Pithapuram : పవన్‌కు వర్మ మాస్ ఎలివేషన్.. మాములుగా లేదుగా..!
ఇటీవల ఏపీలో జరిగిన ఎన్నికల్లో పిఠాపురం టీడీపీ ఇన్‌ఛార్జ్ ఎస్వీఎస్ఎన్ వర్మ ప్రత్యేకమనే చెప్పాలి. గత కొన్నేళ్లుగా ఎన్ని క్లిష్టపరిస్థితులు వచ్చినా.. పార్టీని.. కేడర్‌ను వదలకుండా స్థానికంగానే ఉంటూ.. ప్రజలకు సేవ చేస్తూ వచ్చారు.
- By Kavya Krishna Published Date - 06:32 PM, Sat - 25 May 24

ఇటీవల ఏపీలో జరిగిన ఎన్నికల్లో పిఠాపురం టీడీపీ ఇన్‌ఛార్జ్ ఎస్వీఎస్ఎన్ వర్మ ప్రత్యేకమనే చెప్పాలి. గత కొన్నేళ్లుగా ఎన్ని క్లిష్టపరిస్థితులు వచ్చినా.. పార్టీని.. కేడర్‌ను వదలకుండా స్థానికంగానే ఉంటూ.. ప్రజలకు సేవ చేస్తూ వచ్చారు. అధికార వైసీపీ నేతల కుతంత్రాలకు దెబ్బతిన్న వారెందరికో వర్మ అండగా నిలిచారు. పిఠాపురం నియోజకవర్గ వ్యాప్తంగా పార్టీ శ్రేణులకు.. ప్రజలకు ఎప్పుడూ అందుబాటు ఉండి పార్టీ బలోపేతానికి కృషి చేశారు.. ఇదే సమయంలో ఏపీ ఎన్నికలకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇవ్వడంతో ఈ సారి పిఠాపురంలో పార్టీని గెలిపించుకునేందకు నడుం బిగించారు. అయితే.. ఈ ఎన్నికల్లో టీడీపీతో జనసేన, బీజేపీ పొత్తు పెట్టుకోవడంతో.. పిఠాపురం సీటు జనసేన కేటాయించాల్సి వచ్చింది. అయితే.. ఈ నేపథ్యంలో పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మాట శిరోధార్యంగా భావించి.. జనసేనానితో కలిసి.. వర్మ కూటమి గెలుపు ఎంతగానో కృషి చేశారు.
We’re now on WhatsApp. Click to Join.
పిఠాపురం నియోజకవర్గం ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు పిఠాపురం టీడీపీ ఇన్‌ఛార్జ్ ఎస్వీఎస్ఎన్ వర్మ వెన్నుదన్నుగా నిలిచారు. పిఠాపురం టికెట్ రాకపోవడంతో వర్మ మొదట్లో మనస్తాపానికి గురైనా, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆయన్ను ఒప్పించారు. వీరి భేటీ తర్వాత వర్మ నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ కోసం అవిశ్రాంతంగా పనిచేశారు.
ప్రచారంలో పవన్‌కు పెద్ద బలం అయిన ఆయన నియోజకవర్గంలో కూటమి విజయంపై అత్యంత విశ్వాసంతో ఉన్నారు. పిఠాపురంలో పవన్ రికార్డు మెజారిటీ సాధిస్తారని ధీమాగా చెప్పారు. ఇదిలా ఉంటే అధికార వైసీపీ నేతలు అతి విశ్వాసంతో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కు ఉన్న పాపులారిటీని చిన్నచూపు చూస్తున్నారు. పిఠాపురం సీటును పవన్ కోల్పోవడం ఖాయమని వారు అభిప్రాయపడ్డారు.
కొడాలి నాని, రోజా వంటి వైసీపీ నేతలు మరో అడుగు ముందుకేసి రాష్ట్ర అసెంబ్లీ గేట్లను కూడా పవన్‌ను తాకనివ్వబోమని సవాల్ విసిరారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వారి ప్రకటనల గురించి వర్మ ప్రశ్నించగా, “తాకడం ఏంటి? గేట్ ని తన్నుకుంటూ వెళతాడు.” ఈ ప్రకటనతో, పవన్ కళ్యాణ్‌కు “మాస్ ఎలివేషన్” ఇచ్చాడు వర్మ, పవన్ విజయంపై విశ్వాసం వ్యక్తం చేశాడు. ఇదిలా ఉండగా వర్మ చేసిన ప్రకటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Read Also : Nara Lokesh : వైసీపీ నేతలు లోకేశ్‌ను మిస్సవుతున్నారా..?