HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Target Rgv Varma Who Has Been Caste Ridden Kapu Race Reverses On Rip

Target RGV : కులాల కుంప‌టిపెట్టిన వ‌ర్మ‌! `రిప్` పై కాపు జాతి రివ‌ర్స్ !

వ‌ర్మ మీద కాపు సంఘాలు ఫైర్(Target RGV) అవుతున్నాయి. ఆయ‌న ట్వీట్ దుమారం రేపుతోంది.

  • Author : CS Rao Date : 10-01-2023 - 1:11 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Target RGV
Rgv

వివాద‌స్ప‌ద ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ మీద కాపు సంఘాలు ఫైర్(Target RGV) అవుతున్నాయి. `రిప్ కాపులు..కంగ్రాచ్యులేష‌న్స్ క‌మ్మోళ్లు` అంటూ ఆయ‌న పెట్టిన ట్వీట్ దుమారం రేపుతోంది. కాపు సామాజిక‌వ‌ర్గాన్ని కించ‌ప‌రిచేలా ఆయ‌న ట్వీట్ ఉంద‌నిఆగ్ర‌హిస్తున్నారు. ఆయ‌న్ను నిల‌దీయ‌డానికి సిద్ధమ‌య్యారు. అంతేకాదు, వ‌ర్మ  మీద పోలీసు కేసు పెట్టాల‌ని కాపు(kapu) జేఏసీ నిర్ణ‌యించింది . విజయవాడలోని ప్రెస్ క్లబ్‌లో కాపు(kapu) సంఘాల జేఏసీ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి ఆ మేర‌కు నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు తెలుస్తోంది.

కాపు సంఘాలు ఫైర్ (Target RGV)

హైద‌రాబాద్ కేంద్రంగా చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ల్యాణ్ రెండు. రోజులు క్రితం భేటీ అయ్యారు. ఆ భేటీని ఉద్దేశించి వ‌ర్మ ట్వీట్ చేశారు. రాబోవు రోజుల్లో పొత్తు పెట్టుకోవ‌డానికి ప‌వ‌న్ సిద్ధ‌మ‌య్యార‌ని వ‌ర్మ భావిస్తున్నారు. అందుకే, కాపుల‌ను అమ్మేయ‌డానికి ప‌వ‌న్ సిద్ధ‌మ‌య్యార‌ని ట్వీట్ పెట్టారు. గ‌తంలోనూ రాజ‌కీయ నాయ‌కునిగా ప‌వ‌న్ ప‌నికిరాడ‌ని ప‌లుమార్లు వ‌ర్మ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కేవ‌లం హీరోగా మాత్ర‌మే ప‌నికొస్తార‌ని, రాజ‌కీయాల్లో ప‌వ‌న్ ఒక హాస్య‌న‌టుడు మాత్ర‌మేనంటూ ప‌లు సంద‌ర్భాల్లో ప్ర‌స్తావించారు. సీరియ‌స్ పొలిటిష‌న్ కాద‌ని చెబుతూ జ‌న‌సేన మీద సోష‌ల్ మీడియా వేదిక‌గా వ‌ర్మ వార్ చేశారు. ప్ర‌తిగా ప‌వ‌న్ ఫ్యాన్స్ ఆయ‌న మీద దాడికి య‌త్నంచింది. అయిన‌ప్ప‌టికీ ఏ మాత్రం వెన‌క్కు త‌గ్గ‌ని ఆర్జీవీ దాడిని (Target RGV) కొన‌సాగిస్తున్నారు.

Also Read :RIP RGV : జ‌గ‌న్ కు వ‌ర్మ‌, శ్రీరెడ్డి జై! స్లీప‌ర్ సెల్స్ త‌ర‌హాలో సోష‌ల్ సెల్స్ !

రాంగోపాల్ వర్మ తాజాగా చేసిన ట్వీట్ వెనక వైసీపీ నాయకుల హస్తం ఉందని కాపు సంఘాల జేఏసీ విశ్వ‌సిస్తోంది. కాపు ఐక్యనాడు రాష్ట్ర అధ్యక్షుడు బేతు రామ్మోహన్‌రావు మాట్లాడుతూ చంద్రబాబు-పవన్ కల్యాణ్ భేటీపై వర్మ ట్వీట్ వెనక వైసీపీ నేతల హస్తం ఉందని అనుమానించారు. కాపు మంత్రులు తమ జాతిని ముఖ్యమంత్రికి తాకట్టుపెట్టారని మండిపడ్డారు. కాపులపై కుట్రలో భాగంగానే ఆర్జీవీ ఈ ట్వీట్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు కాపు నేతలు పాల్గొన్నారు కాగా, నిన్న రాంగోపాల్ వర్మ ట్వీట్ చేస్తూ పవన్ కల్యాణ్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. డబ్బు కోసం సొంత కాపులను అమ్మేస్తాడని తాను ఊహించలేదన్నారు. ‘రిప్ కాపులు.. కంగ్రాచ్యులేషన్స్ కమ్మోళ్లు’ అని ట్వీట్ చేశారు.

చంద్ర‌బాబునాయుడు మీద వ‌ర్మ

తెలుగుదేశం పార్టీ కంటే చంద్ర‌బాబునాయుడు మీద వ‌ర్మ ఎప్ప‌టిక‌ప్పుడు విరుచుకుప‌డుతుంటారు. ఆయ‌న 2019 ఎన్నిక‌ల సంద‌ర్భంగా బాబు, లోకేష్ ను టార్గెట్ చేశారు. రెండు సినిమాల‌ను వైసీపీ నేత‌ల పెట్టుబ‌డితో తీశారు. ఆ రెండు సినిమాలు లక్ష్మీస్ ఎన్టీఆర్, క‌మ్మ రాజ్యంలో క‌డప రెడ్లు. వాటికి పెట్టుబ‌డి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి అనుచ‌రులు పెట్టార‌ని టీడీపీ అప్ప‌ట్లో ఆరోపించింది. ఈసారి కూడా వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి రెండు సినిమాల‌ను నిర్మించ‌డానికి సిద్ద‌మ‌య్యారు. వాటికి కూడా వైసీపీ నేత‌లు పెట్టుబ‌డి పెడుతున్నార‌ని తెలుస్తోంది. వాళ్ల ద్వారా వ‌స్తోన్న పెట్టుబ‌డుల కోసం చంద్ర‌బాబును టార్గెట్ చేస్తూ వ‌ర్మ ఎప్ప‌టిక‌ప్పుడు వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని టీడీపీ న‌మ్ముతోంది.

Also Read : RGV: చంద్రబాబుకు వ్యతిరేకంగా `వర్మ` సినిమాలు – స్క్రీన్ ప్లే, డైరెక్షన్ జగన్..!

తొలి నుంచి జ‌న‌సేనాని ప‌వ‌న్ ను వ‌ర్మ టార్గెట్ చేస్తుంటారు. టాలీవుడ్ డైరెక్ట‌ర్ గా ప‌వ‌న్ గురించి బాగా వ‌ర్మకు తెలుసు. పైగా ప‌వ‌న్ ఫ్యాన్స్ ఎంత అగ్రెసివ్ గా సోష‌ల్ మీడియాలో ఉంటారు అనేది కూడా వ‌ర్మ‌కు తెలియ‌ని విష‌యం కాదు. అయిన‌ప్ప‌టికీ ధైర్యంగా అటాక్ చేస్తూ జన‌సేన పార్టీని ఎప్పటిక‌ప్పుడు నిల‌దీస్తున్నారు. ఇప్పుడు ఏకంగా ప‌వ‌న్ తో పాటు ఆయ‌న సామాజిక‌వ‌ర్గాన్ని కూడా కించ‌ప‌రిచేలా ట్వీట్ చేయ‌డం దుమారం రేపుతోంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Andhra police
  • Kapu caste
  • Kapu leader
  • Pawan Kalyan
  • rgv comments

Related News

Pawan Praises Modi's Leader

Pawan Health : పవన్ కళ్యాణ్ కు స్వయంగా ఫోన్ చేసి ఆరోగ్య వివరాలు అడిగిన మోడీ !!

"పవన్ కళ్యాణ్ గారు చాలా ధైర్యవంతులు, ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను" అంటూ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ప్రధాని పోస్ట్ చేశారు. దీనిపై పవన్ కళ్యాణ్ స్పందిస్తూ.. తీరిక లేని షెడ్యూల్‌లో కూడా తన ఆరోగ్యంపై శ్రద్ధ చూపినందుకు ప్రధానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

  • Pawan Kalyan Surgery

    Pawan Kalyan Surgery : పవన్ కళ్యాణ్ కు జరిగిన సర్జరీ ఇదేనా?

  • Pawan Soundarya

    Pawan-Soundarya : సౌందర్య ను రిజక్ట్ చేసిన పవన్…లేకపోతే ఆ సినిమాలో ఆమెనే హీరోయిన్ !!

  • Og2

    Pawan Kalyan OG 2 : OG 2 కు పవన్ కళ్యాణ్ నిర్మాత ?

Latest News

  • నేడు ర‌స‌వ‌త్త‌ర పోరు.. స‌న్‌రైజ‌ర్స్ విజ‌యాల‌కు ఢిల్లీ బ్రేక్ వేయ‌గ‌ల‌దా?

  • IPL: ‘పవర్’ప్లే లో ఎక్కువ సిక్సర్లు బాదిన ప్లేయర్లు వీరే..!!

  • Cake : వామ్మో ఒక్క కేక్ తయారీకి 3,500 గంటల సమయం!

  • ప్రధాని మోదీకి ఉల్లిపాయలు ఇష్టమేనా?

  • KCR సభపై కవిత దారుణమైన కామెంట్స్

Trending News

    • అమెరికా-ఇరాన్ మధ్య రేపే రెండో రౌండ్ చర్చలు.. రంగంలోకి ట్రంప్?

    • పాత ఉద్యోగం పోయె.. కొత్త ఆఫర్ వెనక్కి తీసుకెళ్లె! సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆవేదన

    • మారుతున్న శాలరీ స్ట్రక్చర్.. ఎవరికి లాభం? ఎవరికి నష్టం?

    • రేపు బ్యాంకుల‌కు సెల‌వు ఉందా?

    • వేసవిలో ఏసీలు ఎందుకు పేలుతాయి?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd