసారం ఓటు వేసుకుంటారు. అందుకే, ఆత్మప్రభోదానుసారం ఓటేస్తానని ఆనం రామనారాయణ రెడ్డి చెబుతున్నారు. ఇక కోటంరెడ్డి శ్రీథర్ రెడ్డి అసెంబ్లీ వేదికగా బుధవారం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద వ్యతిరేక గళం విప్పారు. అంటే, కోటంరెడ్డి, ఆనం ఇద్దరూ టీడీపీ అభ్యర్థి అనురాధకు ఓటు వేసే ఛాన్స్ ఉంది.
విజయసాయిరెడ్డి, జగన్మోహన్ రెడ్డి మధ్య గ్యాప్
ముందుచూపుతో చంద్రబాబు టీడీపీ(TDP) అభ్యర్థిగా అనురాధను రంగంలోకి దింపారు. పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు చంద్రబాబుతో టచ్ లో ఉన్నారని, తమకే ఓటేస్తారని మాజీ మంత్రి చినరాజప్ప బాహాటంగా చెబుతున్నారు. ఈ ఎన్నికలను అసెంబ్లీ వేదికగా ఈనెల 23వ తేదీన పోలింగ్, అదే రోజు కౌంటింగ్ కూడా జరగనుంది. మార్చి 25వ తేదీతో ఎన్నికల ప్రక్రియ ముగియనుంది. ఆ రోజుకు వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు రహస్యంగా ఓటు వేసే అవకాశం ఉంది. గత రెండేళ్లుగా సుమారు 40 మంది ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డి(Jagan) మీద ఆగ్రహంగా ఉన్నారని అప్పుడప్పడు ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వం కూడా పడిపోతుందని కూడా ఒకానొక సందర్భంలో విస్తృతంగా ప్రచారం నడిచింది. ఇప్పుడు ఎంపీ విజయసాయిరెడ్డి, జగన్మోహన్ రెడ్డి మధ్య కూడా గ్యాప్ వచ్చిందని వినికిడి. దానితో పాటు అమరావతి రాజధాని విషయంలో సుమారు 25 మంది జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా గళం విప్పుతున్నారని తెలుస్తోంది. ఏడాది క్రితం ప్రకాశం జిల్లా కందుకూరు ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి కూడా అసహనం వ్యక్తపరిచారు. అంతేకాదు, ఆ జిల్లాకు చెందిన అన్నా రాంబాబు కూడా అసంతృప్తిగా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇలా, చెప్పుకుంటూ పోతే, 25 మంది ఎమ్మెల్యేల వరకు వ్యతిరేకంగా ఉన్నారని తెలుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు చాణక్యం ఎలా ఫలిస్తుందో చూడాలి.
Also Read : TDP MP Kesineni Nani : ఏపీలో అభివృద్ధి జరగాలంటూ మళ్లీ చంద్రబాబు పాలన రావాలి – టీడీపీ ఎంపీ కేశినేని నాని

Related News

Chandrababu Vision 2047: చంద్రబాబు విజన్ 2047, ఆవిర్భావ సభలో తెలుగుజాతికి దిశానిర్దేశం
సంక్షేమం , అభివృద్ధి ప్లస్ అసమానతల సంస్కరణ వెరసి విజన్ 2047 గా తెలుగు వాళ్లకు పిలుపునిచ్చారు. వందేళ్ల స్వతంత్ర భారతంలో తెలుగు జాతి ముందు వరుసలో ఉండాలని..